మన భాష - మన బలం.... ఖండాతరాల చాటున తెలుగు కీర్తి!

ఎక్కడో సుదూర ప్రాంతాల్లో, వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నా, మన గుండె ఎప్పుడూ మన గడ్డ కోసమే కొట్టుకుంటుంది. ఈ వీడియో చూస్తుంటే అదే అనిపిస్తోంది. నారా చంద్రబాబు నాయుడు

2026-01-20 06:56:00
దావోస్ వేదికగా ఏపీ 'ఫ్యూచర్ ప్లాన్'.. ఫుడ్ ప్రాసెసింగ్, గ్రీన్ హైడ్రోజన్ రంగాల్లో లోకేశ్ మార్క్ డీల్స్!

ఎక్కడో సుదూర ప్రాంతాల్లో, వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నా, మన గుండె ఎప్పుడూ మన గడ్డ కోసమే కొట్టుకుంటుంది. ఈ వీడియో చూస్తుంటే అదే అనిపిస్తోంది. నారా చంద్రబాబు నాయుడు గారు యూరప్ పర్యటనలో ఉన్నప్పుడు, అక్కడ నివసిస్తున్న తెలుగు వారి ఆత్మీయ పలకరింపులు చూస్తుంటే కళ్లు చెమర్చక మానవు.

ఆ కేసులో సంచలనం.. పిన్నెల్లి బ్రదర్స్‌కు 3 రోజుల పోలీస్ కస్టడీ!

"నేను ఒకప్పుడు ఐర్లాండ్ వచ్చినప్పుడు ఒక్కరు కూడా కనిపించలేదు, కానీ ఈరోజు అదే ఐర్లాండ్ వీధుల్లో తెలుగులో గట్టిగా మాట్లాడితే వందల మంది పలకరిస్తున్నారు" అని చంద్రబాబు గారు అన్నప్పుడు, అది కేవలం ఒక నాయకుడి మాట కాదు, ఒక జాతి ఎదిగిన తీరుకు నిదర్శనం.

జ్యూరిచ్‌లో చంద్రబాబు బిగ్ అనౌన్స్‌మెంట్.. ఎన్నార్టీల కోసం రూ. 50 కోట్ల ఫండ్.. ప్రతి ఇంట్లో..

జర్మనీ, యూకే, స్వీడన్, నెదర్లాండ్స్ ఇలా ఒకటేమిటి.. సుమారు 20 దేశాల నుండి వచ్చిన తెలుగు బిడ్డలు తమ ఆత్మీయతను చాటుకున్నారు.
"NRI TDP GERMANY" అని రాసి ఉన్న ప్లకార్డును గర్వంగా పట్టుకున్న ఆ దృశ్యం చూస్తే, ప్రాంతాలు వేరైనా మనందరినీ కలిపేది మన తెలుగు భాష మరియు మన నాయకుడిపై ఉన్న నమ్మకం అని అర్థమవుతుంది.

Thyroid: అయోడిన్ నుంచి విటమిన్ C వరకు.. థైరాయిడ్‌కు మేలు చేసే ఆహారాలు!

ఆ సభలో ప్రతి చప్పట్లు, ప్రతి కేకలోనూ ఒక భావోద్వేగం ఉంది. చిన్నపిల్లలు సైతం ఆ ఉత్సాహంలో పాలుపంచుకోవడం చూస్తే, మన సంస్కృతిని వచ్చే తరాలకు ఎంత భద్రంగా అందిస్తున్నామో అర్థమవుతుంది. 2 లక్షల మంది సభ్యులతో కూడిన NRT వ్యవస్థ 195 దేశాలకు విస్తరించాలని చంద్రబాబు గారు ఆకాంక్షించడం, తెలుగు వారి సత్తాను ప్రపంచ వ్యాప్తం చేయాలనే ఆయన సంకల్పానికి ప్రతిరూపం.

మస్కట్ తీరాన ఎన్టీఆర్ స్మరణ.. 30వ వర్ధంతి వేళ ఘనంగా నివాళులర్పించిన ఎన్నార్టీలు!

మేము ఎక్కడ ఉన్నా, మా మూలాలు మా తెలుగు గడ్డలోనే ఉన్నాయి. మా మట్టి వాసన మాకు గుర్తుంది అనే భావోద్వేగం అక్కడ. ఆ  వీడియో చూసిన ప్రతి తెలుగు వాడికి కలిగే అనుభూతి ఒక్కటే.. మనం ఎక్కడున్నా, మన భాష మనల్ని ఒక్కటి చేస్తుంది. తెలుగు జాతి గర్వపడేలా ఎదిగిన మన ప్రవాస భారతీయులకు, వారిని ఏకం చేస్తున్న మన నాయకత్వానికి ఇవే మన అభినందనలు!

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు! మాజీ మంత్రి హరీష్ రావుకు నోటీసులు!
Lokesh: అభివృద్ధికి అడ్డుపడుతున్న ‘టీం 11’ రాజకీయాలు! మంత్రి లోకేశ్ ఫైర్..!
తిరుమలలో రథసప్తమి సంబరాలు.. ఒకే రోజు ఏడు వాహనాలపై.. భక్తుల కోసం టీటీడీ భారీ ఏర్పాట్లు!
నూతన జాతీయ అధ్యక్షుడిగా ఆయన ఏకగ్రీవ ఎన్నిక.. కమల దళంలో యువ రక్తానికి పట్టం!
మహిళల్లో ఎక్కువగా కనిపిస్తున్న ఆటోఇమ్యూన్ వ్యాధులు.. ముందుగా కనిపించే లక్షణాలివే..!!

Spotlight

Read More →