నందిగామ రోడ్డు యాక్సిడెంట్ లో NRI మృతి! ఎన్ఆర్‌ఐలకు అండగా APNRT భీమా! పూర్తి వివరాలు...

2025-11-29 12:27:00
ప్రయాణికులకు షాక్.. విశాఖ-లింగంపల్లి జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌ సహా ప్రధాన రైళ్లు రద్దు!

విజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ఎన్టీఆర్ జిల్లా నందిగామ శివారులోని అనాసాగరం వద్ద ఒక కుటుంబాన్ని కన్నీళ్లలో ముంచింది. అమెరికాలో ఐటీ కంపెనీ హెడ్‌గా ఐదేళ్లుగా పనిచేస్తున్న ఎన్ఆర్ఐ, సాఫ్ట్వేర్ ఇంజినీర్ చెరుకూరి చంద్రశేఖర్ (50) ఈ ప్రమాదంలో దుర్మరణం చెందారు. రూ.2.50 కోట్ల విలువ చేసే కారులో కంపెనీ ఎండీ యలమంచలి జగదీష్ బాబుతో కలిసి గురువారం సాయంత్రం హైదరాబాద్ నుంచి విజయవాడకు బయలుదేరిన చంద్రశేఖర్ ప్రయాణం ఊహించని ప్రమాదంతో ముగిసింది.

Senior Leader: కాంగ్రెస్ సీనియర్ నేత శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత…! యూపీ రాజకీయాల్లో..!

రాత్రి 12 గంటల సమయంలో అనాసాగరం ఫ్లైఓవర్‌పై వారి కారు ఎక్కిన క్షణంలోనే ఎదురుగా వేగంగా వస్తున్న సిమెంట్ లారీ టైరు పేలడంతో అదుపు కోల్పోయి రోడ్డుమధ్యకు రావడంతో కారు బలంగా లారీని ఢీకొట్టింది. ఢీకొట్టిన దెబ్బకు కారు నుజ్జునుజ్జయ్యింది. డ్రైవర్ పక్కన కూర్చున్న చంద్రశేఖర్ ఘటనాస్థలంలోనే మరణించగా, వెనుక సీటులో ఉన్న జగదీష్ బాబుకు గాయాలయ్యాయి. డ్రైవర్ రాంచర్ల రెడ్డిని కూడా గాయాలతో విజయవాడలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. చంద్రశేఖర్ మృతదేహాన్ని నందిగామ మార్చురీకి తరలించారు. శుక్రవారం విజయవాడ డీసీపీ లక్ష్మీనారాయణ ఘటనాస్థలాన్ని పరిశీలించారు. లారీ డ్రైవర్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Drinking water: రోజూ 2–3 లీటర్లకే పరిమితం.. అతిగా నీరు తాగితే శరీరానికి షాక్!

చంద్రశేఖర్ కు భార్య, 10, 12 ఏళ్ల ఇద్దరు కుమారులు ఉన్నారు. ఈఏ టీమ్ సొల్యూషన్స్ తరపున ఇటీవల విశాఖలో జరిగిన సీఐఐ సదస్సులో రూ.300 కోట్ల పెట్టుబడులకు ఎంవోయూ కూడా చేసుకున్న ఆయన మరణం కుటుంబానికి, సంస్థకు తీరని నష్టంగా మారింది.

AP Students: విద్యార్థి మిత్ర కిట్ల పంపిణీకి ముహుర్తం ఫిక్స్! ఆ రోజు నుంచే పంపిణీ...

ఇలాంటి అనుకోని ఘటనలు జరిగే సమయంలో APNRT Society ప్రవాసాంధ్ర భరోసా భీమా ఎన్నో కుటుంబాలను ఆర్థికంగా, సహాయకంగా నిలబెడుతుంది. ముఖ్యంగా విదేశాల్లో పనిచేస్తున్న తెలుగు ప్రజలు మరియు వారి కుటుంబాలకు ఇది చాలా ఉపయోగకరం. ప్రమాదాల వల్ల మరణం లేదా వికలాంగత కలిగిన సందర్భంలో రూ. 10 లక్షల ఆర్థిక సహాయం అందించడం జరుగుతుంది. అలాగే విదేశాల్లో మరణిస్తే మృతదేహాన్ని స్వదేశానికి తరలించడానికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తారు. విదేశాలలో పనిచేస్తున్న ఉద్యోగుల భద్రతకై ప్రభుత్వ మద్దతుతో నడిచే నమ్మకమైన బీమాను APNRT అందిస్తుంది.  ఉద్యోగులకు లేదా వలస కార్మికులు 3 సంవత్సరాలకు కెవలం రూ. 590 మరియు విద్యార్థులు అయితే  ఒక సంవత్సరానికి కేవలం 218/- రూపాయలతో ఈ రోజే ఇన్షూరెన్స్ తీసుకొని మీ కుటుంబ సభ్యులకు భరోసా కల్పించవచ్చు.

IFFI 2025: గోవా సీఎం చేతుల మీదుగా లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు… ఆ లెజెండరీ స్టార్ ఎవరంటే?

ఈ పథకంలో నమోదు చేసుకోవడానికి https://apnrts.ap.gov.in/insurance వెబ్ సైట్ ను సందర్శించగలరు. మరిన్ని వివరాలకు ఏపీఎన్ఆర్టి సొసైటీ 24/7 హెల్ప్లైన్  నెంబర్ లు కాల్: +91 863 2340678 వాట్సాప్: +91 85000 27678 ను సంప్రదించగలరు. చంద్రశేఖర్ వంటి విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్న అనేక మంది ఎన్ఆర్ఐల కుటుంబాలకు ఇటువంటి బీమా సేవలు భరోసా కలిగిస్తాయి. ఈ ఘటన అప్రమత్తంగా ఉండాలని, ఎన్ఆర్ఐలు తప్పనిసరిగా ఇలాంటి బీమా పథకాల ద్వారా తమ కుటుంబాలను రక్షించుకోవాలనే సందేశాన్ని గుర్తు చేస్తుంది.

Trump : ఆ మృగం మూల్యం తప్పక చెల్లించాలి.. ట్రంప్ ఆగ్రహం!
New Roads: విశాఖపట్నంలో కొత్తగా నాలుగు రోడ్లు.. భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు దూసుకెళ్లొచ్చు! రూపు రేఖలు మారిపోతాయి...
Hospital: కేజీహెచ్‌లో భారీ అగ్ని ప్రమాదం! కార్డియాలజీ విభాగం పొగమంచులో మునిగింది!
Glass Bridge: దేశంలోనే అతి పొడవైన గ్లాస్ బ్రిడ్జి గ్రాండ్ ఓపెనింగ్! పర్యాటకులకు కొత్త థ్రిల్!
Railway Alert: రైల్వే ప్రయాణికులకు అలర్ట్! జనవరి 27–31 మధ్య ఈ రూట్లో 16 రైళ్లు రద్దు!

Spotlight

Read More →