ఆధునిక యుగంలో మన ప్రయాణం ఎక్కడికి కొనసాగిన చేతిలో ఫోన్ తప్పనిసరిగా ఉండాలి. ఎందుకంటే మన చేతులు ఫోన్ ఉంటే ప్రపంచమే మన చేతిలో ఉందని చెప్పుకోవాలి. ఇటువంటి సమయంలో మొబైల్ ఫోన్ బ్యాటరీ తగ్గిపోవడం చాలా మందికి సాధారణ సమస్యగా మారింది. అందుకే కారులో ఉన్నప్పుడు వెంటనే ఛార్జింగ్ పెట్టేయడం అలవాటుగా మారిపోయింది. కానీ కారులో
(car mobile charger risk) మొబైల్‌ను ఛార్జ్ చేయడం నిజంగా సురక్షితమేనా అనే ప్రశ్నకు టెక్ నిపుణులు మాత్రం స్పష్టమైన హెచ్చరికలు ఇస్తున్నారు. సాధారణంగా ఇంట్లో గోడ సాకెట్ నుంచి వచ్చే విద్యుత్ సరఫరా స్థిరంగా ఉంటుంది. కానీ కారులో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంటుంది. కారు ఇంజిన్‌కు అనుసంధానమైన ఆల్టర్నేటర్ ద్వారా విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. ఇంజిన్ వేగం మారినప్పుడల్లా లేదా హెడ్‌లైట్లు, ఏసీ వంటి పరికరాలు ఆన్ చేసినప్పుడు పవర్‌లో హెచ్చుతగ్గులు వస్తుంటాయి. ఈ అస్థిర విద్యుత్ సరఫరా మొబైల్ (phone battery damage) బ్యాటరీపై నెమ్మదిగా కానీ తీవ్ర ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు.
కారులో ఛార్జింగ్ చేయడం వల్ల మొదట కనిపించని సమస్యలు కాలక్రమంలో బయటపడతాయి. అకస్మాత్తుగా వచ్చే పవర్ స్పైక్స్ లేదా వోల్టేజ్ తగ్గుదల వల్ల బ్యాటరీ లోపలి సెల్స్ దెబ్బతింటాయి. ఫలితంగా ఫోన్ త్వరగా వేడెక్కడం, ఛార్జ్ ఎక్కువసేపు నిలవకపోవడం, బ్యాటరీ లైఫ్ తగ్గిపోవడం వంటి సమస్యలు ఎదురవుతాయి. ముఖ్యంగా రోజూ ప్రయాణం చేసే వారు తరచూ కారులోనే ఫోన్ ఛార్జ్ చేస్తే ఈ నష్టం మరింత వేగంగా జరుగుతుంది.
ఇంకొక ముఖ్యమైన అంశం కార్లలో ఉండే (car usb charging) యుఎస్ బి పోర్ట్‌లు. చాలా కార్లలో ఈ పోర్ట్‌లు ప్రధానంగా మ్యూజిక్ ప్లే చేయడం లేదా డేటా కనెక్టివిటీ కోసం మాత్రమే రూపొందించబడతాయి. ఇవి ఫుల్ ఛార్జింగ్‌కు అవసరమైన పవర్ ఇవ్వలేవు. సాధారణంగా వీటిలో పవర్ అవుట్‌పుట్ చాలా తక్కువగా ఉంటుంది. దీంతో ఫోన్ చాలా నెమ్మదిగా ఛార్జ్ అవుతుంది. ఎక్కువసేపు ఛార్జింగ్‌లో ఉండడం వల్ల ఫోన్‌లో వేడి పెరుగుతుంది. ఈ వేడి బ్యాటరీ (battery health tips) ఆరోగ్యానికి చాలా హానికరం.
చాలా మంది కారు స్టార్ట్ చేస్తున్నప్పుడు లేదా ఆపే సమయంలో కూడా ఫోన్‌ను ఛార్జింగ్‌లోనే ఉంచుతారు. ఇది మరింత ప్రమాదకరం. ఇంజిన్ స్టార్ట్ అయిన క్షణంలో ఒక్కసారిగా అధిక పవర్ విడుదల అవుతుంది. అదే సమయంలో ఫోన్ కనెక్ట్ అయి ఉంటే ఆ పవర్ నేరుగా బ్యాటరీకి చేరుతుంది. దీని వల్ల బ్యాటరీ సామర్థ్యం క్రమంగా తగ్గుతుంది. కొత్త స్మార్ట్‌ఫోన్‌లలో ఉండే సున్నితమైన బ్యాటరీ టెక్నాలజీకి ఇది ఎక్కువ నష్టం కలిగించే అవకాశం ఉంటుంది.
వేసవికాలంలో కారులో ఉష్ణోగ్రత ఇప్పటికే ఎక్కువగా ఉంటుంది. అలాంటి సమయంలో ఫోన్ ఛార్జింగ్ చేస్తే వేడెక్కే ప్రమాదం ఇంకా పెరుగుతుంది. సూర్యరశ్మికి నేరుగా గురైతే బ్యాటరీ త్వరగా పాడయ్యే అవకాశం ఉంది. అందుకే నిపుణులు కొన్ని జాగ్రత్తలు సూచిస్తున్నారు. తప్పనిసరిగా ఛార్జ్ చేయాల్సి వస్తే మంచి నాణ్యత కలిగిన సర్టిఫైడ్ కార్ ఛార్జర్‌ను ఉపయోగించాలి. ఇంజిన్ స్టార్ట్ లేదా స్టాప్ చేసే సమయంలో ఫోన్‌ను ఛార్జింగ్ నుంచి తీసేయడం మంచిది. అలాగే అవసరం లేకుండా 100 శాతం వరకు ఛార్జ్ చేయకపోవడం, ఫోన్‌ను నేరుగా ఎండలో పెట్టకుండా చూడడం ద్వారా బ్యాటరీ (smartphone battery) జీవితాన్ని కొంతవరకు కాపాడుకోవచ్చు. మొత్తం మీద కారులో మొబైల్ ఛార్జింగ్ సౌకర్యంగా అనిపించినా, దీర్ఘకాలంలో అది మీ ఫోన్‌కు నష్టం చేసే అవకాశం ఉందన్న విషయాన్ని గుర్తుంచుకోవాల్సిందే.