ఖైరతాబాద్ గణనాథుడు  గంగమ్మ ఒడికి.. భక్తజన సంద్రంగా ట్యాంక్‌బండ్ !

హైదరాబాద్‌:  హైదరాబాద్‌లో ప్రతిష్ఠాత్మకంగా కొలువుదీరిన ఖైరతాబాద్ మహా గణపయ్య నిమజ్జనం పూర్తయింది. ట్యాంక్‌బండ్ క్రేన్ నంబర్-4 వద్ద పంచముఖ సంకట హర మహా గణపతిని గంగమ్మ ఒడికి చేర్చారు. నిమజ్జనానికి ముందు గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం విగ్రహాన్ని నిమజ్జనానికి తరలించారు.

Khairatabad Ganesh Nimajjanam 2026
Khairatabad Ganesh Nimajjanam 2026
  • ఖైరతాబాద్ మహా గణపయ్య నిమజ్జనం ట్యాంక్‌బండ్ క్రేన్ నంబర్-4 వద్ద పూర్తయింది.
  • నిమజ్జనోత్సవాలు ప్రశాంతంగా జరిగేలా భారీ పోలీస్ బందోబస్తు కొనసాగుతోంది.

హైదరాబాద్‌:  హైదరాబాద్‌లో ప్రతిష్ఠాత్మకంగా కొలువుదీరిన ఖైరతాబాద్ మహా గణపయ్య నిమజ్జనం పూర్తయింది. ట్యాంక్‌బండ్ క్రేన్ నంబర్-4 వద్ద పంచముఖ సంకట హర మహా గణపతిని గంగమ్మ ఒడికి చేర్చారు. నిమజ్జనానికి ముందు గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం విగ్రహాన్ని నిమజ్జనానికి తరలించారు.

మహా గణపయ్యను చివరిసారిగా దర్శించుకునేందుకు భారీ సంఖ్యలో భక్తులు ట్యాంక్‌బండ్‌కు తరలివచ్చారు. దీంతో అప్పర్ ట్యాంక్‌బండ్ పరిసరాలు భక్తజన సందోహంగా మారాయి. సెక్రటేరియట్ సౌత్ ఈస్ట్ మార్గంలోనూ భక్తుల రద్దీ కనిపించింది. భారీగా తరలివచ్చిన భక్తుల నేపథ్యంలో పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు.

అప్పర్ ట్యాంక్‌బండ్‌పై కొనసాగుతున్న నిమజ్జనోత్సవాలు

మరోవైపు అప్పర్ ట్యాంక్‌బండ్‌పై వినాయక విగ్రహాల నిమజ్జనోత్సవాలు కోలాహలంగా కొనసాగుతున్నాయి. జంట నగరాల నలుమూలల నుంచి భారీ సంఖ్యలో గణేశ్ విగ్రహాలు నిమజ్జనం కోసం తరలివస్తున్నాయి. మొత్తం 12 క్రేన్ల ద్వారా నిమజ్జన ప్రక్రియ కొనసాగుతోంది.

నిమజ్జనోత్సవాల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. పోలీస్ కంట్రోల్ రూం ద్వారా 58 సీసీటీవీ కెమెరాలతో నిరంతర నిఘా కొనసాగిస్తున్నారు. ప్రతి క్రేన్ వద్ద ఒక ఎస్‌ఐతో పాటు ఐదుగురు పోలీస్ సిబ్బందిని అందుబాటులో ఉంచారు.

అదేవిధంగా నిమజ్జన ప్రాంతాల్లో 25 క్రైమ్ టీమ్స్, 10 షీ టీమ్స్ ప్రత్యేకంగా విధులు నిర్వహిస్తున్నాయి. ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు 479 గణేశ్ విగ్రహాల నిమజ్జనం పూర్తయినట్లు పోలీసులు తెలిపారు.

ఖైరతాబాద్ మహా గణపయ్య నిమజ్జనంతో ట్యాంక్‌బండ్‌పై గణేశ్ నిమజ్జనోత్సవాల్లో మరో కీలక ఘట్టం ముగిసింది. భక్తుల రద్దీ నేపథ్యంలో నిమజ్జన ప్రక్రియ ప్రశాంతంగా జరిగేలా పోలీసులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.

Tags

Be the first to react

Latest