డిసెంబర్ 1 నుంచి ఈ కొత్త నిబంధన అమల్లోకి.. ఇకపై కొత్త ఫోన్లలో ఈ ప్రభుత్వ యాప్ తప్పనిసరి!

2025-12-01 15:16:00
Guyana to India: గయానా నుంచి భారత్‌కు 2 సూపర్ ట్యాంకర్ల ప్రయాణం ప్రారంభం.. 17,700 KM దూరం నుండి!

దేశంలో పెరుగుతున్న సైబర్ నేరాలు, మొబైల్ ఫోన్ల దొంగతనాలకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై దేశంలో విక్రయించే అన్ని కొత్త స్మార్ట్‌ఫోన్‌లలో 'సంచార్ సాథీ' అనే ప్రభుత్వ సైబర్ సెక్యూరిటీ యాప్‌ను తప్పనిసరిగా ఇన్‌స్టాల్ చేయాలని మొబైల్ తయారీ కంపెనీలను ఆదేశించింది. ముఖ్యంగా, ఈ యాప్‌ను వినియోగదారులు తమ ఫోన్ల నుంచి తొలగించడం (డిలీట్ చేయడం) సాధ్యం కాదు. ఈ మేరకు కేంద్ర టెలికాం మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసినట్లు 'రాయిటర్స్' వార్తా సంస్థ తన కథనంలో వెల్లడించింది.

సైబర్ మోసాలు, ఫోన్ చోరీలు, ఐఎంఈఐ (IMEI) నంబర్ల ట్యాంపరింగ్ వంటి సమస్యలను ఎదుర్కోవడానికి కేంద్రం ఈ ఏడాది జనవరిలో 'సంచార్ సాథీ' పోర్టల్‌ను, యాప్‌ను ప్రారంభించింది. దీని ద్వారా పోయిన లేదా దొంగిలించబడిన ఫోన్లను సులభంగా ట్రాక్ చేయవచ్చు. ఇప్పటివరకు ఈ యాప్ సహాయంతో సుమారు 7 లక్షల చోరీ ఫోన్‌లను గుర్తించి బ్లాక్ చేశారు. ఈ యాప్ సైబర్ దాడుల నుంచి వినియోగదారులను హెచ్చరించడంతో పాటు, అనధికారిక యాక్సెస్‌ను కూడా నిరోధిస్తుంది.

కొత్త ఆదేశాల ప్రకారం, 2025 డిసెంబర్ 1 నుంచి తయారయ్యే అన్ని స్మార్ట్‌ఫోన్‌లలో ఈ యాప్‌ను డిఫాల్ట్‌గా అందించాల్సి ఉంటుంది. ఇప్పటికే మార్కెట్‌లోకి వచ్చిన ఫోన్‌లకు సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ ద్వారా దీన్ని ఇన్‌స్టాల్ చేయాలని సూచించారు. ఈ మార్పులను అమలు చేయడానికి మొబైల్ కంపెనీలకు 90 రోజుల సమయం ఇచ్చారు.

అయితే, ప్రభుత్వ నిర్ణయంపై యాపిల్, శాంసంగ్, గూగుల్ వంటి టెక్ దిగ్గజాలు ఎలా స్పందిస్తాయన్నది ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా యాపిల్ వంటి సంస్థలు తమ ఆపరేటింగ్ సిస్టమ్‌లో థర్డ్-పార్టీ యాప్‌లను డిఫాల్ట్‌గా చేర్చడానికి ఇష్టపడవు. గతంలో ఇలాంటి ప్రతిపాదనలను వ్యతిరేకించిన దాఖలాలు ఉన్నాయి. ఈ యాప్ ద్వారా సైబర్ నేరాలు 20 నుంచి 30 శాతం వరకు తగ్గే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

అమెజాన్ బ్లాక్ ఫ్రైడే సేల్ నుంచి కేవలం 22 వేలకే 50 ఇంచ్ Dolby Smart Tv అందుకోండి.!
Wow offers: ప్రీమియం ఫీచర్లు – తక్కువ ధర..! భారీ డిస్కౌంట్‌తో అందుబాటులో iQOO 15!
Scrub typhus cases: భయపెడుతున్న పురుగు.. రాష్ట్రంలో స్క్రబ్ టైఫస్ కేసులు పెరుగుదల.. ఆరోగ్య శాఖ అలర్ట్!
Amaravatis: 16,666 ఎకరాల్లో అమరావతి రూపురేఖలు మార్పు.. మెట్రో, హైస్పీడ్ రైలుకు ప్రణాళికలు సిద్ధం!
డీమార్ట్‌కు వెళ్లేవారికి తెలియని సీక్రెట్స్.. డీమార్ట్‌లో షాపింగ్ చేస్తున్నారా.? తక్కువ డబ్బులకు ఎక్కువ వస్తువులు..
Water: ఢిల్లీలో బోర్‌ నీటిలో విషపదార్థాల వెల్లువ…! యురేనియం, సీసం ప్రమాదకర స్థాయిలో..!
ప్రపంచ మార్కెట్‌లో 4,000 మార్క్ దాటిన గోల్డ్.. 2026లో పసిడి గమనం ఎలా? గూగుల్‌లో ఇదే హాట్ టాపిక్!
Albanese Wedding Viral: 62 ఏళ్ల వయసులో ప్రేమవివాహం చేసుకున్న ఆస్ట్రేలియా ప్రధాని అల్బనీస్!!
Rajya Sabha: పేదల కోసం చర్చలు జరగాలి.. రాజ్యసభలో రాధాకృష్ణన్ సందేశం!
Chandrababu: ఏలూరు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన! ఎన్టీఆర్ పింఛన్ల పంపిణీ ప్రారంభం...
Pension: ఏపీలో వారికి శుభవార్త! ప్రత్యేక పింఛన్ పథకం త్వరలోనే..!
Navy Day 2025: విశాఖలో 2025 నేవీ డే సన్నాహక వేడుకలకు ఘన ఆరంభం!!

Spotlight

Read More →