Science Expo Tour: శాస్త్ర విజ్ఞానానికి కొత్త అనుభవం.. సైన్స్ ఎక్స్‌పోజర్ టూర్‌లో ఏపీ స్టూడెంట్స్! AP Schools: పండగలే లేవు.. హాలిడేలు కూడా తక్కువే..! నవంబర్‌ షెడ్యూల్‌ రిలీజ్‌..! MAT: మేనేజ్‌మెంట్‌ అడ్మిషన్లకు దరఖాస్తులు ప్రారంభం..! డిసెంబర్‌లో పరీక్ష తేదీలు ఖరారు..! US Visa: యూఎస్ వెళ్లాలనుకునే విద్యార్థులకు భారీ షాక్! 40 సెకన్లలో వీసా రిజెక్ట్! CA Results: సీఏ ఫైనల్‌, ఇంటర్‌ ఫలితాలు విడుదల..! వెంటనే చెక్‌ చేసుకోండి..! JEE Main: జేఈఈ మెయిన్‌–2026 రిజిస్ట్రేషన్‌ ప్రారంభం..! పరీక్షలు అప్పటి నుంచే ప్రారంభం..! CLAT: లా చదవాలనుకునే విద్యార్థులకు అలర్ట్‌..! క్లాట్‌ 2026కు దరఖాస్తు గడువు సమీపంలో..! TET: టెట్‌ అభ్యర్ధులకు గుడ్‌న్యూస్..! అభ్యర్థులకు ప్రభుత్వం ఉచిత శిక్షణ.. దరఖాస్తులు ప్రారంభం..! Holidays:అక్టోబర్‌ తర్వాత నవంబర్‌లో కూడా సెలవుల హంగామా..! విద్యార్థుల ఆనందానికి హద్దుల్లేవు..! Students: ఉచిత విద్యకు గోల్డెన్‌ ఛాన్స్‌..! ‘శ్రేష్ఠ–2026’ ప్రవేశ పరీక్ష నోటిఫికేషన్‌ విడుదల..! Science Expo Tour: శాస్త్ర విజ్ఞానానికి కొత్త అనుభవం.. సైన్స్ ఎక్స్‌పోజర్ టూర్‌లో ఏపీ స్టూడెంట్స్! AP Schools: పండగలే లేవు.. హాలిడేలు కూడా తక్కువే..! నవంబర్‌ షెడ్యూల్‌ రిలీజ్‌..! MAT: మేనేజ్‌మెంట్‌ అడ్మిషన్లకు దరఖాస్తులు ప్రారంభం..! డిసెంబర్‌లో పరీక్ష తేదీలు ఖరారు..! US Visa: యూఎస్ వెళ్లాలనుకునే విద్యార్థులకు భారీ షాక్! 40 సెకన్లలో వీసా రిజెక్ట్! CA Results: సీఏ ఫైనల్‌, ఇంటర్‌ ఫలితాలు విడుదల..! వెంటనే చెక్‌ చేసుకోండి..! JEE Main: జేఈఈ మెయిన్‌–2026 రిజిస్ట్రేషన్‌ ప్రారంభం..! పరీక్షలు అప్పటి నుంచే ప్రారంభం..! CLAT: లా చదవాలనుకునే విద్యార్థులకు అలర్ట్‌..! క్లాట్‌ 2026కు దరఖాస్తు గడువు సమీపంలో..! TET: టెట్‌ అభ్యర్ధులకు గుడ్‌న్యూస్..! అభ్యర్థులకు ప్రభుత్వం ఉచిత శిక్షణ.. దరఖాస్తులు ప్రారంభం..! Holidays:అక్టోబర్‌ తర్వాత నవంబర్‌లో కూడా సెలవుల హంగామా..! విద్యార్థుల ఆనందానికి హద్దుల్లేవు..! Students: ఉచిత విద్యకు గోల్డెన్‌ ఛాన్స్‌..! ‘శ్రేష్ఠ–2026’ ప్రవేశ పరీక్ష నోటిఫికేషన్‌ విడుదల..!

