CBSE Exams: గల్ఫ్ దేశాల్లో సీబీఎస్‌ఈ 10వ తరగతి పరీక్షలు రద్దు! కొత్త తేదీలను త్వరలో...! KGBV Notification: ఏపీ కేజీబీవీ అడ్మిషన్స్ 2026! 6వ తరగతి, ఇంటర్ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల! UPSC: సివిల్స్ ఫలితాలు విడుదల... వెంటనే చెక్ చేసుకోండి! Hall Tickets: SSC హాల్ టికెట్లు విడుదల చేసిన విద్యాశాఖ..! డౌన్‌లోడ్ చేసుకునే విధానం ఇదే! Canada Scholarship: భారత విద్యార్థులకు కెనడా స్కాలర్‌షిప్‌లు! ప్రతి ఏడాది 200 మందికి ఫ్రీ ఎడ్యుకేషన్.. వెంటనే అప్లై చేసుకోండి! ISRO YUVIKA 2026: విద్యార్థులకు బంపర్ ఆఫర్! ఇస్రోలో ట్రైనింగ్.. ప్రయాణం, భోజనం, వసతి కూడా ఫ్రీ! SSC Halltickets: 10వ తరగతి విద్యార్థులకు అలర్ట్! హాల్ టికెట్లు వచ్చేశాయి.. ఇలా పొందండి! Nara Lokesh: ఆంధ్రా యూనివర్సిటీకి పూర్వవైభవం - నారా లోకేష్! CUET Application: విద్యార్థులకు గుడ్ న్యూస్...! సీయూఈటీ దరఖాస్తుకు మరో ఛాన్స్! YUVIKA Training: అంతరిక్షంపై ఆసక్తి ఉన్న విద్యార్థులకు ఇస్రో అవకాశం.. YUVIKA ట్రైనింగ్.. రిజిస్ట్రేషన్లు ప్రారంభం! CBSE Exams: గల్ఫ్ దేశాల్లో సీబీఎస్‌ఈ 10వ తరగతి పరీక్షలు రద్దు! కొత్త తేదీలను త్వరలో...! KGBV Notification: ఏపీ కేజీబీవీ అడ్మిషన్స్ 2026! 6వ తరగతి, ఇంటర్ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల! UPSC: సివిల్స్ ఫలితాలు విడుదల... వెంటనే చెక్ చేసుకోండి! Hall Tickets: SSC హాల్ టికెట్లు విడుదల చేసిన విద్యాశాఖ..! డౌన్‌లోడ్ చేసుకునే విధానం ఇదే! Canada Scholarship: భారత విద్యార్థులకు కెనడా స్కాలర్‌షిప్‌లు! ప్రతి ఏడాది 200 మందికి ఫ్రీ ఎడ్యుకేషన్.. వెంటనే అప్లై చేసుకోండి! ISRO YUVIKA 2026: విద్యార్థులకు బంపర్ ఆఫర్! ఇస్రోలో ట్రైనింగ్.. ప్రయాణం, భోజనం, వసతి కూడా ఫ్రీ! SSC Halltickets: 10వ తరగతి విద్యార్థులకు అలర్ట్! హాల్ టికెట్లు వచ్చేశాయి.. ఇలా పొందండి! Nara Lokesh: ఆంధ్రా యూనివర్సిటీకి పూర్వవైభవం - నారా లోకేష్! CUET Application: విద్యార్థులకు గుడ్ న్యూస్...! సీయూఈటీ దరఖాస్తుకు మరో ఛాన్స్! YUVIKA Training: అంతరిక్షంపై ఆసక్తి ఉన్న విద్యార్థులకు ఇస్రో అవకాశం.. YUVIKA ట్రైనింగ్.. రిజిస్ట్రేషన్లు ప్రారంభం!

కేజీబీవీ టీచర్ల కేసులో ట్విస్ట్..! విద్యాశాఖ అధికారులపై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు!

కేజీబీవీ పార్ట్‌టైమ్ పీజీటీ టీచర్ల తొలగింపుల కేసులో కీలక మలుపు. కోర్టు ఆదేశాలను బేఖాతరు చేసిన విద్యాశాఖ అధికారులపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఘాటు వ్యాఖ్యలు చేసింది.

