LIVE
Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!  •  Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  Promotions: దేవాదాయ శాఖలో భారీ ప్రమోషన్లు.. గ్రేడ్-1 ఆఫీసర్లుగా 26 మంది ఈఓలకు పదోన్నతులు!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  •  AP CRDA: 0.4 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రూపుదిద్దుకుంటున్న నీరుకొండ రిజర్వాయర్...  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
Business

Agriculture News: రాయలసీమ నారింజ రైతుకు ‘పశ్చిమ’ సెగ.. పడిపోయిన ధరలు!

Agriculture News: పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కారణంగా ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం, రాయలసీమ నారింజ రైతులకు భారీ నష్టం వాటిల్లుతోంది. ఎగుమతులు నిలిచిపోవడంతో టన్ను నారింజ ధర రూ. 22 వేలకు పడిపోయింది గిట్టుబాటు ధర లేక రైతులు పడుతున్న ఇబ్బందులు..

AndhraPravasi News Desk 1 min read
Agriculture News: రాయలసీమ నారింజ రైతుకు ‘పశ్చిమ’ సెగ..  పడిపోయిన ధరలు!

Rayalaseema Farmers: పశ్చిమాసియా దేశాల్లో జరుగుతున్న యుద్ధ గొడవలు ఇప్పుడు మన ఏపీలోని నారింజ తోటల మీద పడ్డాయి. గల్ఫ్ దేశాలకు వెళ్లాల్సిన ఎగుమతులు ఆగిపోవడంతో అనంతపురం మార్కెట్‌లో నారింజ ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. విదేశాలకు పండ్లు పంపే దారి లేక, ఇక్కడి వ్యాపారులు చేతులెత్తేయడంతో రైతులు నిలువునా మునిగిపోతున్నారు. కనీసం పెట్టిన పెట్టుబడి కూడా రాదేమోనని తోటల దగ్గర రైతులు కన్నీరు పెడుతున్నారు.

నిజానికి  రాయలసీమలో అనంతపురం, కడప జిల్లాల్లో నారింజ సాగు చాలా ఎక్కువ. దాదాపు 85 వేల హెక్టార్లలో రైతులు  తోటలను పెంచుతున్నారు. ఇక్కడ పండే పండుకు విదేశాల్లో మంచి డిమాండ్ ఉండేది. కానీ ఇప్పుడు అక్కడ యుద్ధం వల్ల ఓడలు, విమానాల రాకపోకలు నిలిచిపోయాయి. దీనివల్ల ఆర్డర్లు అన్నీ క్యాన్సిల్ అయిపోయి, కోతకు వచ్చిన పండు చెట్టు మీదనే ఉండిపోయే పరిస్థితి వచ్చింది.

ఎగుమతులు లేకపోవడంతో వ్యాపారులంతా ఇప్పుడు లోకల్ మార్కెట్ల మీద పడ్డారు. అనంతపురం నుంచి ఢిల్లీ, ముంబై లాంటి నగరాలకు సరుకు పంపిస్తున్నారు. అయితే అక్కడ కూడా మన రైతులకు తిప్పలు తప్పడం లేదు. మహారాష్ట్ర నుంచి వచ్చే నారింజ పండ్లతో విపరీతమైన పోటీ ఎదురవుతోంది. దేశీయ మార్కెట్లలో సరుకు ఎక్కువైపోవడంతో కొనేవాడు లేక ధరలు దారుణంగా తగ్గిపోయాయి.

ధరల విషయానికి వస్తే పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. పోయిన ఏడాది టన్ను నారింజ రూ. 35 వేల వరకు పలికితే, ఇప్పుడు అది కేవలం రూ. 22 వేలకే అడుగుతున్నారు. అంటే టన్నుకు సుమారు రూ. 13 వేల వరకు నష్టం వస్తోంది. ఎరువులు, మందులు, కూలీల ఖర్చులు చూసుకుంటే రైతుకు పైసా కూడా మిగిలేలా లేదు. అప్పులు చేసి తోటలు కాపాడుకున్న రైతులు ఇప్పుడు ఆ అప్పులు ఎలా తీర్చాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు.

ప్రభుత్వం వెంటనే ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని రైతులు కోరుతున్నారు. కనీస మద్దతు ధర ప్రకటించి పండ్లను కొనుగోలు చేస్తేనే తాము బతుకుతామని వేడుకుంటున్నారు. అంతర్జాతీయ సమస్యల వల్ల నష్టపోతున్న తమను ఆదుకోవడానికి ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. 

Be the first to react

More Coverage

Gold Rate Today: ట్రంప్ వ్యాఖ్యలతో బులియన్ మార్కెట్‌లో సరికొత్త రికార్డులు.. భారీగా పెరిగిన పసిడి, వెండి ధరలు!

Gold Rate Today: ట్రంప్ వ్యాఖ్యలతో బులియన్ మార్కెట్‌లో సరికొత్త రికార్డులు.. భారీగా పెరిగిన పసిడి, వెండి ధరలు!

Gold Rate Today: మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు సద్దుమణిగే సంకేతాలు వెలువడటంతో అంతర్జాతీయ మార్కెట్‌లో బం…

Stock Market: అమెరికా-ఇరాన్ శాంతి సంకేతాలు... దలాల్ స్ట్రీట్‌లో బుల్ రన్.. దుమ్మురేపిన స్టాక్ మార్కెట్లు! ప్రపంచ మార్కెట్లలో కొత్త ఉత్సాహం..

Stock Market: అమెరికా-ఇరాన్ శాంతి సంకేతాలు... దలాల్ స్ట్రీట్‌లో బుల్ రన్.. దుమ్మురేపిన స్టాక్ మార్కెట్లు! ప్రపంచ మార్కెట్లలో కొత్త ఉత్సాహం..

Stock Market: అమెరికా, ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కుదరవచ్చనే సానుకూల సంకేతాలతో శుక్రవారం భారత స్టాక్ మ…