Chandrababu: పోలవరం పూర్తి లక్ష్యంగా ఢిల్లీలో సీఎం చంద్రబాబు! జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్‌ భేటీ! Chandrababu: అమిత్ షాతో భేటీ అయిన చంద్రబాబు.. విభజన హామీలపై అమిత్ షాతో కీలక చర్చ! Nara Lokesh: అమరావతిని ప్రపంచస్థాయి మైస్ హబ్‌గా తీర్చిదిద్దుతాం.. కొత్త పాలసీపై మంత్రి లోకేష్ ప్రకటన! Amaravati: భారతదేశంలోనే అత్యంత అద్భుత రాజధాని కాబోతున్న అమరావతి! హిందీ చానల్ల లో వైరల్ అవుతున్న వీడియోలు! అన్ని ప్రాజెక్టుల పూర్తి వివరాలతో! PM Modi: ఏడాది పాటు బంగారం కొనవద్దు.. దేశ ఆర్థిక వ్యవస్థ కోసం ప్రధాని మోదీ సంచలన విజ్ఞప్తి! CM Vijay: నిన్న సీఎంగా దేవుడి పేరిట.. నేడు ఎమ్మెల్యేగా మనస్సాక్షిగా.. విజయ్ వెరైటీ ప్రమాణం! Chandrababu: ఢిల్లీలో సీఎం చంద్రబాబు బిజీ షెడ్యూల్.. కేంద్ర మంత్రులతో కీలక భేటీలు! Semi Ring Road: ఏపీలో ఆ జిల్లాకు మహర్దశ... 102 కి.మీ. మేర సెమీ రింగురోడ్డు, మారనున్న రూపురేఖలు! Star Hotels: అమరావతిలో స్టార్ హోటళ్ల జాతర... రూ. 200 కోట్లతో అంతర్జాతీయ స్థాయి వసతులు!! Amaravati: రూ. 1.85 కోట్లతో రీడెవలప్‌మెంట్... పర్యాటకులను అలరిస్తున్న అమరావతి ధ్యానబుద్ధ విగ్రహం!! Chandrababu: పోలవరం పూర్తి లక్ష్యంగా ఢిల్లీలో సీఎం చంద్రబాబు! జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్‌ భేటీ! Chandrababu: అమిత్ షాతో భేటీ అయిన చంద్రబాబు.. విభజన హామీలపై అమిత్ షాతో కీలక చర్చ! Nara Lokesh: అమరావతిని ప్రపంచస్థాయి మైస్ హబ్‌గా తీర్చిదిద్దుతాం.. కొత్త పాలసీపై మంత్రి లోకేష్ ప్రకటన! Amaravati: భారతదేశంలోనే అత్యంత అద్భుత రాజధాని కాబోతున్న అమరావతి! హిందీ చానల్ల లో వైరల్ అవుతున్న వీడియోలు! అన్ని ప్రాజెక్టుల పూర్తి వివరాలతో! PM Modi: ఏడాది పాటు బంగారం కొనవద్దు.. దేశ ఆర్థిక వ్యవస్థ కోసం ప్రధాని మోదీ సంచలన విజ్ఞప్తి! CM Vijay: నిన్న సీఎంగా దేవుడి పేరిట.. నేడు ఎమ్మెల్యేగా మనస్సాక్షిగా.. విజయ్ వెరైటీ ప్రమాణం! Chandrababu: ఢిల్లీలో సీఎం చంద్రబాబు బిజీ షెడ్యూల్.. కేంద్ర మంత్రులతో కీలక భేటీలు! Semi Ring Road: ఏపీలో ఆ జిల్లాకు మహర్దశ... 102 కి.మీ. మేర సెమీ రింగురోడ్డు, మారనున్న రూపురేఖలు! Star Hotels: అమరావతిలో స్టార్ హోటళ్ల జాతర... రూ. 200 కోట్లతో అంతర్జాతీయ స్థాయి వసతులు!! Amaravati: రూ. 1.85 కోట్లతో రీడెవలప్‌మెంట్... పర్యాటకులను అలరిస్తున్న అమరావతి ధ్యానబుద్ధ విగ్రహం!!

Chandrababu: పోలవరం పూర్తి లక్ష్యంగా ఢిల్లీలో సీఎం చంద్రబాబు! జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్‌ భేటీ!

Chhandrababu: ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ తో కీలక సమావేశం నిర్వహించారు.

Published : 2026-05-11 14:58:00

2027 నాటికి పోలవరం పూర్తి చేయాలని కేంద్రాన్ని కోరిన సీఎం చంద్రబాబు..

జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్‌తో సీఎం చంద్రబాబు కీలక భేటీ..

ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ తో కీలక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన పలు జల ప్రాజెక్టులు, ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టు వేగవంతం, నిధుల మంజూరు, సాగునీటి అవసరాలపై సీఎం విస్తృతంగా చర్చించారు.

