Tirumala: తిరుమలలో భారీగా భక్తుల రాక.. అన్ని కంపార్ట్మెంట్లు ఫుల్! Tirumala temple: తిరుమల కొండపై భక్తుల కిటకిట... శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం! గురువారం ఒక్కరోజే.. Tirumala Updates: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ... టీటీడీ కీలక సూచనలు! Kaleshwaram: కాళేశ్వరంలో సరస్వతీ అంత్య పుష్కరాలు ప్రారంభం.. పోటెత్తిన భక్తులు! Gudivada Temple: గుడివాడ గుడిలో కిరీటం మాయం.. రంగంలోకి దేవదాయ శాఖ.. ట్రస్ట్ బోర్డు పరార్! Tirumala Darshanam Timings: తిరుమలలో భక్తుల జనసంద్రం: సర్వదర్శనానికి 30 గంటల సుదీర్ఘ నిరీక్షణ! TTD Updates: మే 27న వైభవంగా గోవిందరాజస్వామి గరుడ సేవ.. భక్తుల కోసం టీటీడీ భారీ ఏర్పాట్లు! Tirumala Latest Updates: తిరుమలలో భక్తుల జాతర.. శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం! Tirumala Latest Updates: తిరుమల భక్తులకు అలర్ట్... ఆగస్టు నెల శ్రీవారి దర్శన టికెట్లు విడుదల! Tirumala: తిరుమలలో భక్తుల భారీ రద్దీ.. సర్వదర్శనానికి 24 గంటల సమయం! Tirumala: తిరుమలలో భారీగా భక్తుల రాక.. అన్ని కంపార్ట్మెంట్లు ఫుల్! Tirumala temple: తిరుమల కొండపై భక్తుల కిటకిట... శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం! గురువారం ఒక్కరోజే.. Tirumala Updates: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ... టీటీడీ కీలక సూచనలు! Kaleshwaram: కాళేశ్వరంలో సరస్వతీ అంత్య పుష్కరాలు ప్రారంభం.. పోటెత్తిన భక్తులు! Gudivada Temple: గుడివాడ గుడిలో కిరీటం మాయం.. రంగంలోకి దేవదాయ శాఖ.. ట్రస్ట్ బోర్డు పరార్! Tirumala Darshanam Timings: తిరుమలలో భక్తుల జనసంద్రం: సర్వదర్శనానికి 30 గంటల సుదీర్ఘ నిరీక్షణ! TTD Updates: మే 27న వైభవంగా గోవిందరాజస్వామి గరుడ సేవ.. భక్తుల కోసం టీటీడీ భారీ ఏర్పాట్లు! Tirumala Latest Updates: తిరుమలలో భక్తుల జాతర.. శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం! Tirumala Latest Updates: తిరుమల భక్తులకు అలర్ట్... ఆగస్టు నెల శ్రీవారి దర్శన టికెట్లు విడుదల! Tirumala: తిరుమలలో భక్తుల భారీ రద్దీ.. సర్వదర్శనానికి 24 గంటల సమయం!

Tirumala: తిరుమలలో భారీగా భక్తుల రాక.. అన్ని కంపార్ట్మెంట్లు ఫుల్!

Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ రోజురోజుకు పెరుగుతోంది. శుక్రవారం ఉదయం కూడా శ్రీవారి దర్శనం కోసం వేలాది మంది భక్తులు భారీగా తరలివచ్చారు. ఉచిత దర్శనం కోసం ఏర్పాటు చేసిన అన్ని కంపార్ట్మెంట్లు పూర్తిగా నిండిపోయి.

Published : 2026-05-23 11:09:00

శ్రీవారి దర్శనం కోసం కిలోమీటర్ల మేర భక్తుల క్యూలైన్..

గోవింద నామస్మరణతో మార్మోగుతున్న తిరుమల కొండలు..

తిరుమలలో భక్తుల రద్దీ రోజురోజుకు పెరుగుతోంది. శుక్రవారం ఉదయం కూడా శ్రీవారి దర్శనం కోసం వేలాది మంది భక్తులు భారీగా తరలివచ్చారు. ఉచిత దర్శనం కోసం ఏర్పాటు చేసిన అన్ని కంపార్ట్మెంట్లు పూర్తిగా నిండిపోయి, శిలాతోరణం వరకు భక్తుల క్యూలైన్ కొనసాగుతోంది. దీంతో తిరుమల అంతటా భక్తిశ్రద్ధల వాతావరణం నెలకొంది.

టీటీడీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, ఉదయం 8 గంటల తర్వాత సర్వదర్శనానికి వెళ్లే భక్తులకు స్వామివారి దర్శనం పొందేందుకు సుమారు 15 నుంచి 18 గంటల వరకు సమయం పడుతోంది. రూ.300 ప్రత్యేక శీఘ్రదర్శనం టికెట్లు తీసుకున్న భక్తులకు కూడా 3 నుంచి 5 గంటల వరకు నిరీక్షణ తప్పడం లేదు. అలాగే సర్వదర్శనం టోకెన్లు పొందిన భక్తులకు దర్శనం పూర్తవడానికి 4 నుంచి 6 గంటల సమయం పడుతున్నట్లు అధికారులు వెల్లడించారు.

ఇక గురువారం ఒక్కరోజే మొత్తం 87,689 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. వారిలో 44,476 మంది భక్తులు తలనీలాలు సమర్పించి తమ భక్తిని చాటుకున్నారు. అదే రోజున శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.29 కోట్లుగా నమోదైంది.

భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని టీటీడీ అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. క్యూలైన్లలో తాగునీరు, ఆహారం, వైద్యసేవలు అందుబాటులో ఉంచి భక్తులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నారు. తిరుమలలో ఎక్కడ చూసినా “గోవిందా.. గోవిందా” నామస్మరణతో ఆధ్యాత్మిక వాతావరణం అలుముకుంది.

Spotlight

Read More →