LIVE
Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!  •  Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  Promotions: దేవాదాయ శాఖలో భారీ ప్రమోషన్లు.. గ్రేడ్-1 ఆఫీసర్లుగా 26 మంది ఈఓలకు పదోన్నతులు!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  •  AP CRDA: 0.4 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రూపుదిద్దుకుంటున్న నీరుకొండ రిజర్వాయర్...  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
Entertainment

Rashmi: హింసను ఆపండి.. నన్ను తిట్టడం కాదు.. వైసీపీ ట్రోలర్ల నోరు మూయించిన రష్మీ గౌతమ్.! వారికే నా మద్దతు..

Rashmi: ప్రముఖ యాంకర్ రష్మీ గౌతమ్ మరోసారి వార్తల్లో నిలిచారు. ఇంధన ధరల పెరుగుదలకు నిరసనగా తిరుపతిలో వైసీపీ నేత అభినయ్ రెడ్డి (భూమన కరుణాకర్ రెడ్డి కుమారుడు) ఆటోను ఎడ్లబండిపై ఉంచి ర్యాలీ నిర్వహించడాన్ని ఆమె తప్పుబట్టారు.

AndhraPravasi News Desk 1 min read
Rashmi: హింసను ఆపండి.. నన్ను తిట్టడం కాదు.. వైసీపీ ట్రోలర్ల నోరు మూయించిన రష్మీ గౌతమ్.! వారికే నా మద్దతు..
  • రాజకీయ ప్రచారం కోసం జంతువులను హింసించడం హేయమైన చర్య అన్న రష్మీ..
     
  • Cinema: ఎడ్లబండిపై ఆటోను ఉంచి ర్యాలీ నిర్వహించిన వైసీపీ నేత అభినయ్ రెడ్డి..

Rashmi: ప్రముఖ యాంకర్ రష్మీ గౌతమ్ మరోసారి తన సామాజిక స్పృహను చాటుకుంటూ వార్తల్లో నిలిచారు. ఇంధన ధరల పెరుగుదలకు నిరసనగా తిరుపతిలో వైసీపీ నేత అభినయ్ రెడ్డి ఒక ఆటోను ఎడ్లబండిపై ఉంచి ర్యాలీ నిర్వహించగా, ఆ చర్యను ఆమె తీవ్రంగా తప్పుబట్టారు. కేవలం రాజకీయ ప్రచారం కోసం మూగజీవాలను హింసించడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని, ఇది హేయమైన చర్య అని ఆమె మండిపడ్డారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో సోషల్ మీడియాలో ఆమెపై పెద్ద ఎత్తున ట్రోలింగ్ మొదలైనప్పటికీ, రష్మీ ఏమాత్రం వెనక్కి తగ్గకుండా ధీటుగా స్పందించారు.

తాను ఏ మతానికో లేదా రాజకీయ పార్టీకో వ్యతిరేకిని కాదని, తన పోరాటం కేవలం జంతువులపై జరిగే క్రూరత్వానికి వ్యతిరేకంగానే ఉంటుందని ఆమె ఎక్స్‌ (X) వేదికగా స్పష్టం చేశారు. గతంలో జంతుబలుల గురించి ప్రస్తావించినా, ఏనుగులపై జరిగే హింసను ప్రశ్నించినా తనను వ్యక్తిగతంగా దూషించారని, చివరకు దేశద్రోహి అని కూడా ముద్ర వేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఇలాంటి విమర్శలకు తాను భయపడబోనని, ఏ రాజకీయ పార్టీ అయితే జంతు సంక్షేమం కోసం నిజాయతీగా పనిచేస్తుందో, ఆ పార్టీకి తాను బహిరంగంగా మద్దతు ఇస్తానని ఆమె పేర్కొన్నారు. అనవసరమైన విమర్శలతో సమయం వృధా చేయకుండా, సమాజంలో మూగజీవాలపై జరుగుతున్న హింసను ఆపడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రష్మీ ట్రోలర్లకు హితవు పలికారు.

Be the first to react

More Coverage

Drishyam 3: జార్జ్‌కుట్టి ట్విస్టులు ఇక ఇంట్లోనే.. ‘దృశ్యం 3’ అఫీషియల్ ఓటీటీ డేట్ ఫిక్స్! స్ట్రీమింగ్ ఎక్కడ? ఎప్పుడు?

Drishyam 3: జార్జ్‌కుట్టి ట్విస్టులు ఇక ఇంట్లోనే.. ‘దృశ్యం 3’ అఫీషియల్ ఓటీటీ డేట్ ఫిక్స్! స్ట్రీమింగ్ ఎక్కడ? ఎప్పుడు?

Drishyam 3: మలయాళ స్టార్‌ హీరో మోహన్‌లాల్‌ నటించిన సస్పెన్స్‌ థ్రిల్లర్‌ ‘దృశ్యం 3’ ఓటీటీ విడుదల తేద…

Sonu Sood: ఒకప్పుడు టాయిలెట్ దగ్గర పేపర్లు పరుచుకుని పడుకున్నా.. ఇప్పుడు వందే భారత్‌లో.. సోనూ సూద్ భావోద్వేగం!

Sonu Sood: ఒకప్పుడు టాయిలెట్ దగ్గర పేపర్లు పరుచుకుని పడుకున్నా.. ఇప్పుడు వందే భారత్‌లో.. సోనూ సూద్ భావోద్వేగం!

Sonu Sood: నటుడు సోనూ సూద్ ఇటీవల వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించారు. ఈ ఆధునిక రైలు ప్రయాణం ఆయనన…