Trumps comments: ఆమెను చూసే పోస్టింగ్ ఇచ్చా.. ట్రంప్ వ్యాఖ్యలతో కొత్త వివాదం! Plane crash: బారామతి ఫ్లైట్ క్రాష్.. పైలట్ల చివరి మాటలు.. Oh Shit! Medical News: 59 ఏళ్ల వయసులో ఆ పద్ధతిలో తల్లి అయిన మహిళ..!! BB Jodi 2 Promo: బీబీ జోడీ 2లో రచ్చ.. జడ్జీల ముందే కోటు విసిరికొట్టి వాకౌట్ చేసిన రీతూ చౌదరి.. కారణం ఆమె..!! Kerala bus case: వైరల్ కావాలనే ప్రయత్నం విషాదానికి దారి తీసింది.. ఒక్క పోస్ట్.. ఒక జీవితం నాశనం! Airplane accident : పైలట్ కంట్రోల్ కోల్పోవడంతో దుర్ఘటన.. DGCA విచారణ ప్రారంభం! Winter Storm: అమెరికాలో మంచు తుఫాన్ బీభత్సం.. 21 కోట్ల మంది ప్రభావితం! Megastars gift: మన శంకరవరప్రసాద్ గారు విజయం.. డైరెక్టర్‌కు మెగాస్టార్ కానుక! 16 ఏళ్ల బంధం.. బట్టతల వచ్చిందని భార్యకు విడాకులు - బిడ్డ కస్టడీని కూడా.. Stickers: వాహనాలపై పోలీస్, ప్రెస్ స్టిక్కర్లపై ప్రభుత్వం కఠిన చర్యలు! Trumps comments: ఆమెను చూసే పోస్టింగ్ ఇచ్చా.. ట్రంప్ వ్యాఖ్యలతో కొత్త వివాదం! Plane crash: బారామతి ఫ్లైట్ క్రాష్.. పైలట్ల చివరి మాటలు.. Oh Shit! Medical News: 59 ఏళ్ల వయసులో ఆ పద్ధతిలో తల్లి అయిన మహిళ..!! BB Jodi 2 Promo: బీబీ జోడీ 2లో రచ్చ.. జడ్జీల ముందే కోటు విసిరికొట్టి వాకౌట్ చేసిన రీతూ చౌదరి.. కారణం ఆమె..!! Kerala bus case: వైరల్ కావాలనే ప్రయత్నం విషాదానికి దారి తీసింది.. ఒక్క పోస్ట్.. ఒక జీవితం నాశనం! Airplane accident : పైలట్ కంట్రోల్ కోల్పోవడంతో దుర్ఘటన.. DGCA విచారణ ప్రారంభం! Winter Storm: అమెరికాలో మంచు తుఫాన్ బీభత్సం.. 21 కోట్ల మంది ప్రభావితం! Megastars gift: మన శంకరవరప్రసాద్ గారు విజయం.. డైరెక్టర్‌కు మెగాస్టార్ కానుక! 16 ఏళ్ల బంధం.. బట్టతల వచ్చిందని భార్యకు విడాకులు - బిడ్డ కస్టడీని కూడా.. Stickers: వాహనాలపై పోలీస్, ప్రెస్ స్టిక్కర్లపై ప్రభుత్వం కఠిన చర్యలు!

BB Jodi 2 Promo: బీబీ జోడీ 2లో రచ్చ.. జడ్జీల ముందే కోటు విసిరికొట్టి వాకౌట్ చేసిన రీతూ చౌదరి.. కారణం ఆమె..!!

బీబీ జోడీ సీజన్ 2 లేటెస్ట్ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తోటి కంటెస్టెంట్లు తక్కువ మార్కులు ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ రీతూ చౌదరి స్టేజ్ నుండి వెళ్ళిపోయింది

Published : 2026-01-28 15:02:00

బుల్లితెరపై అత్యంత ఆదరణ పొందుతున్న డ్యాన్స్ రియాలిటీ షో 'బీబీ జోడీ' సీజన్-2 మరోసారి వార్తల్లో నిలిచింది. పోటీదారులు కేవలం డ్యాన్స్‌తోనే కాకుండా, మాటల యుద్ధాలతోనూ స్టేజ్‌ను హీటెక్కిస్తున్నారు. తాజాగా విడుదలైన ఎపిసోడ్ ప్రోమో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వారం పెర్ఫార్మెన్స్ అనంతరం జరిగిన పరిణామాలు గొడవకు దారితీయడంతో, కంటెస్టెంట్ రీతూ చౌదరి తీవ్ర అసహనానికి లోనై షో నుండి వాకౌట్ చేయడం సంచలనం సృష్టిస్తోంది.

