LIVE
Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  •  AP CRDA: 0.4 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రూపుదిద్దుకుంటున్న నీరుకొండ రిజర్వాయర్...  •  Vishaka: ప్రభుత్వ స్కూల్‌గా మారిన విశాఖ విమల విద్యాలయం.. కలెక్టర్, ఎమ్మెల్యే పల్లా చేతుల మీదుగా ప్రారంభం!  •  6G Network: భారత్‌లో 6G సంచలనం.. టెలికాం రంగం రూపురేఖలు మార్చబోతున్న కేంద్ర ప్రభుత్వ మాస్టర్ ప్లాన్!  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
Education

Summer School Updates: విద్యార్థులకు అలర్ట్.. మార్చి 16 నుంచి స్కూళ్ల సమయం మార్పు.. విద్యాశాఖ కీలక ప్రకటన.!!

Summer Schools Timings: తెలంగాణలో పెరుగుతున్న ఎండల దృష్ట్యా మార్చి 16 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఒంటిపూట బడులు ప్రారంభం కానున్నాయి. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల కొత్త టైమింగ్స్, మధ్యాహ్న భోజనం వేసవి సెలవుల వివరాలు..

AndhraPravasi News Desk 2 min read
Summer School Updates: విద్యార్థులకు అలర్ట్.. మార్చి 16 నుంచి స్కూళ్ల సమయం మార్పు.. విద్యాశాఖ కీలక ప్రకటన.!!

తెలంగాణలో భానుడు ఇప్పుడే తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు.ఫిబ్రవరి నుంచే మొదలైన ఎండలు మార్చి వచ్చేసరికి మరింత ముదిరాయి. ఉదయం 9 గంటలకే సూర్యుడు నిప్పులు చెరుగుతుండటంతో బయటకు రావాలంటేనే జనం వణికిపోతున్నారు. ముఖ్యంగా స్కూళ్లకు వెళ్లే చిన్న పిల్లలు ఈ వేడికి అల్లాడిపోతున్నారు. ఈ పరిస్థితిని గమనించిన రాష్ట్ర విద్యాశాఖ విద్యార్థుల ఆరోగ్య దృష్ట్యా కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 16వ తేదీ (సోమవారం) నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో ఒంటిపూట బడులను ప్రారంభిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది.

ప్రభుత్వ ఆదేశాల ప్రకారం, రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ పాఠశాలలు ఖచ్చితంగా ఒంటిపూట బడుల నిబంధనలను పాటించాల్సి ఉంటుంది. స్కూళ్లు ఉదయం 8:00 గంటలకు ప్రారంభమై, మధ్యాహ్నం 12:30 గంటలకు ముగుస్తాయి. మధ్యాహ్నం ఒంటి గంట కల్లా విద్యార్థులందరూ ఇంటికి చేరుకునేలా చూడాలని యాజమాన్యాలకు సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లలకు మధ్యాహ్నం 12:30 గంటలకు యధావిధిగా మధ్యాహ్న భోజనం వడ్డించి, ఆ తర్వాత వారిని ఇంటికి పంపిస్తారు. ప్రైవేట్ స్కూళ్లు కూడా ఇదే సమయాన్ని పాటించాలని, అదనపు తరగతుల పేరుతో పిల్లలను ఎండలో ఉంచకూడదని విద్యాశాఖ హెచ్చరించింది.

ప్రస్తుతం రంజాన్ మాసం నడుస్తున్నందున, ఉర్దూ మీడియం పాఠశాలలకు గతంలోనే కొన్ని మినహాయింపులు ఇచ్చారు. అయితే మార్చి 15 వరకు మాత్రమే ఆ ప్రత్యేక సమయాలు అమల్లో ఉంటాయి. 16వ తేదీ నుంచి రాష్ట్రంలోని అన్ని రకాల పాఠశాలలు (తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ మీడియం) ఒకే సమయానికి అంటే మధ్యాహ్నం 12:30 గంటలకే ముగియనున్నాయి. ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్న జిల్లాల్లో కలెక్టర్లు ప్రత్యేక నిఘా ఉంచాలని, స్కూళ్లలో తాగునీటి సౌకర్యం, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

ఇక ఈ విద్యా సంవత్సరం ముగింపు  సెలవుల వివరాలను కూడా ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రస్తుత విద్యా సంవత్సరానికి ఏప్రిల్ 23వ తేదీని చివరి పని దినంగా నిర్ణయించారు. అంటే ఏప్రిల్ 24 నుంచి విద్యార్థులకు వేసవి సెలవులు ప్రారంభం కానున్నాయి. దాదాపు 50 రోజులకు పైగా వేసవి విరామం తర్వాత, తిరిగి జూన్ 12న పాఠశాలలు పునఃప్రారంభం అవుతాయి. ఈ లోపు సిలబస్‌ను పూర్తి చేసి, వార్షిక పరీక్షలను సజావుగా నిర్వహించేలా ఉపాధ్యాయులు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని అధికారులు సూచించారు.

మరోవైపు వాతావరణ శాఖ హెచ్చరికల ప్రకారం రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉంది. అందుకే మధ్యాహ్నం వేళల్లో పిల్లలను బయట తిరగనివ్వకూడదని వైద్యులు కూడా తల్లిదండ్రులకు సూచిస్తున్నారు. స్కూల్ నుంచి రాగానే పిల్లలకు చల్లని పానీయాలు, పండ్లు ఇచ్చి వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నారు. విద్యాశాఖ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల విద్యార్థుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎండలు ముదరక ముందే బడుల సమయం తగ్గించడం వల్ల పిల్లలపై ఒత్తిడి తగ్గుతుందని వారు భావిస్తున్నారు.

Be the first to react

More Coverage

Vishaka: ప్రభుత్వ స్కూల్‌గా మారిన విశాఖ విమల విద్యాలయం.. కలెక్టర్, ఎమ్మెల్యే పల్లా చేతుల మీదుగా ప్రారంభం!

Vishaka: ప్రభుత్వ స్కూల్‌గా మారిన విశాఖ విమల విద్యాలయం.. కలెక్టర్, ఎమ్మెల్యే పల్లా చేతుల మీదుగా ప్రారంభం!

Vishaka: ఆర్థిక ఇబ్బందుల వల్ల ఉక్కునగరంలో మూతపడిన 40 ఏళ్ల చారిత్రాత్మక "విశాఖ విమల విద్యాలయం"ను ఆంధ్…

Education: భారత్‌లోనే లివర్‌పూల్ విశ్వవిద్యాలయ డిగ్రీ.. బెంగళూరులో క్యాంపస్‌కు యూజీసీ తుది అనుమతి!

Education: భారత్‌లోనే లివర్‌పూల్ విశ్వవిద్యాలయ డిగ్రీ.. బెంగళూరులో క్యాంపస్‌కు యూజీసీ తుది అనుమతి!

Education: విదేశాలకు వెళ్లకుండానే అంతర్జాతీయ స్థాయి విద్యను అభ్యసించాలనుకునే భారత విద్యార్థులకు శుభవ…