మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా నటిస్తున్న కొత్త చిత్రం ‘మన శంకరవర ప్రసాద్’ (MSG) నుంచి చిత్ర బృందం మరో కీలక అప్‌డేట్‌ను విడుదల చేసింది. ఇప్పటికే విడుదలైన తొలి పాట ‘మీసాల పిల్ల’ చార్ట్‌బస్టర్‌గా నిలిచి సంగీత ప్రియులను అలరిస్తుండగా, తాజాగా రెండో పాట విడుదల తేదీని అధికారికంగా ప్రకటించింది.
‘శశిరేఖ’ పేరుతో రానున్న ఈ రెండో పాటను ఈ నెల 8న విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది.
దీనికి రెండు రోజుల ముందుగా అంటే ఈ నెల 6న ఈ పాటకు సంబంధించిన ప్రోమోను అభిమానుల ముందుకు తీసుకురానున్నారు. తొలి పాట సృష్టించిన ప్రభంజనంతో రెండో పాటపై అంచనాలు భారీగా పెరిగాయి.
ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మెగాస్టార్‌తో పాటు విక్టరీ వెంకటేశ్, నయనతార, కేథరిన్ థ్రెసా వంటి అగ్ర తారలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, సుష్మిత కొణిదెల, వి. హరికృష్ణ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో బాణీలు అందిస్తున్నారు. ఇలా భారీ తారాగణం, ప్రముఖ సాంకేతిక నిపుణులతో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.