ఈ వారం ఎపిసోడ్ 'జడ్జెస్ ఛాయిస్' థీమ్‌తో సాగింది. యాంకర్ ప్రదీప్ ఈ రౌండ్‌ను అనౌన్స్ చేయగా, జడ్జీలు శేఖర్ మాస్టర్, సదా, శ్రీదేవి తమ సవాళ్లను కంటెస్టెంట్లకు విసిరారు. పెర్ఫార్మెన్స్‌కు ముందే రీతూ చౌదరి మరియు డీమాన్ పవన్ తమ జోడీ పేరును 'పాతూ' నుండి 'రివాన్' (రీతూ + పవన్) గా మార్చాలని కోరారు. అయితే, దీనికి 100 కి 100 మార్కులు సాధిస్తేనే పేరు మారుస్తామని జడ్జీలు కండిషన్ పెట్టారు.

'ఛత్రపతి' సినిమాలోని మాస్ హిట్ సాంగ్ "ఏ వచ్చి బీపై వాలే" పాటకు రీతూ-పవన్ జోడీ ఊరమాస్ స్టెప్పులతో ఆకట్టుకుంది. ప్రాపర్టీ రౌండ్‌లో భాగంగా 'మాప్' స్టిక్స్‌ను వాడుతూ స్టేజ్ మొత్తం క్లీన్ చేస్తూ వారు చేసిన డ్యాన్స్‌కు జడ్జీల నుండి ప్రశంసలు దక్కాయి. ప్రాపర్టీని ఉపయోగించిన తీరు అద్భుతమని సదా కొనియాడగా, వారి మధ్య ఉన్న క్యూట్ కెమిస్ట్రీ బాగుందని శ్రీదేవి మెచ్చుకున్నారు.

అసలు గొడవ మార్కుల దగ్గరే మొదలైంది. తోటి కంటెస్టెంట్లు అయిన నయని-సాయి, సత్య-అర్జున్ జోడీలు వీరికి కేవలం 3 మార్కులు మాత్రమే ఇవ్వడం రీతూకు మింగుడుపడలేదు. మరోవైపు అమర్‌దీప్ స్పందిస్తూ.. మ్యాజిక్ ట్రిక్స్ పక్కన పెట్టి అసలైన డ్యాన్స్‌పై దృష్టి పెట్టాలని ఘాటు వ్యాఖ్యలు చేశారు. కొత్తగా ఎంట్రీ ఇచ్చిన దమ్ము శ్రీజ సైతం కోఆర్డినేషన్ లోపించిందని విమర్శించడంతో గొడవ ముదిరింది.

తోటి కంటెస్టెంట్లు కావాలనే తక్కువ మార్కులు వేసి తనను టార్గెట్ చేస్తున్నారని రీతూ చౌదరి ఆరోపించింది. శ్రీసత్య మరియు అమర్‌దీప్‌లతో జరిగిన వాగ్వాదం తీవ్రస్థాయికి చేరడంతో.. మేము ఎన్నిసార్లు ఫేస్-ఆఫ్ చేసి వచ్చినా మీరు ఇంతే మార్కులు ఇస్తారు అంటూ తన చేతిలోని కోటును స్టేజ్‌పై విసిరికొట్టి రీతూ వెళ్ళిపోయింది.మరోవైపు, కీర్తి భట్ స్థానంలో ఆర్జే చైతూకి జోడీగా దమ్ము శ్రీజ ఎంట్రీ ఇవ్వడం ఈ షోలో మరో పెద్ద మలుపు. గతంలోనూ రీతూ, శ్రీజల మధ్య విభేదాలు ఉన్న నేపథ్యంలో, రాబోయే ఎపిసోడ్లలో వీరి మధ్య పోరు మరింత రసవత్తరంగా మారే అవకాశం కనిపించనుంది.

Spotlight

Read More →