మూడు రోజులు, మూడు రహస్యాలు… అసలు కథ! నక్కపల్లిలో హోంమంత్రి భోగి సంబరాలు.. కేరళ డప్పులతో సందడి.. గోపూజతో ఆధ్యాత్మిక వేడుక! High court: పందెం రాయుళ్లకు హైకోర్టు షాక్..! కలెక్టర్లు, ఎస్పీలకు కఠిన ఆదేశాలు... ఆ జిల్లాలపై ప్రత్యేక నిఘా..! యువతకు ఆదర్శం... వివేకానంద జయంతి వేడుకలలో.. ఏపీ ప్రభుత్వ USA ప్రత్యేక ప్రతినిధి జయరాం! తొలిసారిగా రాజధాని అమరావతిలో గణతంత్ర దినోత్సవం - 10 ఎకరాల విస్తీర్ణంలో పరేడ్‌గ్రౌండ్‌కు ఏర్పాట్లు! Liquor: న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లో నోట్ల వర్షం..! తెలుగు రాష్ట్రాల్లో రికార్డు స్థాయి మద్యం విక్రయాలు..! ప్రజల సేవలో ప్రభుత్వం’ కార్యక్రమం పండుగలా నిర్వహిద్దాం.. చంద్రబాబు సారథ్యంలో .. Anantapur: జగన్‌ పుట్టినరోజు వేడుకల్లో జంతు బలులు…! వైసీపీ కార్యకర్తలపై కేసులు! మూడు రోజులు, మూడు రహస్యాలు… అసలు కథ! నక్కపల్లిలో హోంమంత్రి భోగి సంబరాలు.. కేరళ డప్పులతో సందడి.. గోపూజతో ఆధ్యాత్మిక వేడుక! High court: పందెం రాయుళ్లకు హైకోర్టు షాక్..! కలెక్టర్లు, ఎస్పీలకు కఠిన ఆదేశాలు... ఆ జిల్లాలపై ప్రత్యేక నిఘా..! యువతకు ఆదర్శం... వివేకానంద జయంతి వేడుకలలో.. ఏపీ ప్రభుత్వ USA ప్రత్యేక ప్రతినిధి జయరాం! తొలిసారిగా రాజధాని అమరావతిలో గణతంత్ర దినోత్సవం - 10 ఎకరాల విస్తీర్ణంలో పరేడ్‌గ్రౌండ్‌కు ఏర్పాట్లు! Liquor: న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లో నోట్ల వర్షం..! తెలుగు రాష్ట్రాల్లో రికార్డు స్థాయి మద్యం విక్రయాలు..! ప్రజల సేవలో ప్రభుత్వం’ కార్యక్రమం పండుగలా నిర్వహిద్దాం.. చంద్రబాబు సారథ్యంలో .. Anantapur: జగన్‌ పుట్టినరోజు వేడుకల్లో జంతు బలులు…! వైసీపీ కార్యకర్తలపై కేసులు!

తొలిసారిగా రాజధాని అమరావతిలో గణతంత్ర దినోత్సవం - 10 ఎకరాల విస్తీర్ణంలో పరేడ్‌గ్రౌండ్‌కు ఏర్పాట్లు!

2026-01-08 13:48:00
AP Politics: రప్పా రప్పా రాజకీయాలు మనవి కావు… ప్రజాసేవే తెలుగుదేశం అజెండా నారా లోకేష్!!

గణతంత్ర వేడుకలకు తొలిసారి రాజధాని అమరావతి (Amaravati) వేదిక కాబోతోంది. ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం స్వాతంత్య్ర దినోత్సవం, గణతంత్ర వేడుకల్ని ఏటా విజయవాడలో నిర్వహిస్తోంది. ఇకపై వీటిని అమరావతిలోనే నిర్వహించాలని నిర్ణయించింది. ఈ నెల 26న 77వ గణతంత్ర (Republic day) వేడుకల్ని రాజధానిలో తొలిసారి అట్టహాసంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. 

ఆస్ట్రేలియా, అమెరికా, ఉగాండా, డెన్మార్క్ నుంచి వచ్చిన ఎన్నారైలు.. చంద్రబాబుతో భేటీ!

