Dhurandhar OTT: 10 నిమిషాల సీన్లు మాయం.. ‘ధురంధర్’ OTT వెర్షన్‌పై ఆగ్రహం! Chandramukhi: 22 ఏళ్లైనా తగ్గని క్రేజ్… బాక్సాఫీస్ కింగ్.. ఇప్పటికీ టీవీల్లో ట్రెండ్ అవుతున్న సినిమా! Samantha : పేరు కాదు, గుర్తింపు మారుతుందా.. సమంత సంచలన నిర్ణయం! కీర్తి సురేశ్ సీక్రెట్ లవ్ స్టోరీ.. పెద్దలు అంగీకరించకపోతే - తాళి కట్టే సమయంలో.. Vishwambhara :థియేటర్లకు పండుగ రోజు.. జులై 10న మెగాస్టార్ విశ్వంభర! అనిల్ రావిపూడి 'మెగా' సక్సెస్: బాలయ్య ఫ్యాన్స్‌కు అదిరిపోయే అప్‌డేట్.. భగవంత్ కేసరి మళ్లీ రాబోతున్నాడా? Champion: థియేటర్ల తర్వాత ఓటీటీలో సందడి చేస్తున్న ఛాంపియన్.. నాలుగు భాషల్లో నెట్‌ఫ్లిక్స్‌లో! Charan Upasana: మెగా ఇంటికి ట్విన్స్.. డేట్ ఫిక్స్ అంటూ టాక్! 'ఉస్తాద్ భగత్ సింగ్' డబ్బింగ్ షురూ: పవన్ కళ్యాణ్ మాస్ జాతర మొదలైనట్టే.. రిలీజ్ డేట్ ఎప్పుడంటే? విక్టరీ మ్యాజిక్ రిపీట్.. 65 ఏళ్ల వయసులోనూ తగ్గని క్రేజ్.. త్రివిక్రమ్ సినిమా కోసం వెంకీ మామ భారీ రెమ్యూనరేషన్! Dhurandhar OTT: 10 నిమిషాల సీన్లు మాయం.. ‘ధురంధర్’ OTT వెర్షన్‌పై ఆగ్రహం! Chandramukhi: 22 ఏళ్లైనా తగ్గని క్రేజ్… బాక్సాఫీస్ కింగ్.. ఇప్పటికీ టీవీల్లో ట్రెండ్ అవుతున్న సినిమా! Samantha : పేరు కాదు, గుర్తింపు మారుతుందా.. సమంత సంచలన నిర్ణయం! కీర్తి సురేశ్ సీక్రెట్ లవ్ స్టోరీ.. పెద్దలు అంగీకరించకపోతే - తాళి కట్టే సమయంలో.. Vishwambhara :థియేటర్లకు పండుగ రోజు.. జులై 10న మెగాస్టార్ విశ్వంభర! అనిల్ రావిపూడి 'మెగా' సక్సెస్: బాలయ్య ఫ్యాన్స్‌కు అదిరిపోయే అప్‌డేట్.. భగవంత్ కేసరి మళ్లీ రాబోతున్నాడా? Champion: థియేటర్ల తర్వాత ఓటీటీలో సందడి చేస్తున్న ఛాంపియన్.. నాలుగు భాషల్లో నెట్‌ఫ్లిక్స్‌లో! Charan Upasana: మెగా ఇంటికి ట్విన్స్.. డేట్ ఫిక్స్ అంటూ టాక్! 'ఉస్తాద్ భగత్ సింగ్' డబ్బింగ్ షురూ: పవన్ కళ్యాణ్ మాస్ జాతర మొదలైనట్టే.. రిలీజ్ డేట్ ఎప్పుడంటే? విక్టరీ మ్యాజిక్ రిపీట్.. 65 ఏళ్ల వయసులోనూ తగ్గని క్రేజ్.. త్రివిక్రమ్ సినిమా కోసం వెంకీ మామ భారీ రెమ్యూనరేషన్!

'ఉస్తాద్ భగత్ సింగ్' డబ్బింగ్ షురూ: పవన్ కళ్యాణ్ మాస్ జాతర మొదలైనట్టే.. రిలీజ్ డేట్ ఎప్పుడంటే?

శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు – డబ్బింగ్ స్టూడియోలో హరీశ్ శంకర్ పూజలు – వేసవి రేసులో పవర్ స్టార్ – దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ మ్యాజిక్ – బాక్సాఫీస్ వద్ద పాన్ ఇండియా చిత్రాల పోటీ.

