Iconic Bridge: తిరుపతి వెళ్లేవారికి గుడ్ న్యూస్.. ₹1000 కోట్లతో ఐకానిక్ బ్రిడ్జ్! ఇక రెండు గంటల ప్రయాణం... Rope way: ఏపీలో డబుల్ ఇంజన్ సర్కార్ సరికొత్త టూరిజం ప్లాన్! రూ.750 కోట్లతో రోప్ వే... Law University: రాజధాని అభివృద్ధిలో మరో మైలురాయి... అంతర్జాతీయ లా వర్సిటీకి గ్రీన్ సిగ్నల్! SSC: టెన్త్ విద్యార్థులకు గుడ్ న్యూస్! హాల్ టికెట్ చూపిస్తే చాలు.. పరీక్షా కేంద్రానికి ఫ్రీగా వెళ్లొచ్చు! AP Development: డిజిటల్ హెల్త్ రికార్డులతో 'సంజీవని'! ప్రజారోగ్యం కోసం ఏపీ సరికొత్త ప్రణాళిక! AP Assembly: తప్పులు ఉంటే చెప్పండి.. సరిదిద్దుకుంటాం! విపక్షాలకు మంత్రి పయ్యావుల పిలుపు! Nara Lokesh: నైపుణ్యాభివృద్ధికి పెద్దపీట.. లోకేష్ ప్రకటించిన నూతన విద్యా విధానం! Chandrababu Naidu: ఆడబిడ్డల జోలికి వస్తే ఆ రోజే ఆఖరి రోజు..! నేరగాళ్లకు సీఎం చంద్రబాబు వార్నింగ్! Botsa Satyanarayana: మండలిలో బొత్స సత్యనారాయణకు అస్వస్థత... హుటాహుటిన హైదరాబాద్‌కు తరలింపు! Talliki Vandanam: తల్లికి వందనంపై లేటెస్ట్ అప్‌డేట్! వారికి కూడా తల్లికి వందనం.. ప్రభుత్వం కీలక ప్రకటన! Iconic Bridge: తిరుపతి వెళ్లేవారికి గుడ్ న్యూస్.. ₹1000 కోట్లతో ఐకానిక్ బ్రిడ్జ్! ఇక రెండు గంటల ప్రయాణం... Rope way: ఏపీలో డబుల్ ఇంజన్ సర్కార్ సరికొత్త టూరిజం ప్లాన్! రూ.750 కోట్లతో రోప్ వే... Law University: రాజధాని అభివృద్ధిలో మరో మైలురాయి... అంతర్జాతీయ లా వర్సిటీకి గ్రీన్ సిగ్నల్! SSC: టెన్త్ విద్యార్థులకు గుడ్ న్యూస్! హాల్ టికెట్ చూపిస్తే చాలు.. పరీక్షా కేంద్రానికి ఫ్రీగా వెళ్లొచ్చు! AP Development: డిజిటల్ హెల్త్ రికార్డులతో 'సంజీవని'! ప్రజారోగ్యం కోసం ఏపీ సరికొత్త ప్రణాళిక! AP Assembly: తప్పులు ఉంటే చెప్పండి.. సరిదిద్దుకుంటాం! విపక్షాలకు మంత్రి పయ్యావుల పిలుపు! Nara Lokesh: నైపుణ్యాభివృద్ధికి పెద్దపీట.. లోకేష్ ప్రకటించిన నూతన విద్యా విధానం! Chandrababu Naidu: ఆడబిడ్డల జోలికి వస్తే ఆ రోజే ఆఖరి రోజు..! నేరగాళ్లకు సీఎం చంద్రబాబు వార్నింగ్! Botsa Satyanarayana: మండలిలో బొత్స సత్యనారాయణకు అస్వస్థత... హుటాహుటిన హైదరాబాద్‌కు తరలింపు! Talliki Vandanam: తల్లికి వందనంపై లేటెస్ట్ అప్‌డేట్! వారికి కూడా తల్లికి వందనం.. ప్రభుత్వం కీలక ప్రకటన!

Bill Gates: ఏపీకి బిల్ గేట్స్ రాక..! అమరావతిలో గ్లోబల్ మీటింగ్..!

Bill Gates: ఆంధ్రప్రదేశ్ పర్యటనకు రానుండగా, అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో కీలక భేటీ జరగనుంది. విద్య, వైద్యం, వ్యవసాయం, డిజిటల్ హెల్త్ రంగాల్లో భాగస్వామ్యంపై చర్చలు జరిగే అవకాశం ఉంది. స్వర్ణాంధ్ర విజన్-2047 లక్ష్యాల దిశగా ఈ గ్లోబల్ మీటింగ్ కీలకంగా మారనుంది.

