Chandrababu: ఆదాయ శాఖలపై సీఎం చంద్రబాబు సమీక్ష.. 2026-27కి రూ. 1.27 లక్షల కోట్ల టార్గెట్! Chandrababu: పుట్టపర్తిలో భారీ ప్రాజెక్టుకు శ్రీకారం.. రేపు AMCA ఫెసిలిటీకి రాజ్‌నాథ్ సింగ్, చంద్రబాబు శంకుస్థాపన! Election Commission: మూడో దశ S.I.Rకు ఈసీ గ్రీన్ సిగ్నల్.. ఏపీ, తెలంగాణలో ఓటరు జాబితా ప్రక్రియ షెడ్యూల్ విడుదల! Chandrababu: ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. వారికి త్వరలో 'వర్క్ ఫ్రమ్ హోమ్' అమలుపై సర్కార్ కసరత్తు! Chandrababu: యుద్ధ విమానాల తయారీతో మారనున్న సత్యసాయి జిల్లా రూపురేఖలు! చంద్రబాబు, రాజ్‌నాథ్ సింగ్ చేతుల మీదుగా.. Digital India: ఏపీ పల్లెల్లో ఇంటర్నెట్ సందడి... కేంద్రం నుంచి రూ.2,432 కోట్ల నిధులు విడుదల! Amit Shah: ప్రజల గుండెల్లో చెరగని విశ్వాసం.. 20 ఏళ్ల ప్రస్థానంలో ఎన్డీఆర్ఎఫ్ అరుదైన మైలురాయి! Chandrababu: కాన్వాయ్ ఖర్చులకు చెక్.. సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం! AP Cabinet: నిమ్మల నుంచి అనిత వరకు.. అందరూ ఒక్కే కారులో! ఏపీ రాజకీయాల్లో కొత్త సంప్రదాయం! Modi: ఇంధన పొదుపుపై కేంద్రం దృష్టి.. ప్రధాని మోదీ సూచనలతో మారుతున్న ప్రభుత్వ వ్యవస్థ! Chandrababu: ఆదాయ శాఖలపై సీఎం చంద్రబాబు సమీక్ష.. 2026-27కి రూ. 1.27 లక్షల కోట్ల టార్గెట్! Chandrababu: పుట్టపర్తిలో భారీ ప్రాజెక్టుకు శ్రీకారం.. రేపు AMCA ఫెసిలిటీకి రాజ్‌నాథ్ సింగ్, చంద్రబాబు శంకుస్థాపన! Election Commission: మూడో దశ S.I.Rకు ఈసీ గ్రీన్ సిగ్నల్.. ఏపీ, తెలంగాణలో ఓటరు జాబితా ప్రక్రియ షెడ్యూల్ విడుదల! Chandrababu: ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. వారికి త్వరలో 'వర్క్ ఫ్రమ్ హోమ్' అమలుపై సర్కార్ కసరత్తు! Chandrababu: యుద్ధ విమానాల తయారీతో మారనున్న సత్యసాయి జిల్లా రూపురేఖలు! చంద్రబాబు, రాజ్‌నాథ్ సింగ్ చేతుల మీదుగా.. Digital India: ఏపీ పల్లెల్లో ఇంటర్నెట్ సందడి... కేంద్రం నుంచి రూ.2,432 కోట్ల నిధులు విడుదల! Amit Shah: ప్రజల గుండెల్లో చెరగని విశ్వాసం.. 20 ఏళ్ల ప్రస్థానంలో ఎన్డీఆర్ఎఫ్ అరుదైన మైలురాయి! Chandrababu: కాన్వాయ్ ఖర్చులకు చెక్.. సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం! AP Cabinet: నిమ్మల నుంచి అనిత వరకు.. అందరూ ఒక్కే కారులో! ఏపీ రాజకీయాల్లో కొత్త సంప్రదాయం! Modi: ఇంధన పొదుపుపై కేంద్రం దృష్టి.. ప్రధాని మోదీ సూచనలతో మారుతున్న ప్రభుత్వ వ్యవస్థ!

Chandrababu: ఆదాయ శాఖలపై సీఎం చంద్రబాబు సమీక్ష.. 2026-27కి రూ. 1.27 లక్షల కోట్ల టార్గెట్!

Chandrababu: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చే కీలక శాఖల పనితీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను రూ. 1,27,506 కోట్ల ఆదాయాన్ని లక్ష్యంగా నిర్దేశిస్తూ, ఆ దిశగా పనిచేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.

Published : 2026-05-14 21:46:00
  • ప్రభుత్వ సొమ్ము సద్వినియోగం కావాలని స్పష్టం చేసిన ముఖ్యమంత్రి..
     
  • Politics: 2026-27 ఆర్థిక సంవత్సరానికి రూ. 1.27 లక్షల కోట్ల ఆదాయం లక్ష్యం..

Chandrababu: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిపుష్టిని మెరుగుపరిచే దిశగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక అడుగులు వేస్తున్నారు. అమరావతి సచివాలయంలో ఆదాయం సమకూర్చే ప్రధాన శాఖల పనితీరుపై నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశంలో ఆయన అధికారులకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర అభివృద్ధి మరియు సంక్షేమ పథకాలకు అవసరమైన నిధులను సమకూర్చుకోవడంలో భాగంగా, 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను రూ. 1,27,506 కోట్ల భారీ ఆదాయ లక్ష్యాన్ని ప్రభుత్వం నిర్దేశించింది. ఈ లక్ష్యాన్ని చేరుకోవడానికి గనులు, ఎక్సైజ్, వాణిజ్య పన్నులు, రవాణా, స్టాంపులు-రిజిస్ట్రేషన్ల శాఖలు సమన్వయంతో, అత్యంత పారదర్శకంగా పనిచేయాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ప్రభుత్వ ఖజానాకు వచ్చే ప్రతి రూపాయి ప్రజల ప్రయోజనాల కోసం సద్వినియోగం కావాలని, ఆ దిశగా అధికారులు పూర్తి బాధ్యతతో వ్యవహరించాలని ఆయన ఆదేశించారు.

రాష్ట్ర సొంత ఆదాయం (SOTR) గణనీయంగా పెరుగుతుండటంపై ఈ సమావేశంలో అధికారులు ముఖ్యమంత్రికి నివేదిక సమర్పించారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో రూ. 1,04,345 కోట్లుగా ఉన్న రాష్ట్ర సొంత ఆదాయం, 2025-26 నాటికి రూ. 1,10,643 కోట్లకు చేరుకుందని, తద్వారా 6 శాతం వృద్ధి నమోదైందని వివరించారు. గడచిన 2025-26 ఆర్థిక సంవత్సరంలో కేవలం జీఎస్టీ ద్వారానే రూ. 33,679 కోట్లు వసూలు కాగా, స్టాంపులు మరియు రిజిస్ట్రేషన్ల శాఖ ద్వారా రూ. 11,047 కోట్లు, గనుల శాఖ నుంచి రూ. 10,300 కోట్ల ఆదాయం లభించినట్లు అధికారులు వెల్లడించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్‌తో పాటు ఆర్థిక, రవాణా, అటవీ, పురపాలక శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్న ఈ భేటీలో, ఆదాయ వనరులను మరింత మెరుగుపరిచేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై సుదీర్ఘంగా చర్చించారు. నిర్ణీత గడువులోగా లక్ష్యాలను చేరుకోవడానికి కింది స్థాయి సిబ్బంది నుంచి ఉన్నతాధికారుల వరకు అందరూ అంకితభావంతో పనిచేయాలని ముఖ్యమంత్రి ఉద్ఘాటించారు.

Spotlight

Read More →