ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో టీమిండియా అద్భుతంగా చెలరేగి ఘన విజయం సాధించింది. సిరీస్ గెలుపు అవకాశాలు లేకపోయినా, ప్రతిష్ఠాత్మకంగా మూడో మ్యాచ్‌లో భారత్ అసలైన క్లాస్ చూపించింది. రోహిత్ శర్మ (121*) సెంచరీతో సునామీ సృష్టిస్తే, విరాట్ కోహ్లీ (74*) తన క్లాసిక్ ఇన్నింగ్స్‌తో అభిమానులకు గూస్బంప్స్ ఇచ్చాడు. ఈ ఇద్దరి అద్భుత బ్యాటింగ్‌తో భారత్ 9 వికెట్ల తేడాతో సూపర్ విజయాన్ని నమోదు చేసింది.
టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్, ఆస్ట్రేలియాను 236 పరుగులకే ఆల్ఔట్ చేసింది. బుమ్రా, కుల్దీప్, సైరాజ్ తలా రెండు వికెట్లు తీసి ప్రత్యర్థిని కట్టడి చేశారు. 237 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన భారత్, కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (24) త్వరగా ఔటైనా, రోహిత్–కోహ్లీ జంట ఆస్ట్రేలియా బౌలర్లను తీవ్రంగా చితక్కొట్టారు. ఈ జంట 200+ రన్స్ పార్టనర్షిప్ నమోదు చేసి మ్యాచ్‌ను సులభంగా ముగించింది. రోహిత్ సెంచరీ అనంతరం కోహ్లీ విన్నింగ్ షాట్ కొట్టి మైదానాన్ని గర్వంగా వీడారు.
అయితే ఈ మ్యాచ్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది కోహ్లీకి ఇచ్చిన “ఎలివేషన్ కామెంటరీ”! “Sen Cricket” కామెంటేటర్స్ విరాట్ మైదానంలోకి అడుగుపెట్టిన క్షణం నుండి ఓ రేంజ్ ఎలివేషన్స్ ఇవ్వడంతో స్టేడియం మొత్తం ఉర్రూతలూగిపోయింది. “Here comes the King, the man who defines Indian cricket!” అని వారు అరిచిన క్షణంలో ప్రేక్షకులందరూ లేచి నిలబడి గట్టిగా హర్షధ్వానాలు చేశారు. కోహ్లీ మొదటి రన్ తీయగానే ఫ్యాన్లు, కామెంటేటర్స్ ఇద్దరూ జోష్‌లో మునిగిపోయారు.
ఈ సన్నివేశం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఫ్యాన్స్ “ఇది గూస్బంప్స్ మూమెంట్”, “కోహ్లీ కోసం ఇచ్చిన ఈ ఎలివేషన్స్ అసలైన రిస్పెక్ట్”, “కామెంటేటర్స్ సూపర్ ఎనర్జీ” అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరోవైపు “RO-KO” కాంబినేషన్‌కి ఫ్యాన్స్ ప్రత్యేక హ్యాష్‌ట్యాగ్‌లు క్రియేట్ చేస్తూ “కింగ్ ఇస్ బ్యాక్”, “రోహిత్-కోహ్లీ ఫైర్” అంటూ ట్రెండ్ చేస్తున్నారు.
తొలి రెండు మ్యాచుల్లో ఓటమితో సిరీస్ కోల్పోయిన భారత్, మూడో వన్డేలో ఈ విజయం సాధించడం ద్వారా అభిమానుల్లో మళ్లీ ఉత్సాహాన్ని నింపింది. ముఖ్యంగా ఐసీసీ టోర్నీలు ముందు ఉన్న ఈ ఫార్మ్ టీమ్‌కి కీలకం. రోహిత్ ఫార్మ్‌లోకి రావడం, కోహ్లీ క్లాసిక్ టచ్‌తో తిరిగి రావడం ఇవి టీమిండియాకు మంచి సంకేతాలు.
ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ బ్యాటింగ్ మాత్రమే కాదు, ఆయన కూల్ ఆప్రోచ్ కూడా చర్చనీయాంశమైంది. ఎప్పటిలాగే రన్ చేజ్లో చిత్తశుద్ధిగా ఆడుతూ తన ఇన్నింగ్స్‌ను మాస్టర్‌క్లాస్‌గా మార్చుకున్నారు. ఆఖర్లో విన్నింగ్ షాట్‌తో టీమ్‌ను విజయతీరాలకు చేర్చినప్పుడు, స్టేడియం మొత్తం “విరాట్.. విరాట్” అంటూ మార్మోగింది.