Train track : ప్రయాణికుల భద్రతే లక్ష్యం.. ఇంజిన్ ముందు మెటల్ ప్లేట్… ట్రాక్ క్లీన్ చేస్తూ! Goa Beach: గోవా పోలీసుల కఠిన నిర్ణయం... ప్రైవసీ భంగం చేస్తే జైలు తప్పదు! ఆ జిల్లాలో పెద్దపులి కలకలం.. పశువుల మందలపై దాడులు.. భయంలో గ్రామస్థులు! Fake milk: యూరియా డిటర్జెంట్‌తో నకిలీ పాలు.. 300 లీటర్లతో 1,800 లీటర్లు! Lucky draw: జాక్పాట్ అదృష్టం.. ఉడుపి యువకుడికి రూ.49 కోట్ల బిగ్ టికెట్ విజయం! Indian teacher: ఇండియన్ టీచర్‌కు ప్రపంచ స్థాయి గుర్తింపు... రూ.9 కోట్ల గ్లోబల్ టీచర్ ప్రైజ్! 9వ అంతస్తు నుండి దూకి ముగ్గురు సోదరీమణుల ఆత్మహత్య.. తండ్రికి రాసిన లేఖలో కూతుళ్ల ఆవేదన.. ఐదు రోజులుగా కంటిమీద కునుకు లేని గ్రామాలు.. పులిని బంధించేందుకు మెగా ఆపరేషన్.! Attitude Star Chandrahas: ప్రమోషన్ల కోసం దిగజారారు..యాటిట్యూడ్ స్టార్‌ చంద్రహాస్ బూతు పాటపై కేసు నమోదు.! Battery tricycles: దివ్యాంగులకు శుభవార్త... ఫ్రీగా 5G ఫోన్లు, బ్యాటరీ ట్రై సైకిళ్లు! Train track : ప్రయాణికుల భద్రతే లక్ష్యం.. ఇంజిన్ ముందు మెటల్ ప్లేట్… ట్రాక్ క్లీన్ చేస్తూ! Goa Beach: గోవా పోలీసుల కఠిన నిర్ణయం... ప్రైవసీ భంగం చేస్తే జైలు తప్పదు! ఆ జిల్లాలో పెద్దపులి కలకలం.. పశువుల మందలపై దాడులు.. భయంలో గ్రామస్థులు! Fake milk: యూరియా డిటర్జెంట్‌తో నకిలీ పాలు.. 300 లీటర్లతో 1,800 లీటర్లు! Lucky draw: జాక్పాట్ అదృష్టం.. ఉడుపి యువకుడికి రూ.49 కోట్ల బిగ్ టికెట్ విజయం! Indian teacher: ఇండియన్ టీచర్‌కు ప్రపంచ స్థాయి గుర్తింపు... రూ.9 కోట్ల గ్లోబల్ టీచర్ ప్రైజ్! 9వ అంతస్తు నుండి దూకి ముగ్గురు సోదరీమణుల ఆత్మహత్య.. తండ్రికి రాసిన లేఖలో కూతుళ్ల ఆవేదన.. ఐదు రోజులుగా కంటిమీద కునుకు లేని గ్రామాలు.. పులిని బంధించేందుకు మెగా ఆపరేషన్.! Attitude Star Chandrahas: ప్రమోషన్ల కోసం దిగజారారు..యాటిట్యూడ్ స్టార్‌ చంద్రహాస్ బూతు పాటపై కేసు నమోదు.! Battery tricycles: దివ్యాంగులకు శుభవార్త... ఫ్రీగా 5G ఫోన్లు, బ్యాటరీ ట్రై సైకిళ్లు!

lecturer dance post trending: లెక్చరర్ కాదు సూపర్ డాన్సర్.. సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న పోస్ట్!

lecturer dance post trending: కేరళలోని ఓ కాలేజ్ ఫెస్ట్లో ప్రొఫెసర్ అరుణిమా దేవాశిశ్ చేసిన డాన్స్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Published : 2026-02-15 19:48:00

Lecturer dance post trending: చీర కట్టుకుని మాస్ పెర్ఫార్మెన్స్.. కేరళ కాలేజ్ ఫెస్ట్లో హైలైట్

లెక్చరర్ కాదు సూపర్ డాన్సర్.. సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న పోస్ట్

