LIVE
Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!  •  Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  Promotions: దేవాదాయ శాఖలో భారీ ప్రమోషన్లు.. గ్రేడ్-1 ఆఫీసర్లుగా 26 మంది ఈఓలకు పదోన్నతులు!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  •  AP CRDA: 0.4 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రూపుదిద్దుకుంటున్న నీరుకొండ రిజర్వాయర్...  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
Business

MSME: విజయవాడలో ‘SME IPO’ అవగాహన సదస్సు.. చిన్న పరిశ్రమలకు పెట్టుబడి మార్కెట్ దిశగా కొత్త మార్గం!

MSME: ఆంధ్రప్రదేశ్‌లో సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమలకు (MSMEs) పెట్టుబడి మార్కెట్లపై అవగాహన కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగు వేస్తోంది. ఏపీ ఎంఎస్ఎంఈ అభివృద్ధి సంస్థ, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 13న విజయవాడలోని నోవోటెల్ విజయవాడ హోటల్‌లో ప్…

AndhraPravasi News Desk 2 min read
MSME: విజయవాడలో ‘SME IPO’ అవగాహన సదస్సు.. చిన్న పరిశ్రమలకు పెట్టుబడి మార్కెట్ దిశగా కొత్త మార్గం!

ఎంఎస్ఎంఈలకు పెట్టుబ‌డి మార్కెట్ల‌పై అవ‌గాహ‌నే ల‌క్ష్యం..

MSME రూపురేఖలు మార్చనున్న ‘NSE ఎమర్జ్’..

ఆంధ్రప్రదేశ్‌లో సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమలకు (MSMEs) పెట్టుబడి మార్కెట్లపై అవగాహన కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగు వేస్తోంది. ఏపీ ఎంఎస్ఎంఈ అభివృద్ధి సంస్థ, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 13న విజయవాడలోని నోవోటెల్ విజయవాడ హోటల్‌లో ప్రత్యేక “SME IPO అవగాహన సదస్సు” నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఎంఎస్ఎంఈ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఐటీ శాఖ మంత్రి నారా లొకేష్, నరసరావుపేట ఎంపీ లావు శ్రీ కృష్ణ దేవరాయలు హాజరుకానున్నారు. రాష్ట్రంలోని చిన్న పరిశ్రమలకు పెట్టుబడి అవకాశాలపై అవగాహన కల్పించడం ఈ సదస్సు ప్రధాన లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు.

మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ, దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకలా నిలిచే ఎంఎస్ఎంఈల అభివృద్ధిలో “NSE ఎమర్జ్” కీలక పాత్ర పోషిస్తోందన్నారు. ఇప్పటివరకు చిన్న పరిశ్రమలు ఎక్కువగా బ్యాంకు రుణాలపైనే ఆధారపడేవని, ఇప్పుడు స్టాక్ మార్కెట్ ద్వారా కూడా పెట్టుబడులు సమీకరించే అవకాశం అందుబాటులోకి వచ్చిందని చెప్పారు.

‘NSE ఎమర్జ్’ వేదిక ద్వారా చిన్న పరిశ్రమలు ఈక్విటీ మూలధనం సేకరించవచ్చని, దీంతో వడ్డీ భారం తగ్గడమే కాకుండా సంస్థల ఆర్థిక స్థితి మరింత బలపడుతుందని వివరించారు. ముఖ్యంగా డెట్-ఈక్విటీ నిష్పత్తి మెరుగుపడి, భవిష్యత్తులో క్రెడిట్ రేటింగ్ పెరగడానికి ఇది ఉపయోగపడుతుందని తెలిపారు.

చిన్న పరిశ్రమలు నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో లిస్ట్ అయితే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వస్తుందని మంత్రి చెప్పారు. “వేస్ట్ టు వెల్త్” వంటి వినూత్న సాంకేతికతలతో పనిచేసే స్టార్టప్‌లకు, ఎంఎస్ఎంఈ పార్కుల్లోని యూనిట్లకు ఇది పెద్ద అవకాశమని అభిప్రాయపడ్డారు.

ఈ విధానం ద్వారా కేవలం పెట్టుబడులే కాకుండా పారదర్శక యాజమాన్యం, మెరుగైన బ్రాండ్ విలువ కూడా సంస్థలకు లభిస్తుందని తెలిపారు. మెయిన్ బోర్డ్ కంపెనీల మాదిరిగా ప్రతి మూడు నెలలకు కాకుండా, ఆరు నెలలకు ఒకసారి ఆర్థిక నివేదికలు సమర్పించే వెసులుబాటు కూడా ఎంఎస్ఎంఈలకు ఉంటుందని చెప్పారు.

ఈ అంశాన్ని ముందుకు తీసుకెళ్లడంలో టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేత, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులు కీలక పాత్ర పోషించారని మంత్రి ప్రత్యేకంగా ప్రస్తావించారు. రాష్ట్రంలోని యువ పారిశ్రామికవేత్తలు, స్టార్టప్ సంస్థలు, చిన్న పరిశ్రమల యజమానులు ఈ సదస్సును వినియోగించుకోవాలని ప్రభుత్వం పిలుపునిచ్చింది.

Be the first to react

More Coverage

Gold Rate Today: ట్రంప్ వ్యాఖ్యలతో బులియన్ మార్కెట్‌లో సరికొత్త రికార్డులు.. భారీగా పెరిగిన పసిడి, వెండి ధరలు!

Gold Rate Today: ట్రంప్ వ్యాఖ్యలతో బులియన్ మార్కెట్‌లో సరికొత్త రికార్డులు.. భారీగా పెరిగిన పసిడి, వెండి ధరలు!

Gold Rate Today: మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు సద్దుమణిగే సంకేతాలు వెలువడటంతో అంతర్జాతీయ మార్కెట్‌లో బం…

Stock Market: అమెరికా-ఇరాన్ శాంతి సంకేతాలు... దలాల్ స్ట్రీట్‌లో బుల్ రన్.. దుమ్మురేపిన స్టాక్ మార్కెట్లు! ప్రపంచ మార్కెట్లలో కొత్త ఉత్సాహం..

Stock Market: అమెరికా-ఇరాన్ శాంతి సంకేతాలు... దలాల్ స్ట్రీట్‌లో బుల్ రన్.. దుమ్మురేపిన స్టాక్ మార్కెట్లు! ప్రపంచ మార్కెట్లలో కొత్త ఉత్సాహం..

Stock Market: అమెరికా, ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కుదరవచ్చనే సానుకూల సంకేతాలతో శుక్రవారం భారత స్టాక్ మ…