ఇప్పుడు ఆన్లైన్ షాపింగ్ మన రోజువారీ జీవితంలో భాగమైపోయింది. కేవలం ఒక క్లిక్‌తో మనకు కావాల్సిన వస్తువులు ఇంటి వద్దకే వస్తున్నాయి. అయితే ఈ సౌలభ్యాన్ని ఉపయోగించుకుంటూ కొన్ని ఇ-కామర్స్ సంస్థలు వినియోగదారులను మోసగించేందుకు వివిధ “మార్కెటింగ్ ట్రిక్స్”ను ఉపయోగిస్తున్నాయి. ఈ పద్ధతులు చాలా తెలివిగా ఉండటంతో చాలామంది గుర్తించలేరు. కస్టమర్ల మనసును ప్రభావితం చేసి కొనుగోలు చేయించేలా చేస్తారు. వీటిలో ఫాల్స్ అర్జెన్సీ, బాస్కెట్ స్నీకింగ్, బెయిట్ అండ్ స్విచ్, ఫోర్స్డ్ యాక్షన్ వంటి పద్ధతులు ప్రధానంగా కనిపిస్తున్నాయి.
ఇది అత్యంత సాధారణంగా కనిపించే ట్రిక్. “ఇంకా కేవలం రెండు ఐటమ్స్ మాత్రమే మిగిలి ఉన్నాయి!”, “ఇప్పుడే ఆర్డర్ చేయండి, లేదంటే ఆఫర్ ముగిసిపోతుంది!” వంటి సందేశాలు చూపించడం ద్వారా కస్టమర్లో త్వరగా కొనాలనే ఒత్తిడి తెస్తారు. వాస్తవానికి ఆ వస్తువు స్టాక్‌లో చాలానే ఉన్నప్పటికీ, వినియోగదారుడి నిర్ణయాన్ని వేగంగా తీసుకునేలా చేయడం ఇలాంటి మోసపు మార్కెటింగ్ పద్ధతుల్లో భాగం.
కొన్ని వెబ్సైట్లలో మనం సెలెక్ట్ చేసిన వస్తువులతో పాటు మరికొన్ని అదనపు ఐటమ్స్ ఆటోమేటిక్‌గా కార్ట్‌లో చేరిపోతాయి. ఉదాహరణకు – డొనేషన్, ఎక్స్టెండెడ్ వారంటీ లేదా చారిటీకి సంబంధించిన ఐటమ్స్. వినియోగదారుడు చెల్లింపు సమయంలో ఈ విషయాన్ని గమనించకపోతే, అవసరం లేని వస్తువులకు కూడా చెల్లింపు జరగిపోతుంది. ఈ మోసాన్ని “బాస్కెట్ స్నీకింగ్” అని అంటారు. కాబట్టి చెల్లింపుకు ముందు ఎల్లప్పుడూ కార్ట్‌ను ఒకసారి చెక్ చేయడం మంచిది.
ఇవి కూడా చాలా తెలివైన పద్ధతులు. మొదట ఒక వస్తువును తక్కువ ధరలో చూపించి ఆకర్షించి, చివర్లో ఆ వస్తువు అందుబాటులో లేదని చెప్పి మరొక ఖరీదైన వస్తువును కొనమని సూచిస్తారు. దీన్ని “బెయిట్ అండ్ స్విచ్” అంటారు. ఇక “ఫోర్స్డ్ యాక్షన్” ట్రిక్‌లో మాత్రం వినియోగదారుడు బలవంతంగా కొన్ని సబ్స్క్రిప్షన్లు, వారంటీలు తీసుకోవాల్సిందే. లేకపోతే ఆ ప్రొడక్ట్ కొనలేరు. ఇలా వినియోగదారుని ఆలోచించకుండా నిర్ణయం తీసుకునేలా చేయడమే ఈ పద్ధతుల ఉద్దేశం.
ఇలాంటి ట్రిక్స్‌కు తోడు యాప్ డౌన్లోడ్ చేయమని, నోటిఫికేషన్లు ఆన్ చేయమని, మెయిల్ ఐడీ ఇవ్వమని ఒత్తిడి చేయడం కూడా తరచూ జరుగుతుంది. వీటి ద్వారా ప్రమోషనల్ మెయిల్స్, అడ్స్ పంపడం ద్వారా వినియోగదారుల డేటా సేకరిస్తారు. అందువల్ల ప్రతి ఆన్లైన్ షాపర్ జాగ్రత్తగా ఉండాలి. కార్ట్‌లో ఏమున్నదో చెక్ చేయడం, ఆఫర్లను క్షుణ్ణంగా పరిశీలించడం, అనుమానాస్పద వెబ్సైట్లను దూరంగా ఉంచడం మంచిది. అవగాహనతో వ్యవహరిస్తే ఈ డిజిటల్ మోసాల బారిన పడే ప్రమాదం తగ్గుతుంది.