రాజధాని పరిపాలన నగరంలో మంత్రుల బంగ్లాలకు ఎదురుగా 10 ఎకరాల్లో పరేడ్ గ్రౌండ్ సిద్ధం చేస్తున్నారు. మరో పదెకరాల్లో పార్కింగ్ ఏర్పాట్లు జరుగుతున్నాయి. పరేడ్ గ్రౌండ్ సిద్ధం చేసే బాధ్యతను సీఆర్డీఏకి అప్పగించారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా గవర్నర్ అబ్దుల్ నజీర్ సాయుధ దళాల గౌరవ వందనం స్వీకరించి, జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారు. 

Venkaiah Naidu: భారత్‌కు మేధస్సు కొదవ లేదు.. వెంకయ్యనాయుడు!

రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులు సహా 500 మంది ప్రముఖులు కార్యక్రమానికి హాజరవుతారని భావిస్తున్నారు. తొలిసారి గణతంత్ర వేడుకల్ని అమరావతిలో నిర్వహిస్తుండటంతో వాటిని తిలకించేందుకు రాజధాని గ్రామాల నుంచి, అటు గుంటూరు, ఇటు విజయవాడ నుంచి 10వేల మంది వరకు వస్తారని అంచనా వేస్తున్నారు. ఈ నెల 24న పూర్తిస్థాయి డ్రస్ రిహార్సల్స్ నిర్వహిస్తారు. 

kidney stones: కిడ్నీ స్టోన్స్‌కు బీరు మందా.. నిజం ఇదే!

వేడుకలకు హాజరయ్యే ప్రముఖులు, ప్రజలకు వేర్వేరుగా బ్లాక్లు ఏర్పాటుచేస్తున్నారు. వర్షం కురిసినా ఇబ్బంది లేకుండా వాటర్ఫ్రూఫ్ షామియానాలు వేస్తున్నారు. వందేమాతరం, పది సూత్రాలతో పాటు ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్ని ప్రతిబింబించేలా శకటాలు ఉంటాయి. మూడు ఉత్తమ శకటాలకు బహుమతులు అందజేస్తారు. గణతంత్ర వేడుకల ఏర్పాట్లపై సీఎస్ కె. విజయానంద్ వివిధ శాఖల అధికారులతో బుధవారం సమీక్షించారు. 

Weather: తాజా రిపోర్ట్ - ముంచుకొస్తున్న వాయుగుండం.! 36 గంటల్లో తెలుగు రాష్ట్రాల్లో - గంటకు 15 కిలోమీటర్ల వేగంతో..

వేడుకల ప్రాంగణంలో తాగునీటి వసతి, పారిశుద్ధ్య నిర్వహణ, తాత్కాలిక మరుగుదొడ్లు, బారికేడింగ్, ట్రాఫిక్ నియంత్రణకు పక్కాగా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఆ రోజు లోక్భవన్, హైకోర్టు, అసెంబ్లీ, సచివాలయం, సీఎం క్యాంప్ కార్యాలయం సహా ఇతర ప్రభుత్వ భవనాల్ని విద్యుద్దీపాలతో అలంకరించాలని ఆయన ఆదేశించారు. గణతంత్ర వేడుకలకు శాఖల వారీగా చేయాల్సిన ఏర్పాట్లపై సాధారణ పరిపాలనశాఖ ముఖ్య కార్యదర్శి జె. శ్యామలరావు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు.

Tirumala: రికార్డ్ స్థాయిలో తిరుమల వైకుంఠ ద్వార దర్శనాలు!
మిర్యాలగూడ ప్రణయ్ పరువు హత్య కేసులో కీలక మలుపు..!!
ORR: ఏపీలో కొత్తగా మరో ఔటర్ రింగ్ రోడ్డు.. రూ.1,930 కోట్లతో! ఆ జిల్లా దశ తిరిగినట్లే!
Dhurandhar: బాక్సాఫీస్ వద్ద ధురంధర్ ప్రభంజనం.. ₹1,222 కోట్లతో కొత్త చరిత్ర!
Peanut Butter: నిద్ర పట్టక సతమతమవుతున్నారా.... పీనట్ బటర్ తో రాత్రంతా ప్రశాంతంగా నిద్రపోవచ్చు!
Tollywood Movie: ఆ సినిమా టికెట్ ధర భారీగా పెంపు.. ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!
Zoo Park: ఏపీలో కొత్తగా జూపార్క్! 250 హెక్టార్లలో... అక్కడే ఫిక్స్!

Spotlight

Read More →