Liquor: సంక్రాంతికి మందుబాబులకు షాక్..! ఏపీలో మద్యం ధరలు ఒక్కసారిగా పెంపు..! AP Farmers: అన్నదాతలకు గుడ్ న్యూస్…! ట్రాక్టర్ నుంచి డ్రోన్ వరకూ… అన్నీ తక్కువ ధరకే..! Gold Silver Prices: పసిడి, వెండి ధరలు రికార్డు స్థాయి..! 1979 తర్వాత ఇదే అతిపెద్ద జంప్…! Egg Price: ఆకాశాన్ని అంటిన గుడ్డు ధర..! పౌల్ట్రీ చరిత్రలోనే రికార్డు..! Tata Sierra SUV: రూ.11.49 లక్షల నుంచే ప్రీమియం SUV..! బుకింగ్‌లు ఓపెన్, డెలివరీలు త్వరలో..! Liquor: సంక్రాంతికి మందుబాబులకు షాక్..! ఏపీలో మద్యం ధరలు ఒక్కసారిగా పెంపు..! AP Farmers: అన్నదాతలకు గుడ్ న్యూస్…! ట్రాక్టర్ నుంచి డ్రోన్ వరకూ… అన్నీ తక్కువ ధరకే..! Gold Silver Prices: పసిడి, వెండి ధరలు రికార్డు స్థాయి..! 1979 తర్వాత ఇదే అతిపెద్ద జంప్…! Egg Price: ఆకాశాన్ని అంటిన గుడ్డు ధర..! పౌల్ట్రీ చరిత్రలోనే రికార్డు..! Tata Sierra SUV: రూ.11.49 లక్షల నుంచే ప్రీమియం SUV..! బుకింగ్‌లు ఓపెన్, డెలివరీలు త్వరలో..!

Liquor: సంక్రాంతికి మందుబాబులకు షాక్..! ఏపీలో మద్యం ధరలు ఒక్కసారిగా పెంపు..!

2026-01-13 06:50:00
New Scheme: ఏపీలో వారికి సంక్రాంతికి బంపర్ ఆఫర్...! 5.7 లక్షల మందికి రూ.2653 కోట్ల విడుదల..!

సంక్రాంతి పండుగ వేళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మందుబాబులకు కిక్కు దిగే షాక్ ఇచ్చింది. పండుగ సమయంలో మద్యం విక్రయాలు భారీగా పెరుగుతాయని అంచనాలు ఉన్న వేళ, ప్రభుత్వం ఒక్కసారిగా మద్యం ధరలను పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. పండుగకు ఊళ్లకు వెళ్లిన యువత, స్నేహితులతో కలసి మద్యం సేవించేందుకు సిద్ధమయ్యే ఈ సమయంలో ధరలు పెరగడంతో మద్యం ప్రియులు నిరాశకు గురవుతున్నారు. ముఖ్యంగా కోళ్ల పందేలు జరిగే ప్రాంతాలు, గ్రామీణ ప్రాంతాల్లో సంక్రాంతి సమయంలో మద్యం వినియోగం ఎక్కువగా ఉండటం తెలిసిందే. అలాంటి వేళ ధరలు పెంచడం వల్ల పండుగ పూట మద్యం తాగాలంటే జేబుకు మరింత చిల్లు పడే పరిస్థితి నెలకొంది.

Musk says : డాక్టర్ చదువులు అవసరం లేదంటున్న మస్క్… కారణం ఇదే!

ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం రూ.99 ఎంఆర్‌పీ ధర కలిగిన మద్యం బాటిళ్లను మినహాయించి మిగతా అన్ని రకాల మద్యం బాటిళ్లపై ధరలను పెంచారు. బీర్, వైన్, విస్కీ, బ్రాందీ వంటి అన్ని రకాల మద్యం సైజులపై ఒక్కో బాటిల్‌కు రూ.10 చొప్పున ధర పెంపు అమలులోకి తీసుకొచ్చారు. అయితే రూ.99లోపు ఉన్న బీర్, వైన్, ఐఎంఎఫ్ఎల్ బాటిళ్లకు ధరలు పెంచకుండా ప్రభుత్వం కొంత ఉపశమనం కల్పించింది. సామాన్య వినియోగదారులను దృష్టిలో పెట్టుకుని ఈ మినహాయింపు ఇచ్చినట్లు ఎక్సైజ్ శాఖ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

ఆంధ్రప్రదేశ్ లో కలకలం - ఆ ఆలయంలో భారీ చోరీ! ఏకాదశి నుంచి మూతపడ్డ ఆలయం..

ఈ ధరల పెంపుతో ప్రభుత్వ ఖజానాకు భారీగా ఆదాయం సమకూరే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇటీవల జనవరి 1న నూతన సంవత్సర వేడుకల సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా రికార్డు స్థాయిలో మద్యం విక్రయాలు జరగడంతో కోట్ల రూపాయల ఆదాయం ప్రభుత్వానికి వచ్చింది. ఇప్పుడు సంక్రాంతి పండుగ సమయంలో ధరలు పెరగడం వల్ల మద్యం విక్రయాల ద్వారా మరింత ఆదాయం వచ్చే అవకాశం ఉందని ఎక్సైజ్ వర్గాలు భావిస్తున్నాయి. పండుగ సీజన్‌లో డిమాండ్ అధికంగా ఉండటాన్ని ఆసరాగా చేసుకుని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందన్న చర్చ కూడా వినిపిస్తోంది.

సంక్రాంతి సంబరాల కోసం నారావారిపల్లె చేరుకున్న చంద్రబాబు.. అభివృద్ధి పనుల జాతర - షెడ్యూల్ ఇదిగో!

ఇక మరోవైపు రిటైల్ మద్యం షాపుల యజమానులకు ఇచ్చే మార్జిన్‌ను కూడా ప్రభుత్వం పెంచింది. రూ.99లోపు ఉన్న మద్యం బాటిళ్లపై రిటైలర్లకు ఇచ్చే మార్జిన్‌ను ఒక శాతం పెంచడంతో వారికి కొంత లాభం చేకూరనుంది. అయితే పండుగ సమయాల్లో మద్యం ధరలు పెంచడంపై మందుబాబులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. బార్లు, వైన్ షాపుల్లో వేర్వేరు ధరలు ఉండటంతో వినియోగదారులు అయోమయానికి గురవుతున్నారు. ఈ నేపథ్యంలో అదనపు రిటైల్ ఎక్సైజ్ పన్నును ఉపసంహరించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు సమాచారం.

సంక్రాంతి కానుక.. ప్రభుత్వ ఉద్యోగులకు, రైతులకు గుడ్ న్యూస్.. ఫిబ్రవరి 1 నుంచి..!
Cockroach: వంటింట్లో బొద్దింకలను శాశ్వతంగా తరిమికొట్టే చిట్కా.. ఏం చేయాలంటే? ప్రతి ఇంట్లో ఉండే..
Nirmala Sitharaman: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్.. వరుసగా 9వ బడ్జెట్!
Maruti: మారుతి వినియోగదారులకు భారీ ఊరట..! ఇకపై పెట్రోల్ బంకులే సర్వీస్ సెంటర్లు!
AP Govt: ఏపీ ప్రజలకు అదిరిపోయే న్యూస్..! ఒక్కొక్కరి అకౌంట్లో రూ.10 వేలు జమ!
Gold Scam: స్కానర్లకు చిక్కని ‘గోల్డ్ పేస్ట్’..! నిఘా వ్యవస్థలకు పెద్ద సవాల్‌గా స్మగ్లింగ్ కొత్త ట్రెండ్!

Spotlight

Read More →