Dhurandhar 2: రణ్‌వీర్ సింగ్ మూవీలో సల్మాన్ భాయ్.. ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పిస్తున్న ఫొటో! కానీ అసలు ట్విస్ట్ ఏంటంటే? Car number plate: ఒక కారు నంబర్‌కి ₹2.08 కోట్లు.. దేశంలోనే ఖరీదైన ఫ్యాన్సీ ప్లేట్! SSMB29 Hollywood Interview: అందుకే కన్ఫ్యూజన్ లో పడ్డాను.. పోకిరి హిట్ తర్వాత ఎదురైన అనుభవాలపై మహేష్ బాబు ఓపెన్ కామెంట్స్..!! Dhanush Mrunal Dating : వాలెంటైన్స్ డే నాడు పెళ్లి.. రూమర్లపై మృణాల్ ఠాకూర్ సమాధానం ఇదే! గుడిలో గంజాయి సాగు... పూల మొక్కల మాటున పూజారి! Vasundhara Yadav: మేడారం జాతరలో లేడీ IPS డాన్స్ వైరల్.. వసుంధర యాదవ్ ఎవరు! Trumps comments: ఆమెను చూసే పోస్టింగ్ ఇచ్చా.. ట్రంప్ వ్యాఖ్యలతో కొత్త వివాదం! Plane crash: బారామతి ఫ్లైట్ క్రాష్.. పైలట్ల చివరి మాటలు.. Oh Shit! Medical News: 59 ఏళ్ల వయసులో ఆ పద్ధతిలో తల్లి అయిన మహిళ..!! BB Jodi 2 Promo: బీబీ జోడీ 2లో రచ్చ.. జడ్జీల ముందే కోటు విసిరికొట్టి వాకౌట్ చేసిన రీతూ చౌదరి.. కారణం ఆమె..!! Dhurandhar 2: రణ్‌వీర్ సింగ్ మూవీలో సల్మాన్ భాయ్.. ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పిస్తున్న ఫొటో! కానీ అసలు ట్విస్ట్ ఏంటంటే? Car number plate: ఒక కారు నంబర్‌కి ₹2.08 కోట్లు.. దేశంలోనే ఖరీదైన ఫ్యాన్సీ ప్లేట్! SSMB29 Hollywood Interview: అందుకే కన్ఫ్యూజన్ లో పడ్డాను.. పోకిరి హిట్ తర్వాత ఎదురైన అనుభవాలపై మహేష్ బాబు ఓపెన్ కామెంట్స్..!! Dhanush Mrunal Dating : వాలెంటైన్స్ డే నాడు పెళ్లి.. రూమర్లపై మృణాల్ ఠాకూర్ సమాధానం ఇదే! గుడిలో గంజాయి సాగు... పూల మొక్కల మాటున పూజారి! Vasundhara Yadav: మేడారం జాతరలో లేడీ IPS డాన్స్ వైరల్.. వసుంధర యాదవ్ ఎవరు! Trumps comments: ఆమెను చూసే పోస్టింగ్ ఇచ్చా.. ట్రంప్ వ్యాఖ్యలతో కొత్త వివాదం! Plane crash: బారామతి ఫ్లైట్ క్రాష్.. పైలట్ల చివరి మాటలు.. Oh Shit! Medical News: 59 ఏళ్ల వయసులో ఆ పద్ధతిలో తల్లి అయిన మహిళ..!! BB Jodi 2 Promo: బీబీ జోడీ 2లో రచ్చ.. జడ్జీల ముందే కోటు విసిరికొట్టి వాకౌట్ చేసిన రీతూ చౌదరి.. కారణం ఆమె..!!

SSMB29 Hollywood Interview: అందుకే కన్ఫ్యూజన్ లో పడ్డాను.. పోకిరి హిట్ తర్వాత ఎదురైన అనుభవాలపై మహేష్ బాబు ఓపెన్ కామెంట్స్..!!

