ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వినియోగం ప్రపంచవ్యాప్తంగా వేగంగా పెరుగుతోంది. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో ఏఐకు పెద్ద పీట వేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఏఐ ప్రాజెక్టులకు ప్రాధాన్యం పెరగడంతో విద్యాసంస్థలు తమ బోధన విధానాల్లో మార్పులు చేస్తూ, కొత్త సిలబస్‌లను ప్రవేశపెడుతున్నాయి. అదే సమయంలో ఆన్‌లైన్ ద్వారా ఏఐ, ఎంఎల్ వంటి కోర్సులు నేర్చుకునే అవకాశాలు విస్తరించాయి.
కేంద్ర ప్రభుత్వ నేషనల్ స్కిల్ అకాడమీ (NSA) ఆధ్వర్యంలో ఏఐ & ఎంఎల్, డేటా సైన్స్ పీజీ డిప్లొమా, డిప్లొమా కోర్సులతో పాటు 150కి పైగా సాఫ్ట్వేర్ కోర్సులను ఆన్‌లైన్‌లో అందిస్తున్నారు. ఇంటర్ పాస్ నుంచి ఇంజినీరింగ్, డిగ్రీ, పీజీ, పాలిటెక్నిక్ విద్యార్థులు వరకు ఎవరైనా ఈ కోర్సులకు దరఖాస్తు చేసుకోవచ్చు. సరికొత్త టెక్నాలజీలు నేర్చుకోవాలని ఆశిస్తున్న వారికి ఇది మంచి అవకాశం.
ఏఐ, ఎంఎల్‌తో పాటు బిగ్ డేటా, క్లౌడ్ కంప్యూటింగ్, పైథాన్, ఫుల్‌స్టాక్ డెవలప్‌మెంట్, బిజినెస్ అనలిటిక్స్, బ్లాక్‌చెయిన్, డీప్ లెర్నింగ్, సెలేనియం, జావా, ఒరాకిల్, వెబ్ డిజైన్ వంటి అనేక కోర్సులు అందుబాటులో ఉన్నాయి. మొత్తం 150కిపైగా సాఫ్ట్వేర్ కోర్సుల్లో విద్యార్థులు తమకు నచ్చినది ఎంపిక చేసుకోవచ్చు. అన్నీ ఆన్‌లైన్ ఈ–లెర్నింగ్ పద్ధతిలోనే బోధించబడతాయి.
కోర్సులు పూర్తయిన తర్వాత పరీక్షలు నిర్వహిస్తారు. పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారికి కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన సర్టిఫికేట్‌ను ఉచితంగా అందిస్తారు. కోర్సుల వ్యవధి 2 నెలల నుండి 10 నెలల వరకు ఉంటుంది. ఏదైనా సబ్జెక్ట్‌లో లోతైన నాలెడ్జ్ పొందేందుకు ఇవి మంచి అవకాశంగా నిలుస్తాయి.
ఈ కోర్సులు పూర్తి చేసిన వారికి దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా మంచి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. అధిక వేతనాలతో software jobs పొందే అవకాశం పెరగడంతో విద్యార్థులు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. ఆసక్తి గలవరు అధికారిక వెబ్‌సైట్ www.nationalskillacademy.in లో ఆన్‌లైన్ దరఖాస్తు చేసుకోవచ్చు.