AP New Highways: అమరావతి-మచిలీపట్నం మధ్య కొత్త హైవే... త్వరలో రెండు రాష్ట్రాల మధ్య తగ్గనున్న దూరం! IRCTC: బడ్జెట్ ధరలో డార్జిలింగ్ విహారం... ఐఆర్సీటీసీ అదిరిపోయే ఆఫర్.. భోజనం, వసతి అన్నీ ఫ్రీ! Railway Update: రైలు ప్రయాణికులకు అలర్ట్... తెలుగు రాష్ట్రాల్లో 15 రైళ్లు రద్దు.. కారణం ఇదే! Techie Trekking: ట్రెకింగ్ అని వెళ్ళి.. అదృశ్యమై.. తిరిగి వచ్చి.... పోలీసుల దర్యాప్తులో విస్తుపోయే నిజాలు! Air Canada Flight: ఆకాశంలో ఆగిపోయిన ఇంజిన్లు.. గ్లైడర్‌గా మారిన విమానం.. ఒళ్లు గగుర్పొడిచే నాటి ఘటన! Special Trains: నరసాపురం & అరుణాచలం, బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్.. వారికి సీట్ల లభ్యత పెంపు.. 90 నిమిషాల్లో అమరావతి టు హైదరాబాద్.. హైస్పీడ్ రైల్ కారిడార్ డ్రాఫ్ట్ ప్లాన్ సిద్ధం! India Wonders: మరో ప్రపంచం... భారతదేశంలో ఎవరికీ తెలియని 5 రహస్య పర్యాటక ప్రాంతాలివే! Special Trains: ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఈ రూట్లో స్పెషల్ ట్రైన్స్ అక్కడ వరకు పొడిగింపు! New Toll Rules India: ఏప్రిల్ 10 నుంచి టోల్ గేట్ల వద్ద కొత్త రూల్స్.. నగదు చెల్లింపులు ఇక బంద్! AP New Highways: అమరావతి-మచిలీపట్నం మధ్య కొత్త హైవే... త్వరలో రెండు రాష్ట్రాల మధ్య తగ్గనున్న దూరం! IRCTC: బడ్జెట్ ధరలో డార్జిలింగ్ విహారం... ఐఆర్సీటీసీ అదిరిపోయే ఆఫర్.. భోజనం, వసతి అన్నీ ఫ్రీ! Railway Update: రైలు ప్రయాణికులకు అలర్ట్... తెలుగు రాష్ట్రాల్లో 15 రైళ్లు రద్దు.. కారణం ఇదే! Techie Trekking: ట్రెకింగ్ అని వెళ్ళి.. అదృశ్యమై.. తిరిగి వచ్చి.... పోలీసుల దర్యాప్తులో విస్తుపోయే నిజాలు! Air Canada Flight: ఆకాశంలో ఆగిపోయిన ఇంజిన్లు.. గ్లైడర్‌గా మారిన విమానం.. ఒళ్లు గగుర్పొడిచే నాటి ఘటన! Special Trains: నరసాపురం & అరుణాచలం, బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్.. వారికి సీట్ల లభ్యత పెంపు.. 90 నిమిషాల్లో అమరావతి టు హైదరాబాద్.. హైస్పీడ్ రైల్ కారిడార్ డ్రాఫ్ట్ ప్లాన్ సిద్ధం! India Wonders: మరో ప్రపంచం... భారతదేశంలో ఎవరికీ తెలియని 5 రహస్య పర్యాటక ప్రాంతాలివే! Special Trains: ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఈ రూట్లో స్పెషల్ ట్రైన్స్ అక్కడ వరకు పొడిగింపు! New Toll Rules India: ఏప్రిల్ 10 నుంచి టోల్ గేట్ల వద్ద కొత్త రూల్స్.. నగదు చెల్లింపులు ఇక బంద్!

AP New Highways: అమరావతి-మచిలీపట్నం మధ్య కొత్త హైవే... త్వరలో రెండు రాష్ట్రాల మధ్య తగ్గనున్న దూరం!

AP New Highways: హైదరాబాద్ నుంచి అమరావతి మీదుగా మచిలీపట్నం పోర్టు వరకు నిర్మించనున్న గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వే కోసం ప్రభుత్వం మూడు ప్రధాన అలైన్‌మెంట్లను పరిశీలిస్తోంది. ఏ రూట్ ద్వారా దూరం తగ్గుతుంది? నిర్మాణ వ్యయం ఎంత కానుంది? భూసేకరణకు ఎంత ఖర్చవుతుంది? సంబంధించిన వివరాలు..