కృష్ణానదిపై హైలెవల్ బ్రిడ్జి.. రూ. 109 కోట్ల నిధులు మంజూరు! తీరనున్న ఆ ప్రాంతవాసుల ఏళ్ల నాటి కల..

2025-11-07 12:57:00
Canada Plans: అమెరికాకు షాక్.. కెనడా మాస్టర్ ప్లాన్.. హెచ్-1బీ వీసాదారులకు గుడ్‌ న్యూస్.!

కృష్ణా జిల్లాలోని ఎదురుమొండి దీవుల (Edurumondi Islands) 20 వేల మంది ప్రజల ఏళ్లనాటి కల ఇన్నాళ్లకు నెరవేరనుంది. వారి చిరకాల వాంఛ అయిన ఏటిమొగ - ఎదురుమొండి బ్రిడ్జి (Etumoga - Edurumondi Bridge) నిర్మాణ ప్రక్రియకు ఇప్పుడు వేగం పుంజుకోనుంది.

మోటోరోలా బంపర్ ఆఫర్.. రూ. 3000 తగ్గింపుతో.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్ ఫోన్ మీ సొంతం! 256GB స్టోరేజీ, వైర్‌లైస్ ఛార్జింగ్‌ సహా!

ఈ ముఖ్యమైన అంశం మీద ఏపీ ఉప ముఖ్యమంత్రి (AP Deputy CM) పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ప్రత్యేకంగా దృష్టి సారించారు. బుధవారం రోజున మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో కృష్ణా జిల్లా, అవనిగడ్డ నియోజకవర్గ అభివృద్ధి మరియు తుపాను ప్రభావిత ప్రాంతాల్లోని పంట నష్టం అంచనాలపై ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి (Vallabhaneni Balashowry), ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ మరియు అధికారులు పాల్గొన్నారు.

Hoxo robot: న్యూక్లియర్ రంగంలో ఏఐ విప్లవం.. హోక్సో రోబోట్ రంగప్రవేశం!

ఎదురుమొండి ప్రజల జీవితాలను మార్చేయబోయే ఈ హైలెవల్ బ్రిడ్జి నిర్మాణానికి సంబంధించిన ముఖ్య వివరాలను పవన్ కళ్యాణ్ తెలిపారు. కృష్ణా నదిపై నిర్మించనున్న ఈ బ్రిడ్జి కోసం ఇప్పటికే నాబార్డు నుంచి రూ. 109 కోట్లు మంజూరయ్యాయని ఆయన తెలిపారు.

Pakistan fan: జనగణమనకు పాక్ అభిమాని సెల్యూట్.. క్రీడాస్ఫూర్తి సరిహద్దులు దాటింది!

అలైన్‌మెంట్‌లో మార్పులు చేయడం వల్ల నిర్మాణ వ్యయం పెరిగిందని, అదనంగా రూ. 60 కోట్లు వరకు ఖర్చయ్యే అవకాశం ఉందని అంచనా వేశారు. ఈ అదనపు వ్యయాన్ని రాష్ట్ర ప్రభుత్వ నిధులతో పాటు సాస్కీ నిధులు సమకూర్చనున్నట్లు వివరించారు.

Highway: విజయవాడ–హైదరాబాద్ నేషనల్ హైవే అప్‌గ్రేడ్..! ఆరు వరుసలతో ప్రయాణం వేగవంతం..!

నిర్ణీత వ్యవధిలోనే ఏటిమొగ – ఎదురుమొండి హైలెవల్ బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ బ్రిడ్జి పూర్తయితే దీవుల ప్రజలు ప్రధాన భూభాగంతో కనెక్ట్ అవుతారు, వారి కష్టాలు చాలావరకు తగ్గుతాయి.

ది గర్ల్ ఫ్రెండ్ మూవీ రివ్యూ! రష్మిక జీవితంలోనే అత్యంత ఇంటెన్స్ పాత్ర... అదరగొట్టేశారుగా!

మొంథా తుపాను (Montha cyclone) కారణంగా రాష్ట్రవ్యాప్తంగా తీర ప్రాంత గ్రామాల్లో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఈ నష్టపోయిన వారిలో కౌలు రైతులు కూడా ఉన్నారని పవన్ కళ్యాణ్ గుర్తించారు. నష్టపోయిన ప్రతి కౌలు రైతుకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులకు సూచించారు.

