Silver Rates: భారత్‌లో రూ. 3.5 లక్షలు.. అక్కడ మాత్రం లక్ష తక్కువ! కిలో వెండి ఎక్కడ చౌకగా దొరుకుతుందో తెలుసా? బంగారం ధరల ఆకాశ ప్రయాణం.. ఒక్కరోజే - చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కొత్త రికార్డు! కిలో వెండి ఏకంగా.. Bank Holidays: బ్యాంకు ఖాతాదారులకు అలర్ట్! వరుసగా 4 రోజులు బ్యాంకులు బంద్! "చైనా, జర్మనీలకు సవాల్.. ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద ఆర్థిక శక్తిగా అవతరించనున్న భారత్.. మధ్యతరగతి దశ తిరగనుంది! మేడారం జాతరకు హెలికాప్టర్ సందడి.. భక్తులకు పర్యాటక శాఖ గిఫ్ట్.! ఆకాశం నుంచి సమ్మక్క-సారలమ్మ దర్శనం! PhonePay: లోన్ కావాలా? ఫోన్‌పే ఓపెన్ చేయండి…! నిమిషాల్లో డబ్బు అకౌంట్‌లో! Parag Agrawal: మస్క్ తొలగింపుకు రెండేళ్ల తర్వాత…! రూ.6,000 కోట్ల విలువతో పరాగ్ అగర్వాల్ బిగ్ ఎంట్రీ! Gold Rates: పసిడి ప్రియులకు ఊరట... భారీగా తగ్గిన ధరలు! Stock markets: ట్రంప్ వెనుకడుగు.. స్టాక్ మార్కెట్లలో లాభాల తుఫాన్! OnePlus Updates: వన్‌ప్లస్ బ్రాండ్ మూతపడనుందా? టెక్ లోకంలో అసలేం జరుగుతోంది! ఆందోళనలో లక్షలాది మంది.. Silver Rates: భారత్‌లో రూ. 3.5 లక్షలు.. అక్కడ మాత్రం లక్ష తక్కువ! కిలో వెండి ఎక్కడ చౌకగా దొరుకుతుందో తెలుసా? బంగారం ధరల ఆకాశ ప్రయాణం.. ఒక్కరోజే - చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కొత్త రికార్డు! కిలో వెండి ఏకంగా.. Bank Holidays: బ్యాంకు ఖాతాదారులకు అలర్ట్! వరుసగా 4 రోజులు బ్యాంకులు బంద్! "చైనా, జర్మనీలకు సవాల్.. ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద ఆర్థిక శక్తిగా అవతరించనున్న భారత్.. మధ్యతరగతి దశ తిరగనుంది! మేడారం జాతరకు హెలికాప్టర్ సందడి.. భక్తులకు పర్యాటక శాఖ గిఫ్ట్.! ఆకాశం నుంచి సమ్మక్క-సారలమ్మ దర్శనం! PhonePay: లోన్ కావాలా? ఫోన్‌పే ఓపెన్ చేయండి…! నిమిషాల్లో డబ్బు అకౌంట్‌లో! Parag Agrawal: మస్క్ తొలగింపుకు రెండేళ్ల తర్వాత…! రూ.6,000 కోట్ల విలువతో పరాగ్ అగర్వాల్ బిగ్ ఎంట్రీ! Gold Rates: పసిడి ప్రియులకు ఊరట... భారీగా తగ్గిన ధరలు! Stock markets: ట్రంప్ వెనుకడుగు.. స్టాక్ మార్కెట్లలో లాభాల తుఫాన్! OnePlus Updates: వన్‌ప్లస్ బ్రాండ్ మూతపడనుందా? టెక్ లోకంలో అసలేం జరుగుతోంది! ఆందోళనలో లక్షలాది మంది..

Banking News: ఎస్‌బీఐ కొత్త రూల్స్ అమలు.. లావాదేవీలపై పెరిగిన ఛార్జీలు..!!

దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన కస్టమర్లపై వరుసగా కొత్త నిబంధనలు అమలు చేస్తోంది. ఇప్పటికే ఏటీఎం లావాదేవీలపై ఛార్జీలు పె

2026-01-20 14:54:00
Nitin Nabin: బీజేపీ అధ్యక్షుడిగా నితిన్ నబిన్! అభినందనలు తెలిపిన నారా లోకేష్, ప్రధాని మోదీ!

దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన కస్టమర్లపై వరుసగా కొత్త నిబంధనలు అమలు చేస్తోంది. ఇప్పటికే ఏటీఎం లావాదేవీలపై ఛార్జీలు పెంచిన ఎస్‌బీఐ, ఇప్పుడు IMPS లావాదేవీల విషయంలోనూ (SBI New Rules) కొత్త రూల్స్ తీసుకొచ్చింది. ఈ మార్పులు ముఖ్యంగా డిజిటల్ లావాదేవీలను ఎక్కువగా ఉపయోగించే ఖాతాదారులపై ప్రభావం చూపనున్నాయి. బ్యాంక్ ప్రకటించిన తాజా నిర్ణయాల ప్రకారం ఫిబ్రవరి 15, 2026 నుంచి ఈ కొత్త IMPS ఛార్జీలు అమల్లోకి రానున్నాయి.

Agriculture News: నేరుగా రైతుల ఖాతాల్లో డబ్బులు జమ.. ఏపీ రైతులకు కూటమి ప్రభుత్వ భారీ శుభవార్త!!

ఎస్‌బీఐ స్పష్టంగా (SBI Transaction Charges) తెలిపిన వివరాల ప్రకారం డిజిటల్ ఛానెల్స్ ద్వారా చేసే IMPS లావాదేవీల్లో రూ.25,000 వరకు ఎలాంటి రుసుములు ఉండవు. అయితే ఒకసారి రూ.25,000 దాటితే మాత్రం ఆ మొత్తానికి అనుగుణంగా ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. అంటే చిన్న మొత్తాల బదిలీలకు ఇప్పటిలాగే ఊరట ఉన్నా, పెద్ద మొత్తాలు పంపే వారికి అదనపు భారం పడనుంది. అయితే బ్రాంచ్ నుంచి బ్రాంచ్‌కు చేసే IMPS బదిలీల విషయంలో మాత్రం ఎలాంటి మార్పులు లేవని ఎస్‌బీఐ స్పష్టం చేసింది. అవి ఇప్పటివరకు ఉన్న ఛార్జీలతోనే కొనసాగుతాయి.

UAE President: ఇరాన్-అమెరికా ఉద్రిక్తతల వేళ ఢిల్లీలో యూఏఈ అధ్యక్షుడు... దేనికి సంకేతం!

ఇదిలా ఉండగా, కొన్ని ప్రత్యేక ఖాతాదారులకు మాత్రం ఈ IMPS ఛార్జీల నుంచి మినహాయింపు ఇచ్చింది. DSP, PMSP, ICSP, CGSP, PSP, RSP వంటి జీత ప్యాకేజీ ఖాతాలు, శౌర్య కుటుంబ పెన్షన్ ఖాతాలు, అలాగే SBI రిష్టే కుటుంబ సేవింగ్స్ ఖాతాదారులకు కొత్త రుసుములు వర్తించవు. ఈ ఖాతాలు ఉన్న వినియోగదారులు యథావిధిగా ఎలాంటి అదనపు చార్జీలు లేకుండా IMPS సేవలను ఉపయోగించుకోవచ్చు.

Sabarimalai: మండల–మకరవిళక్కు యాత్ర ముగింపు..! శబరిమల అయ్యప్ప ఆలయ ద్వారాలు మూసివేత!