Published : 2026-04-10 13:26:00

AP New Highways: హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి మీదుగా మచిలీపట్నం పోర్టు వరకు అనుసంధానతను పెంచేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మక గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణానికి సిద్ధమవుతోంది. ఈ భారీ ప్రాజెక్టును ఏ మార్గం ద్వారా చేపడితే బాగుంటుందనే అంశంపై ప్రస్తుతం కసరత్తు జరుగుతోంది. ముఖ్యంగా రాజధాని అమరావతికి దగ్గరగా ఈ రహదారి వెళ్లాలా లేక ప్రతిపాదిత ఔటర్ రింగ్ రోడ్  మీదుగా మళ్లించాలా అనే దానిపై ప్రభుత్వం గంభీరంగా ఆలోచిస్తోంది. దీని కోసం నియమించిన నిపుణుల కమిటీ ఇప్పటికే మూడు ప్రధాన అలైన్‌మెంట్లను సిద్ధం చేసి ప్రభుత్వానికి సమర్పించింది.

మొదటి ఆప్షన్ ప్రకారం చూస్తే, హైదరాబాద్‌లోని ఫ్యూచర్ సిటీ నుంచి ఈ రహదారి ప్రారంభమవుతుంది. తెలంగాణలోని హాలియా మీదుగా అమరావతి ఔటర్ రింగ్ రోడ్ వరకు ఇది సాగుతుంది. దాదాపు 303 కిలోమీటర్ల మేర సాగే ఈ మార్గం జలాల్‌పురం వద్ద ORRలో కలిసి, మళ్లీ తెనాలి సమీపంలో విడిపోయి మచిలీపట్నం వైపు వెళ్తుంది. ఈ పద్ధతిలో వెళ్తే భూసేకరణకు రూ. 5,500 కోట్లు, నిర్మాణానికి రూ. 8,570 కోట్లు ఖర్చవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

రెండో ఆప్షన్ ద్వారా ఎక్స్‌ప్రెస్‌వే దూరాన్ని మరింత తగ్గించే అవకాశం ఉంది. దీని ప్రకారం మొత్తం మార్గం 293 కిలోమీటర్లుగా ఉంటుంది. ఇది నేరుగా కాజ సమీపంలోని చెన్నై-కోల్‌కతా జాతీయ రహదారికి కలుస్తుంది. అక్కడ నుంచి విజయవాడ బైపాస్ మీదుగా ప్రయాణించి మచిలీపట్నం చేరుకుంటుంది. ఈ అలైన్‌మెంట్‌లో భూసేకరణ భారం కొంచెం ఎక్కువగా అంటే రూ. 6,045 కోట్లు ఉండనుంది. నిర్మాణ వ్యయం కూడా రూ. 9,530 కోట్లకు చేరుతుందని ప్రాథమిక నివేదికలు చెబుతున్నాయి. ఈ మార్గం వల్ల విజయవాడకు కనెక్టివిటీ సులభతరం అవుతుంది.

ఇక మూడో ఆప్షన్ పూర్తిగా కొత్తగా ఉండే 'గ్రీన్‌ఫీల్డ్' మార్గం. అంటే హైదరాబాద్ నుంచి మచిలీపట్నం వరకు దాదాపు 288 కిలోమీటర్ల మేర ఎక్కడా పాత రోడ్లను వాడకుండా కొత్తగా నిర్మిస్తారు. ఇది అమరావతిలోని తాడికొండ, నంబూరు వంటి కీలక ప్రాంతాల మీదుగా సాగుతుంది. ఈ ప్రాజెక్టు వల్ల ప్రయాణ సమయం భారీగా తగ్గుతుంది కానీ, భూసేకరణ  నిర్మాణ వ్యయం మాత్రం రూ. 16,000 కోట్లకు పైగా ఉంటుందని అంచనా. రాజధాని ప్రాంతం లోపల నుంచి వెళ్లే ఈ మార్గం వల్ల భవిష్యత్తులో అమరావతి అభివృద్ధికి మరిన్ని అవకాశాలు ఉంటాయని అధికారులు భావిస్తున్నారు.

ప్రస్తుతం ఈ మూడు ప్రతిపాదనలను ప్రభుత్వం క్షుణ్ణంగా పరిశీలిస్తోంది. తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనం చేకూర్చే అలైన్‌మెంట్‌పై ప్రభుత్వం మొగ్గు చూపే అవకాశం ఉంది. ఏ మార్గం ఖరారైనా, హైదరాబాద్ - అమరావతి మధ్య ప్రయాణ సమయం గణనీయంగా తగ్గిపోనుంది. కేవలం రెండు రాష్ట్రాల మధ్య రవాణా వ్యవస్థ మెరుగుపడటమే కాకుండా, మచిలీపట్నం పోర్టుకు ఈ ఎక్స్‌ప్రెస్‌వే ఒక వెన్నెముకలా మారుతుంది. త్వరలోనే దీనిపై తుది నిర్ణయం తీసుకుని భూసేకరణ పనులకు పచ్చజెండా ఊపాలని ప్రభుత్వం యోచిస్తోంది

Spotlight

Read More →