LIVE
Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!  •  Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  Promotions: దేవాదాయ శాఖలో భారీ ప్రమోషన్లు.. గ్రేడ్-1 ఆఫీసర్లుగా 26 మంది ఈఓలకు పదోన్నతులు!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  •  AP CRDA: 0.4 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రూపుదిద్దుకుంటున్న నీరుకొండ రిజర్వాయర్...  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
Business

Vijayawada Airport: బెజవాడ టూ కాశీ డైరెక్ట్ ఫ్లైట్.. కేవలం 2 గంటల్లోనే బాబా దర్శనం, టికెట్ ధర ఎంతంటే!

Vijayawada Airport: ఏపీ ప్రభుత్వం రాజధాని అమరావతికి కనెక్టివిటీని పెంచడంపై ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి దేశంలోని పలు నగరాలకు కొత్త సర్వీసులను అందుబాటులోకి తెస్తోంది.

AndhraPravasi News Desk 2 min read
Vijayawada Airport: బెజవాడ టూ కాశీ డైరెక్ట్ ఫ్లైట్.. కేవలం 2 గంటల్లోనే బాబా దర్శనం, టికెట్ ధర ఎంతంటే!
  • విజయవాడ నుంచి వారణాసికి ఆగస్టు 13 నుంచి ఇండిగో విమాన సర్వీసు..
     
  • Business: ఏరోస్పేస్ తయారీలో రూ.9,575 కోట్ల పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యం..

Vijayawada Airport: ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతం అమరావతితో పాటు చుట్టుపక్కల నగరాలకు కనెక్టివిటీని పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం గట్టిగానే ప్లాన్ చేస్తోంది. ఇందులో భాగంగా విజయవాడ (గన్నవరం) అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ప్రయాణికులకు ఒక సూపర్ గుడ్ న్యూస్ అందింది. ఎంతో కాలంగా ఆధ్యాత్మిక ప్రేమికులు, పర్యాటకులు కోరుకుంటున్నట్లుగా.. విజయవాడ నుంచి నేరుగా పుణ్యక్షేత్రం వారణాసి (కాశీ) కి డైరెక్ట్ ఫ్లైట్ సర్వీస్ ప్రారంభం కాబోతోంది.

బాబా విశ్వనాథుడిని దర్శించుకోవాలని అనుకునే విజయవాడ, గుంటూరు మరియు ఉమ్మడి కృష్ణా-గుంటూరు జిల్లాల ప్రజలకు ఈ సర్వీస్ పెద్ద ఊరట. ఆగస్టు 13 నుంచి ఈ కొత్త విమాన సర్వీసు అందుబాటులోకి రానుంది. దీనికి సంబంధించిన టికెట్ బుకింగ్స్ కూడా ఇప్పటికే ఓపెన్ అయ్యాయి.

ఈ విమానం వారానికి మూడు రోజులు (ప్రతి మంగళవారం, గురువారం, శనివారం) నడుస్తుంది. సమయాల విషయానికి వస్తే:
వారణాసి టు విజయవాడ: మధ్యాహ్నం 3:55 గంటలకు కాశీలో బయలుదేరి, సాయంత్రం 5:50 గంటలకు విజయవాడ ల్యాండ్ అవుతుంది.
విజయవాడ టు వారణాసి: తిరిగి సాయంత్రం 6:20 గంటలకు విజయవాడలో టేకాఫ్ అయి, రాత్రి 8:15 గంటలకు వారణాసి చేరుకుంటుంది. కేవలం రెండు గంటల లోపే మనం కాశీ చేరుకోవచ్చు. ఒకవైపు టికెట్ ధర సుమారు రూ.6,500 నుంచి రూ.8,000 మధ్యలో ఉండే అవకాశం ఉంది.

కొత్త ఏవియేషన్ పాలసీ.. పెద్ద ప్లాన్!
వారణాసికి ఫ్లైట్ వేయడం అనేది ఒక చిన్న ముక్క మాత్రమే. దీని వెనుక ఏపీ ప్రభుత్వం పెద్ద స్కెచ్చే వేసింది. 2026 నుంచి 2031 వరకు అమల్లో ఉండేలా ఒక సరికొత్త విమానయాన విధానాన్ని (Aviation Policy) ప్రభుత్వం తీసుకొచ్చింది.