IMPS కంటే ముందే ఎస్‌బీఐ (SBI ATM Charges) డిసెంబర్ 1, 2025 నుంచే ఏటీఎం మరియు ADWM లావాదేవీలపై కొత్త ఛార్జీలను అమలు చేసింది. సేవింగ్స్ ఖాతాదారులు ఇతర బ్యాంకుల ఏటీఎంలలో ఉచిత పరిమితిని మించి నగదు ఉపసంహరణ చేస్తే ప్రతి లావాదేవీకి రూ.23తో పాటు జీఎస్టీ చెల్లించాల్సి వస్తోంది. గతంలో సాలరీ అకౌంట్లకు అపరిమిత ఉచిత ఏటీఎం లావాదేవీలు ఉండగా, ఇప్పుడు వాటిని నెలకు 10 ఉచిత లావాదేవీలకే పరిమితం చేశారు. దీంతో సాలరీ ఖాతాదారులు కూడా ఇకపై జాగ్రత్తగా లావాదేవీలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Tension: కొత్త జిల్లా కోసం పోరాటం..! హుజురాబాద్‌లో ఆందోళనలు!

కరెంట్ అకౌంట్ల విషయంలోనూ ప్రతి లావాదేవీపై పెరిగిన ఛార్జీలు వర్తిస్తాయని బ్యాంక్ వెల్లడించింది. అయితే కిసాన్ క్రెడిట్ కార్డు కలిగిన రైతులకు మాత్రం ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది. వీరు ఇతర బ్యాంకుల ఏటీఎంల నుంచి ఎంతసార్లు నగదు తీసుకున్నా ఎలాంటి ఛార్జీలు ఉండవు. అంతేకాదు, కార్డు లేకుండా నగదు ఉపసంహరణ సేవను కూడా ఎస్‌బీఐ, ఇతర బ్యాంకుల ఏటీఎంలలో ఉచితంగానే కొనసాగిస్తోంది.

విశాఖ, కాకినాడ పోర్టులకు 'గ్రీన్' కళ.. హైడ్రోజన్ వాహనాలపై మంత్రి లోకేశ్ భారీ ప్లాన్!

ఎస్‌బీఐ తీసుకుంటున్న తాజా నిర్ణయాలు (Latest SBI Updates) డిజిటల్ లావాదేవీల వినియోగాన్ని నియంత్రించే దిశగా ఉన్నాయని బ్యాంకింగ్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. చిన్న మొత్తాల లావాదేవీలకు ఊరట ఇచ్చినా, పెద్ద మొత్తాల బదిలీలపై ఛార్జీలు పెరగడం వల్ల ఖాతాదారులు తమ లావాదేవీలను మరింత ప్రణాళికతో నిర్వహించాల్సిన అవసరం ఏర్పడింది. (Banking News India) బ్యాంక్ కొత్త రూల్స్ నేపథ్యంలో వినియోగదారులు తమ ఖాతా రకం, ఉచిత పరిమితులు, వర్తించే ఛార్జీలపై అవగాహన పెంచుకోవడం అవసరమని నిపుణులు సూచిస్తున్నారు.

Health News: గర్భిణుల భయాలకు బ్రేక్.. పారాసిటమాల్‌పై లాన్సెట్ అధ్యయనంతో క్లారిటీ..!!
AP Public Transport: సంక్రాంతి రద్దీతో ఏపీఎస్‌ఆర్టీసీకి రికార్డ్ ఆదాయం.. ఒక్కరోజులోనే ఎన్ని కోట్లు అంటే..!
ఓటీటీలో 'దండోరా' మోత.. ఎన్టీఆర్ ఒక్క ట్వీట్‌తో సీన్ మారిపోయింది.. టాప్-2లో ట్రెండింగ్!
హోండా యాక్టివా 7G.. పెరిగిన మైలేజీ, కొత్త టెక్నాలజీ – మధ్యతరగతి కుటుంబాలకు మళ్ళీ పండగే!

Spotlight

Read More →