2027 గోదావరి పుష్కరాల నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందించాలని సీఎం చంద్రబాబు కోరారు. తొలిదశలో 41.15 మీటర్ల మేర నీటిని నిల్వ చేసే నిర్మాణాలను త్వరగా పూర్తి చేయాల్సిన అవసరం ఉందని వివరించారు. ఇప్పటికే తాను ఐదు సార్లు పోలవరం ప్రాజెక్టును సందర్శించి పనుల పురోగతిని సమీక్షించినట్టు చెప్పారు.

కొత్త డయాఫ్రామ్ వాల్ నిర్మాణం 2026 ఏప్రిల్ 2 నాటికి పూర్తయిందని, గ్యాప్-1, గ్యాప్-2 ప్రాంతాల్లో ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ పనులు వేగంగా కొనసాగుతున్నాయని సీఎం వెల్లడించారు. ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో ప్రజాభిప్రాయ సేకరణ పెండింగ్‌లో ఉందన్న కారణంతో 2011లో జారీ చేసిన స్టాప్ వర్క్ ఆర్డర్‌ను శాశ్వతంగా ఉపసంహరించుకోవాలని కేంద్ర మంత్రిని కోరారు. అలా చేస్తే పోలవరం పనులు ఎలాంటి ఆటంకాలు లేకుండా వేగంగా ముందుకు సాగుతాయని తెలిపారు.

సాగునీటి అవసరాల దృష్ట్యా పోలవరం కుడి, ఎడమ కాలువల సామర్థ్యాన్ని మొదట నిర్ణయించిన దానికంటే 17,500 క్యూసెక్కులకు పెంచినట్టు సీఎం వివరించారు. ప్రస్తుతం కుడి కాలువ పనులు 95 శాతం, ఎడమ కాలువ పనులు 78 శాతం పూర్తయ్యాయని తెలిపారు. సామర్థ్యం పెంపుతో వచ్చిన అదనపు ఖర్చులను కేంద్రం రీఎంబర్స్ చేయాలని విజ్ఞప్తి చేశారు.

ప్రాజెక్టు తదుపరి పనులకు అవసరమైన నిధులను కూడా విడుదల చేయాలని కోరిన సీఎం, ప్రధానమంత్రి కృషి సీంచాయి యోజన కింద రాష్ట్రంలోని పలు సాగునీటి పథకాల పునరుద్ధరణ, ఆధునీకరణకు నిధులు మంజూరు చేయాలని లేఖ అందజేశారు. “హర్ ఖేత్ కో పానీ” కార్యక్రమం కింద చెరువులు, కుంటలు, కాలువల పునరుద్ధరణ, పూడికతీత, గట్ల బలోపేతం వంటి పనులు చేపట్టాల్సి ఉందని వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా 297 నీటి వనరుల పునరుద్ధరణకు రూ.285 కోట్ల నిధులు విడుదల చేయాలని కోరారు.

అలాగే ఆలమట్టి ఆనకట్ట ఎత్తు పెంపు అంశంపై కూడా సీఎం తన ఆందోళన వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు తుది తీర్పు వచ్చేంతవరకు గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయవద్దని కేంద్రాన్ని కోరారు. ఆనకట్ట ఎత్తును 519.60 మీటర్ల నుంచి 524.256 మీటర్లకు పెంచితే ఏపీ ప్రయోజనాలు దెబ్బతింటాయని చెప్పారు. అప్పర్ కృష్ణా ప్రాజెక్ట్ ఫేజ్-3 కింద భూసేకరణ, ఇతర పనులు చేపట్టకుండా కర్ణాటకను ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు.

రాయలసీమ, దక్షిణ కోస్తాంధ్ర ప్రాంతాలకు నీటి అవసరాలను తీర్చేందుకు పోలవరం-బనకచర్ల లింక్ ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వాలని సీఎం కోరారు. గోదావరి నుంచి సముద్రంలోకి వృథాగా వెళ్లే 200 టీఎంసీల వరద జలాలను మళ్లించే లక్ష్యంతో ఈ ప్రాజెక్టు చేపడుతున్నట్టు తెలిపారు.

వంశధార ప్రాజెక్టుపై కూడా సీఎం ప్రస్తావించారు. నేరడి బ్యారేజ్ నిర్మాణానికి ఇప్పటికే జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం ముందుకు సాగుతామని చెప్పారు. ఏపీ అవసరాలకు అనుగుణంగా 8 వేల క్యూసెక్కుల సామర్థ్యంతో కుడివైపున హెడ్ స్లూయిస్ నిర్మించనున్నట్టు వెల్లడించారు. ఇందుకు అవసరమైన భూసేకరణ కోసం ఒడిశాను ఆదేశించాలని కేంద్ర జలశక్తి శాఖను కోరారు.

రాష్ట్రానికి కీలకమైన జల ప్రాజెక్టులపై కేంద్రంతో సమన్వయం పెంచుతూ, సాగునీటి రంగాన్ని బలోపేతం చేయడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టినట్టు ఈ సమావేశం ద్వారా స్పష్టమైంది.

Spotlight

Read More →