ఈ పాలసీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే.. ఏపీని దేశంలోనే ఒక పెద్ద ఏవియేషన్ హబ్‌గా మార్చడం. 2030 నాటికి ఏరోస్పేస్ తయారీ రంగంలో దాదాపు రూ.9,575 కోట్ల (1 బిలియన్ డాలర్లు) పెట్టుబడులను రాష్ట్రానికి తీసుకురావాలని టార్గెట్ పెట్టుకున్నారు. అంతేకాదు, విమానాల రిపేర్లు (MRO), విడిభాగాల తయారీ రంగంలో మన యువతకు ఉపాధి దొరికేలా ఏటా 5 వేల మందికి స్కిల్ ట్రైనింగ్ కూడా ఇవ్వబోతున్నారు.

ప్రతి 150 కిలోమీటర్లకు ఒక ఎయిర్‌పోర్ట్!
ప్రభుత్వం సిద్ధం చేసిన నెట్‌వర్క్ ప్లాన్ వింటే ఎవరికైనా అబ్బా అనిపిస్తుంది. రాష్ట్రంలో ప్రతి 150 కిలోమీటర్ల పరిధిలో ఒక విమానాశ్రయం ఉండాలనేది సీఎం చంద్రబాబు ఆలోచన.
కొత్త విమానాశ్రయాలు: దగదర్తి, కుప్పం, శ్రీకాకుళం, నాగార్జునసాగర్, అనంతపురం వంటి చోట్ల కొత్తగా ఎయిర్‌పోర్టులు రాబోతున్నాయి.

బడ్జెట్ ఎయిర్‌పోర్ట్స్ & వాటర్‌డ్రోమ్స్: 7 లో-కాస్ట్ (తక్కువ బడ్జెట్) విమానాశ్రయాలతో పాటు టూరిజం పెంచడానికి 10 కి పైగా వాటర్‌డ్రోమ్స్ (నీటిపై ల్యాండ్ అయ్యే విమానాల కోసం), హెలిపోర్టులను కట్టనున్నారు. భవిష్యత్తులో ఏపీలోని ప్రధాన ఎయిర్‌పోర్టుల నుంచి దేశంలోని 25 ప్రముఖ నగరాలకు, అలాగే విదేశాల్లోని 10 కి పైగా అంతర్జాతీయ గమ్యస్థానాలకు డైరెక్ట్ ఫ్లైట్స్ నడపాలన్నది ప్రభుత్వ సంకల్పం.

కాశీకి విమాన సర్వీస్ రావడం అనేది సామాన్య భక్తులకు ఎంతో సంతోషాన్ని ఇచ్చే విషయం. వయసైన వారు కూడా ఇబ్బంది లేకుండా దైవదర్శనం చేసుకునే వీలు కలుగుతుంది. మరోవైపు ప్రభుత్వం అనుకుంటున్నట్లుగా ఎయిర్‌పోర్టుల నెట్‌వర్క్ కనుక విస్తరిస్తే.. ఏపీకి పెట్టుబడులు పెరగడమే కాకుండా, ప్రయాణాలు కూడా చాలా ఈజీ అయిపోతాయి!

Be the first to react

More Coverage

Gold Rate Today: ట్రంప్ వ్యాఖ్యలతో బులియన్ మార్కెట్‌లో సరికొత్త రికార్డులు.. భారీగా పెరిగిన పసిడి, వెండి ధరలు!

Gold Rate Today: ట్రంప్ వ్యాఖ్యలతో బులియన్ మార్కెట్‌లో సరికొత్త రికార్డులు.. భారీగా పెరిగిన పసిడి, వెండి ధరలు!

Gold Rate Today: మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు సద్దుమణిగే సంకేతాలు వెలువడటంతో అంతర్జాతీయ మార్కెట్‌లో బం…

Stock Market: అమెరికా-ఇరాన్ శాంతి సంకేతాలు... దలాల్ స్ట్రీట్‌లో బుల్ రన్.. దుమ్మురేపిన స్టాక్ మార్కెట్లు! ప్రపంచ మార్కెట్లలో కొత్త ఉత్సాహం..

Stock Market: అమెరికా-ఇరాన్ శాంతి సంకేతాలు... దలాల్ స్ట్రీట్‌లో బుల్ రన్.. దుమ్మురేపిన స్టాక్ మార్కెట్లు! ప్రపంచ మార్కెట్లలో కొత్త ఉత్సాహం..

Stock Market: అమెరికా, ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కుదరవచ్చనే సానుకూల సంకేతాలతో శుక్రవారం భారత స్టాక్ మ…