సూపర్ స్టార్ మహేష్ బాబు తన కెరీర్‌లో పోకిరి సినిమా ప్రాముఖ్యతను గుర్తుచేసుకున్నారు. రాజమౌళి దర్శకత్వంలో రాబోతున్న భారీ చిత్రం 'వారణాసి' ప్రమోషన్ల కోసం హాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో, తన స్టార్‌డమ్ మరియు కెరీర్ మలుపుల గురించి ఆయన పంచుకున్న

Published : 2026-02-04 15:27:00

టాలీవుడ్ ప్రిన్స్, సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం గ్లోబల్ స్థాయిలో సెన్సేషన్ క్రియేట్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న అంతర్జాతీయ స్థాయి అడ్వెంచర్ మూవీ వారణాసి చిత్రీకరణలో ఆయన బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో హాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఓ ప్రత్యేక ఇంటర్వ్యూలో మహేష్ తన సుదీర్ఘ సినీ ప్రయాణంపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా తన కెరీర్‌ను మలుపు తిప్పిన సినిమా గురించి మాట్లాడుతూ పోకిరి ప్రభావాన్ని గుర్తు చేసుకున్నారు.

స్టార్‌డమ్‌ను శాసించిన పండు గాడు

మహేష్ బాబు మాట్లాడుతూ.. నేను ఇండస్ట్రీలోకి వచ్చి 25 ఏళ్లు అవుతోంది. చైల్డ్ ఆర్టిస్ట్‌గా కూడా అనేక సినిమాలు చేశాను. అయితే, నటుడిగా నన్ను మరో మెట్టు ఎక్కించి నాకు తిరుగులేని స్టార్‌డమ్‌ను తెచ్చిపెట్టిన సినిమా మాత్రం పోకిరి. 2006లో విడుదలైన ఈ చిత్రం నన్ను పూర్తిగా మార్చేసింది. ఆ సినిమా తెచ్చిన గుర్తింపు నా బాధ్యతను పెంచడమే కాకుండా, నెక్స్ట్ ఏం చేయాలనే విషయంలో నన్ను కొంత కన్ఫ్యూజన్‌లో కూడా పడేసింది అని తెలిపారు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘పోకిరి’ అప్పట్లో బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట సాగించి, టాలీవుడ్ ఇమేజ్‌ను మార్చిన విషయం తెలిసిందే.

రాజమౌళితో ప్రపంచ యాత్ర

ప్రస్తుతం రాజమౌళితో చేస్తున్న సినిమా గురించి స్పందిస్తూ, ప్రతి సినిమా తనను వ్యక్తిగతంగా, వృత్తిపరంగా మారుస్తూ వస్తోందని, ఈ కొత్త ప్రాజెక్ట్ తన కెరీర్‌లో అత్యంత కీలకం కాబోతోందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం కావడంతో దీనిపై ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే హాలీవుడ్ స్థాయిలో ప్రమోషన్లు మొదలవ్వడం, అక్కడ కూడా మహేష్ లుక్స్‌కు ప్రశంసలు దక్కడం గమనార్హం.

ఫ్యాన్స్ అంచనాలు.. పెరిగిన బాధ్యత

స్టార్‌డమ్ అనేది కేవలం క్రేజ్ మాత్రమే కాదని అది అభిమానుల అంచనాలను అందుకునే బాధ్యత అని మహేష్ పేర్కొన్నారు. ‘పోకిరి’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత ప్రేక్షకులు తన నుంచి ఏం కోరుకుంటారో అర్థం చేసుకోవడానికి తనకు కొంత సమయం పట్టిందని, అందుకే ఆ తర్వాత చిత్రాల ఎంపికలో ఆచితూచి అడుగులు వేస్తున్నానని ఆయన వివరించారు. ఈ ఇంటర్వ్యూ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో, అభిమానులు తమ ప్రియతమ హీరో మాటలకు ఫిదా అవుతున్నారు.

వారణాసి సినిమా గ్లింప్స్ ఇప్పటికే నెట్టింట ట్రెండ్ అవుతుండగా, రాజమౌళి మార్క్ మేకింగ్ మరియు మహేష్ బాబు కొత్త మేనరిజమ్స్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టిస్తాయని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.

Spotlight

Read More →