Published : 2026-02-06 09:23:00


ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ అధికారుల తీరుపై రాష్ట్ర హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ, అధికారులు తమ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని న్యాయస్థానం మండిపడింది. ముఖ్యంగా కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో (కేజీబీవీ) పనిచేస్తున్న పార్ట్-టైమ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్లు (పీజీటీ) తమను మధ్యలోనే తొలగించడాన్ని సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు ఈ కీలక వ్యాఖ్యలు చేసింది. విద్యాశాఖలో ఏదో తప్పు జరుగుతోందని, అధికారుల తీరు అనుమానాస్పదంగా ఉందని ధర్మాసనం అభిప్రాయపడింది.

ఈ వివాదం 2023లో ప్రారంభమైంది. తమను అర్ధాంతరంగా తొలగించడాన్ని సవాల్ చేస్తూ పీజీటీలు కోర్టును ఆశ్రయించగా, వారిని విధుల్లో కొనసాగించాలని సింగిల్ జడ్జి బెంచ్ అప్పట్లో ఆదేశాలు ఇచ్చింది. ఈ తీర్పుపై ఉన్నతాధికారులు అప్పీల్ చేసినప్పటికీ, కోర్టు ఆదేశాలను అమలు చేస్తామని ప్రభుత్వ తరఫు న్యాయవాది గత విచారణలో కోర్టుకు హామీ ఇచ్చారు. అయితే, క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా ఉందని న్యాయస్థానం గుర్తించింది. అధికారుల మధ్య సమన్వయం లోపించిందని మరియు కోర్టుకు ఇచ్చిన హామీలను వారు తుంగలో తొక్కుతున్నారని కోర్టు వ్యాఖ్యానించింది.

ప్రభుత్వ న్యాయవాది ఇచ్చిన హామీకి విరుద్ధంగా విజయనగరం జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్ (పీడీ) వ్యవహరించారని పిటిషనర్లు కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. అక్కడ పనిచేస్తున్న పీజీటీలను ఇతర స్థానాలకు బదిలీ చేయడమే కాకుండా, వారికి ఇవ్వాల్సిన నిర్ణీత జీతానికి బదులుగా గంటల లెక్కన వేతనం చెల్లిస్తున్నారని వాదించారు. ఇది కోర్టు ఆదేశాలను స్పష్టంగా ధిక్కరించడమేనని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కింది స్థాయి సిబ్బంది కూడా కోర్టు ఆదేశాలను మరియు ఉన్నతాధికారులు ఇచ్చే హామీలను చాలా తేలిగ్గా తీసుకుంటున్నారని ధర్మాసనం మండిపడింది.

విద్యాశాఖలోని ఉన్నతాధికారులు తాము ఏదో పవర్ ఫుల్ వ్యక్తుల కింద పనిచేస్తున్నామని, తమను ఎవరూ ఏమీ చేయలేరనే అహంకారంతో ఉన్నారని హైకోర్టు ఘాటుగా విమర్శించింది. కోర్టు ఆదేశాలకు కనీస మర్యాద ఇవ్వకపోవడంపై జస్టిస్ బట్టు దేవానంద్, జస్టిస్ హరిహరనాథశర్మతో కూడిన ధర్మాసనం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. అధికారుల ఆలోచనా ధోరణి ఇలాగే ఉంటే వారిని ఎలా డీల్ చేయాలో తమకు తెలుసునని హెచ్చరించింది. మీరు న్యాయస్థానంతో ఘర్షణ పడాలని చూస్తున్నారా అని అధికారులను నిలదీసింది.

ఈ క్రమంలో రాష్ట్ర సర్వశిక్షా అభియాన్ ప్రాజెక్ట్ డైరెక్టర్ (పీడీ) బి. శ్రీనివాసరావుపై హైకోర్టు సుమోటోగా కోర్టు ధిక్కరణ కేసు నమోదు చేసింది. కేవలం ఆదేశాలు ఇవ్వడమే కాకుండా, అవి క్షేత్రస్థాయిలో అమలయ్యేలా చూడాల్సిన బాధ్యత కూడా ఉన్నతాధికారులదేనని స్పష్టం చేసింది. విజయనగరం పీడీ చేసిన తప్పులకు రాష్ట్ర స్థాయి అధికారిని బాధ్యుడిని చేస్తూ, ఫిబ్రవరి 4వ తేదీన ఆయనను స్వయంగా కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది. విద్యాశాఖలో జరుగుతున్న లోపాలను సరిదిద్దాల్సిన అవసరం ఉందని న్యాయస్థానం గట్టిగా హెచ్చరించింది.
 

Spotlight

Read More →