LIVE
Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!  •  Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  Promotions: దేవాదాయ శాఖలో భారీ ప్రమోషన్లు.. గ్రేడ్-1 ఆఫీసర్లుగా 26 మంది ఈఓలకు పదోన్నతులు!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  •  AP CRDA: 0.4 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రూపుదిద్దుకుంటున్న నీరుకొండ రిజర్వాయర్...  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
Entertainment

Tollywood: టాలీవుడ్‌లో 'పెద్ది' సెగ: నిర్మాతలు వర్సెస్ ఎగ్జిబిటర్లు.. ముదురుతున్న పర్సంటేజీ వివాదం!

Tollywood: రామ్ చరణ్ 'పెద్ది' సినిమా విడుదలకు ముందు టాలీవుడ్‌లో నిర్మాతలు వర్సెస్ ఎగ్జిబిటర్లు అన్నట్లుగా మారింది. ఈ సినిమా జూన్ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది.

AndhraPravasi News Desk 2 min read
Tollywood: టాలీవుడ్‌లో 'పెద్ది' సెగ: నిర్మాతలు వర్సెస్ ఎగ్జిబిటర్లు.. ముదురుతున్న పర్సంటేజీ వివాదం!
  • పర్సంటేజీ విధానం అనుమతించిన సినిమాలనే ప్రదర్శిస్తామన్న ఎగ్జిబిటర్లు..
     
  • Cinema: పెద్ది సినిమా విడుదలకు ముందు టాలీవుడ్‌లో పర్సంటేజీపై చర్చ..

Tollywood: రామ్ చరణ్ నటించిన భారీ చిత్రం 'పెద్ది' జూన్ 4న విడుదలకు సిద్ధమవుతున్న తరుణంలో, టాలీవుడ్‌లో నిర్మాతలు మరియు ఎగ్జిబిటర్ల మధ్య నెలకొన్న వివాదం ముదిరి పాకాన పడింది. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో పర్సంటేజీ (వాటా) విధానానికి అంగీకరించే సినిమాలను మాత్రమే ప్రదర్శిస్తామంటూ తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ తీసుకున్న నిర్ణయం పరిశ్రమలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ పరిణామంపై యాక్టివ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ బుధవారం అత్యవసరంగా మీడియా సమావేశాన్ని నిర్వహించి తమ అసహనాన్ని వ్యక్తం చేసింది. రవిశంకర్ యలమంచిలి, నాగవంశీ, సాహు గారపాటి వంటి ప్రముఖ నిర్మాతలు పాల్గొన్న ఈ సమావేశంలో, పరిశ్రమలోని మూడు కీలక రంగాలు (నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు) పరస్పరం చర్చించుకోకుండా ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం సరైన పద్ధతి కాదని హితవు పలికారు.

ఈ వివాదంపై నిర్మాత రవిశంకర్ స్పందిస్తూ, తాము ఎగ్జిబిటర్లకు ఏమాత్రం వ్యతిరేకం కాదని, సినిమా అనేది అందరి సామూహిక కష్టమని గుర్తుచేశారు. చిత్ర పరిశ్రమలో ఒక ఎకో సిస్టమ్ ఉందని, ఎగ్జిబిటర్ల ఇబ్బందులను తాము అర్థం చేసుకున్నప్పటికీ, సమస్యలను చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలని సూచించారు. ఎగ్జిబిటర్ వ్యవస్థలో మార్పులు అవసరమని అంగీకరిస్తూనే, ఇప్పటికిప్పుడు మార్పులు తీసుకురావాలని ఒత్తిడి చేయడం సాధ్యం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. గతంలో 'హరిహర వీరమల్లు' విడుదల సమయంలో మొదలైన ఈ పర్సంటేజీ చర్చ, ఇప్పుడు 'పెద్ది' వంటి పెద్ద సినిమా విడుదలకు సిద్ధంగా ఉన్న సమయంలో బ్లాక్‌మెయిల్ చేసే స్థాయికి వెళ్లడం విచారకరమని నిర్మాతలు ఆవేదన వ్యక్తం చేశారు.

నిర్మాత నాగవంశీ ఈ విషయంలో మరింత ఘాటుగా స్పందిస్తూ, ఎగ్జిబిటర్లు కోరుతున్న పర్సంటేజీని ఇవ్వడం నిర్మాతలకు సాధ్యం కాదని స్పష్టం చేశారు. మల్టీప్లెక్స్ అధినేతలే సింగిల్ స్క్రీన్ కష్టాల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని, పర్సంటేజీ కావాలని డిమాండ్ చేస్తున్న 23 థియేటర్లు ప్రస్తుతం లీజులోనే ఉండటం హాస్యాస్పదమని ఆయన ఎద్దేవా చేశారు. ఏకపక్ష నిర్ణయాల వల్ల పరిశ్రమకే నష్టం జరుగుతుందని, తక్షణమే అందరూ కలిసి కూర్చుని సామరస్య పూర్వక పరిష్కారాన్ని వెతకాలని గిల్డ్ సభ్యులు డిమాండ్ చేశారు. 'పెద్ది' సినిమా విడుదలపై ఈ వివాదం ప్రభావం చూపే అవకాశం ఉండటంతో, ఇండస్ట్రీలో ఇప్పుడు ఏం జరగబోతుందనేది ఆసక్తికరంగా మారింది.

Be the first to react

More Coverage

Drishyam 3: జార్జ్‌కుట్టి ట్విస్టులు ఇక ఇంట్లోనే.. ‘దృశ్యం 3’ అఫీషియల్ ఓటీటీ డేట్ ఫిక్స్! స్ట్రీమింగ్ ఎక్కడ? ఎప్పుడు?

Drishyam 3: జార్జ్‌కుట్టి ట్విస్టులు ఇక ఇంట్లోనే.. ‘దృశ్యం 3’ అఫీషియల్ ఓటీటీ డేట్ ఫిక్స్! స్ట్రీమింగ్ ఎక్కడ? ఎప్పుడు?

Drishyam 3: మలయాళ స్టార్‌ హీరో మోహన్‌లాల్‌ నటించిన సస్పెన్స్‌ థ్రిల్లర్‌ ‘దృశ్యం 3’ ఓటీటీ విడుదల తేద…

Sonu Sood: ఒకప్పుడు టాయిలెట్ దగ్గర పేపర్లు పరుచుకుని పడుకున్నా.. ఇప్పుడు వందే భారత్‌లో.. సోనూ సూద్ భావోద్వేగం!

Sonu Sood: ఒకప్పుడు టాయిలెట్ దగ్గర పేపర్లు పరుచుకుని పడుకున్నా.. ఇప్పుడు వందే భారత్‌లో.. సోనూ సూద్ భావోద్వేగం!

Sonu Sood: నటుడు సోనూ సూద్ ఇటీవల వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించారు. ఈ ఆధునిక రైలు ప్రయాణం ఆయనన…