Published : 2026-02-15 17:58:00

సంజీవని ప్రాజెక్టుపై గేట్స్ ఫోకస్…

స్వర్ణాంధ్ర విజన్‌కు గ్లోబల్ సపోర్ట్…

ఆర్‌టీజీఎస్ నుంచి ఏఐ వ్యవసాయం దాకా…

ప్రపంచ ప్రఖ్యాత పారిశ్రామికవేత్త  బిల్ గేట్స్ సోమవారం ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించనున్నారు. సాంకేతిక రంగంతో పాటు ప్రజారోగ్యం, విద్య, వ్యవసాయం వంటి కీలక రంగాల్లో సేవలను విస్తరించిన ఆయన, రాష్ట్ర ప్రభుత్వంతో వ్యూహాత్మక భాగస్వామ్యాలపై చర్చించేందుకు తన బృందంతో కలిసి వస్తున్నారు. ఈ పర్యటనను రాష్ట్ర అభివృద్ధి దిశలో ఒక కీలక ఘట్టంగా ప్రభుత్వం భావిస్తోంది. ముఖ్యంగా డిజిటల్ పాలన, ఆరోగ్య సంరక్షణ, గ్రామీణాభివృద్ధి రంగాల్లో అంతర్జాతీయ స్థాయి సహకారం పొందే అవకాశంగా ఈ భేటీని చూస్తున్నారు. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ఆయన సమక్షంలో వివరించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

ఉదయం ఆయన సచివాలయానికి చేరుకుని రియల్ టైమ్ పాలనా సమితి కేంద్రాన్ని సందర్శించనున్నారు. ప్రభుత్వ వ్యవహారాల్లో సాంకేతిక వినియోగం, సమాచార ఆధారిత నిర్ణయాలు, పౌర సేవల డిజిటలీకరణ వంటి అంశాలను అధికారులు వివరిస్తారు. అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు , ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌లతో సమావేశమై కీలక అంశాలపై చర్చించనున్నారు. విద్య, వైద్యం, వ్యవసాయం, పోషణ, గ్రామీణాభివృద్ధి రంగాల్లో ఇప్పటికే కొనసాగుతున్న పథకాల విస్తరణపై ప్రధానంగా దృష్టి సారించనున్నారు.

‘స్వర్ణాంధ్ర లక్ష్య దిశ–2047’ సాధనలో భాగంగా చేపడుతున్న సంస్కరణలను ముఖ్యమంత్రి ఆయనకు సమగ్రంగా వివరించనున్నారు. ప్రజారోగ్యం, వైద్య సాంకేతికత, డిజిటల్ ఆరోగ్య విధానం, వ్యవసాయ సంస్కరణలు, ఆవిష్కరణలపై ప్రభుత్వం రూపొందించిన కార్యాచరణ ప్రణాళికను చూపించనున్నారు. ముఖ్యంగా ‘సంజీవని’ ప్రాజెక్టు ద్వారా ప్రతి పౌరుడికి డిజిటల్ ఆరోగ్య దస్త్రాలు రూపొందించి, ప్రభుత్వ-ప్రైవేట్ ఆసుపత్రుల మధ్య సమన్వయం పెంచి వేగవంతమైన వైద్య సేవలు అందించే విధానాన్ని వివరించనున్నారు. గ్రామీణ ప్రాంతాలకు సైతం ఆధునిక వైద్య సేవలు చేరవేసే లక్ష్యంపై ప్రత్యేకంగా చర్చించనున్నారు.

సమావేశాల అనంతరం అమరావతి సమీపంలోని ఉండవల్లి వద్ద ఉన్న ఆధునిక వ్యవసాయ క్షేత్రాన్ని ఆయన బృందం సందర్శించనుంది. అక్కడ డ్రోన్లు, కృత్రిమ మేధస్సు ఆధారిత పద్ధతులు, మట్టినిర్ధారణ విధానాలు, నీటి వినియోగ సమర్థత వంటి అంశాలను పరిశీలించనున్నారు. తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు సాధించే విధానాలను ప్రత్యక్షంగా చూపించనున్నారు. ఈ పర్యటనతో రాష్ట్రానికి అంతర్జాతీయ స్థాయిలో పెట్టుబడులు, సాంకేతిక సహకారం, పరిశోధన భాగస్వామ్యాలు పెరుగుతాయని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద ఈ పర్యటన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి దిశలో ఒక ముఖ్యమైన మలుపు కావొచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Spotlight

Read More →