టాలీవుడ్ జేజమ్మ అనుష్క ప్రధాన పాత్రలో నటించిన క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఘాటి’. ఈ సినిమా ట్రైలర్ తాజాగా విడుదలైంది. ట్రైలర్‌లో అనుష్క పాత్ర, ఆమె లుక్స్, డైలాగ్ డెలివరీ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. సినిమాకు అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ (BGM)) కూడా ఆసక్తికరంగా ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఈ సినిమాను సెప్టెంబర్ 5న విడుదల చేయనున్నట్టు మేకర్స్ ప్రకటించారు. అనుష్క అభిమానులు ఈ ట్రైలర్‌తో ఫుల్ ఖుషీ అవుతున్నారు. ‘ఘాటి’ (ghati) చిత్రానికి సంగీతం నాగవెల్లి విద్యాసాగర్ అందించగా, నిర్మాణ బాధ్యతలను యూవీ క్రియేషన్స్ తీసుకున్నారు.