Auto Sales: ఆటో అమ్మకాలు రికార్డు స్థాయికి.. పండుగ సీజన్‌, జీఎస్టీ తగ్గింపులు ప్రభావం అంటున్నా ఆటో నిపుణులు!!

సీసీఆర్సీ కార్డులు లేని కౌలు రైతులు కూడా చాలామంది ఉన్నారని, నష్టపోయిన ప్రతి కౌలు రైతుని గుర్తించి, వారికి ఇబ్బందులు కలగకుండా యంత్రాంగం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అవనిగడ్డ నియోజకవర్గం పరిధిలోని తీర ప్రాంతంలో ముంపు సమస్య పై పవన్ కళ్యాణ్ తీవ్రంగా స్పందించారు.

BHEL Exam: సాంకేతిక లోపాలతో బీహెచ్‌ఈఎల్‌ ఆర్టిసన్‌ పరీక్ష రద్దు..! త్వరలో కొత్త తేదీలు..!

వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా అక్కడ నిర్మించిన అవుట్ ఫాల్ స్లూయిజ్‌లు పనిచేయకుండా పోయాయని ఆయన విమర్శించారు. దీని వల్ల నాగాయలంక, కోడూరు మండలాల పరిధిలో సుమారు 5 వేల ఎకరాలు ముంపుకు గురవుతున్నాయని తెలిపారు.

kidney Stones: టమాటాలు తింటే కిడ్నీ రాళ్లు వస్తాయా... తెలిస్తే షాక్ అవుతారు!

వైసీపీ నిర్లక్ష్యం కారణంగా ఇప్పుడు అవుట్ ఫాల్ స్లూయిజ్‌ల పునరుద్ధరణకు ప్రస్తుత ప్రభుత్వం రూ. 50 కోట్లు ఖర్చు చేయాల్సి వస్తోందని వివరించారు. ఈ నిర్మాణాలకు జాతీయ విపత్తుల నిర్వహణ నిధుల నుంచి కేటాయింపులు చేసి పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. అవసరమైతే ఢిల్లీకి వెళ్లి కేంద్ర పెద్దలను కూడా కలుస్తానని తెలిపారు.

Airport: ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో మరోసారి సాంకేతిక సమస్య..! గంటల తరబడి నిలిచిన విమానాలు..!

ఎదురుమొండి దీవుల పరిధిలో ఎదురుమొండి - గొల్లమంద మధ్య రహదారి నిర్మాణానికి కూడా పంచాయతీరాజ్ శాఖ నుంచి రూ. 13.88 కోట్లు కేటాయించారు. టెండర్ల ప్రక్రియ పూర్తయినా, అటవీ శాఖ భూభాగంలో కొంత భాగం ఉండటం వల్ల అనుమతులు నిలిచిపోయాయని తెలిపారు. ఈ సమస్యను పరిష్కరించాలని పవన్ కళ్యాణ్ అధికారులను సూచించారు.

AP Farmers: ఏపీలో ఆ రైతులకు భారీ ఊరట! ఎకరాకు రూ.50,000 ఆర్థిక సాయం ప్రకటించిన ప్రభుత్వం!

ఇక, కృష్ణా నది సముద్రంలో కలిసే హంసలదీవి పవిత్ర సాగర సంగమం ప్రాంతానికి భక్తులు వెళ్లేందుకు అటవీ శాఖ రుసుము  వసూలు చేస్తున్న విషయం తన దృష్టికి వచ్చిందని చెప్పారు. భక్తుల మనోభావాలకు సంబంధించిన ఈ అంశంపై అటవీశాఖ అధికారులు (Forest Department officials) ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించాలని ఆయన సూచించారు.

TTD Tokens: తిరుమల భక్తులకు కీలక ప్రకటన! ఇకనుండి ఆ టోకెన్లు పాత పద్ధతిలోనే....
Suspended: ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం! 26మంది పంచాయతీ కార్యదర్శుల సస్పెన్షన్!

Spotlight

Read More →