విద్యార్థులతో కలిసి ఇరగదీసిన ప్రొఫెసర్.. ‘ముక్కాబులా’ మాయ

కేరళలో జరిగిన ఓ కాలేజ్ ఫెస్ట్లో లేడీ ప్రొఫెసర్ చేసిన డాన్స్ (lecturer dance post trending) ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. కాలేజ్ స్టేజ్‌పై విద్యార్థులతో కలిసి చేసిన ఆమె స్టెప్పులు ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేస్తున్నాయి. ఆ ప్రొఫెసర్ పేరు అరుణిమా దేవాశిశ్. సాధారణంగా క్లాస్‌రూమ్‌లో లెక్చర్లు చెప్పే టీచర్‌గా కనిపించే ఆమె, స్టేజ్‌పై మాత్రం పూర్తి భిన్నమైన అవతారంలో దర్శనమిచ్చారు. ముఖ్యంగా ఇండియన్ మైఖేల్ జాక్సన్‌గా పేరొందిన ప్రభుదేవా (Prabhu Deva ) నటించిన ‘ముక్కాబులా’ సాంగ్‌కు ఆమె చేసిన డాన్స్ నెటిజన్లను ఫిదా చేస్తోంది.

‘ముక్కాబులా’ పాట మొదలయ్యగానే విద్యార్థులు హర్షధ్వానాలు చేస్తుండగా, అరుణిమా కూడా వారితో సమానంగా ఎనర్జీతో స్టేజ్‌పైకి అడుగుపెట్టారు. చీర కట్టుకుని ఎంతో పద్ధతిగా, గ్రేస్‌తో చేసిన ఆమె మూమెంట్స్ చూసి అక్కడున్నవారంతా ఆశ్చర్యపోయారు. సాధారణంగా చీరలో డాన్స్ చేయడం కాస్త కష్టమే అనిపించినా, ఆమె మాత్రం ఒక్క క్షణం కూడా తడబాటు లేకుండా స్టెప్పులు ఇరగదీశారు. ప్రతి బీట్‌కు సరిపోయేలా ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడం, బాడీ లాంగ్వేజ్ మెయింటైన్ చేయడం, స్టేజ్ ప్రెజెన్స్ చూపించడం ఆమె పెర్ఫార్మెన్స్ నిలిచింది.

విద్యార్థులతో పోటీగా స్టెప్పులు వేస్తూ, వారిని ఎంకరేజ్ చేస్తూ చేసిన ఆమె డాన్స్ చూసి అక్కడున్న విద్యార్థులు మాత్రమే కాదు, సోషల్ మీడియాలో వీడియో చూసిన వారందరూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. “ఇలాంటి ప్రొఫెసర్లు ఉంటే కాలేజ్ లైఫ్ ఎంత బావుంటుందో!”, “టీచర్ మాత్రమే కాదు, సూపర్ డాన్సర్ కూడా” అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కొందరు ఆమె ఎనర్జీని ప్రత్యేకంగా ప్రశంసిస్తుండగా, మరికొందరు ఆమె కాన్ఫిడెన్స్, స్టేజ్ కమాండ్‌ను హైలైట్ చేస్తున్నారు.

ఈ వీడియో వైరల్ అవడంతో విద్యార్థి-ఉపాధ్యాయ సంబంధాలపై కూడా చర్చ మొదలైంది. చదువు మాత్రమే కాదు, కళలు, సాంస్కృతిక కార్యక్రమాల్లోనూ టీచర్లు పాల్గొంటే విద్యార్థులకు మరింత ఇన్‌స్పిరేషన్ కలుగుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రొఫెసర్ అరుణిమా చేసిన ఈ డాన్స్ కేవలం ఒక ఎంటర్టైన్మెంట్ పెర్ఫార్మెన్స్ మాత్రమే కాదు; అది టీచర్లు కూడా తమ ప్రతిభను, ప్యాషన్‌ను వ్యక్తపరచగలరనే సందేశాన్ని ఇస్తోంది.

ఇప్పటికే ఈ వీడియోకు వేలల్లో లైక్స్, షేర్లు వచ్చాయి. కాలేజ్ ఫెస్ట్స్‌లో ఇలాంటి సర్ప్రైజ్ పెర్ఫార్మెన్స్‌లు సాధారణమే అయినా, ప్రొఫెసర్ స్థాయిలో ఇంత ఎనర్జీతో డాన్స్ చేయడం చాలా మందిని ఆకట్టుకుంది. మొత్తంగా, అరుణిమా దేవాశిశ్ చేసిన ‘ముక్కాబులా’ డాన్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ, విద్యార్థులకే కాదు టీచర్లకూ స్ఫూర్తిగా నిలుస్తోంది.

Spotlight

Read More →