Published : 2026-01-28 15:29:00
  • సమ్మర్ రేసులో 'ఉస్తాద్'.. కానీ రిలీజ్ డేట్ ఎప్పుడు?
  • 'మన శంకర వరప్రసాదారు' గిఫ్ట్.. కొత్త సాంగ్ రెడీ!

పవన్కల్యాణ్ (Pawan Kalyan) అభిమానులకు మరో గుడ్ న్యూస్. ఆయన కథానాయకుడిగా హరీశ్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ 'ఉస్తాద్ భగత్ సింగ్' (Ustaad Bhagat Singh). ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీని వీలైనంత త్వరగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. 

ఇందులో భాగంగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఇప్పటికే శరవేగంగా జరుగుతున్నాయి. ఇందులో కీలకమైన డబ్బింగ్ వర్క్ తాజాగా మొదలైంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ చిత్ర బృందం వీడియోను పంచుకుంది. దర్శకుడు హరీశ్ శంకర్, చిత్ర నిర్మాతలు పూజా కార్యక్రమాలు డబ్బింగ్ పనులు మొదలు పెట్టారు. డబ్బింగ్, ఆర్ఆర్ పూర్తయితే సినిమాకు సంబంధించి మేజర్ వర్క్ పూర్తయినట్టే.

అనువైన తేదీ కోసం వెయింటింగ్..
దర్శకుడు హరీశ్ శంకర్ అండ్ టీమ్ పోస్ట్ ప్రొడక్షన్ పనులు చకచకా పూర్తి చేసినా, అసలు సమస్య విడుదల తేదీ. ఇప్పటివరకూ ఈ మూవీ విడుదల తేదీపై స్పష్టమైన ప్రకటన ఇవ్వలేదు. వేసవి కానుకగా ఈ మూవీని తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అయితే, తేదీ (ustaad bhagat singh release date) విషయంలో మాత్రం తర్జనభర్జనలు జరుగుతున్నాయి. 

ముఖ్యంగా మార్చిలో పాన్ ఇండియా సినిమాలు వరుసగా బాక్సాఫీస్ వద్ద కర్చీఫ్ వేసుకుని కూర్చొన్నాయి. ఇప్పటివరకూ ఆయా చిత్ర బృందాలు ప్రకటించిన తేదీల ప్రకారం 'ధురంధర్2', 'టాక్సిక్', 'ప్యారడైజ్', 'పెద్ది' చిత్రాలు ఒకదాని తర్వాత ఒకటి రానున్నాయి. భారీ బడ్జెట్, అంచనాలతో రూపొందిన వీటి మధ్యలో 'ఉస్తాద్ భగత్సంగ్'ను తీసుకొచ్చే ప్రయత్నమైతే చేయరు. 

ఒకవేళ వీటిలో ఒకట్రెండు పెద్ద చిత్రాలు వాయిదా పడితే మాత్రం 'ఉస్తాద'కు అవకాశం దొరికినట్టే. ఇక ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే విడుదల చేసిన ప్రచార చిత్రాలు, పాటలు ఆకట్టుకుంటున్నాయి. మూవీ నుంచి మరో సాంగ్ సిద్ధంగా ఉంది. దర్శకుడు హరీశ్ శంకర్ ఈ విషయాన్ని తాజాగా పంచుకున్నారు. దర్శకుడు అనిల్ రావిపూడికి చిరంజీవి కారును గిఫ్ట్ గా ఇవ్వగా, ఆ కారు వేసుకొస్తే, 'ఉస్తాద్'లోని కొత్త పాటను ప్లే చేసుకుంటూ డ్రైవ్కు వెళ్లామని 'మన శంకరవరప్రసాదారు' హిట్టయిన సందర్భంగా అదే తాను ఇచ్చే గిఫ్ట్ అంటూ ఎక్స్ వేదికగా హరీశ్ పోస్ట్ పెట్టారు. అంటే, త్వరలోనే కొత్త పాటను విడుదల చేసే అవకాశం ఉంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ మూవీలో శ్రీలీల, రాశీ ఖన్నా కథానాయికలు. పోలీస్ ఆఫీసర్గా పవన్ స్టైలిష్ కనిపించనున్నారు.. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

Spotlight

Read More →