దుబాయ్‌లో జరుగుతున్న ప్రతిష్టాత్మక ఎయిర్ షోలో తీవ్ర విషాద ఘటన చోటు చేసుకుంది. భారత్ తయారుచేసిన హెచ్ఏఎల్ తేజస్ యుద్ధ విమానం ప్రదర్శన సమయంలో కూలిపోయింది. ఆకాశంలో ఆకర్షణీయ గాల్లో చక్కర్లు కొడుతున్న సమయంలోనే విమానం అకస్మాత్తుగా నియంత్రణ కోల్పోయి నేలపై పడిపోయింది. ఈ ఘటనను ప్రత్యక్షంగా చూసిన ప్రేక్షకులు భయంతో అట్టుడికిపోయారు.
తేజస్ ఫైటర్ జెట్ నేలను ఢీకొట్టిన వెంటనే భారీగా నల్లటి పొగ ఆ ప్రాంతాన్ని కమ్మేసింది. విమానం కూలినప్పుడు పైలట్ బయటకు దూకగలిగారా లేక ప్రమాదంలో పడ్డారా అన్న విషయం వెంటనే స్పష్టంగా తెలియలేదు. పైలట్ పరిస్థితిపై స్పష్టత కోసం అందరూ ఎదురుచూస్తున్నారు.
ప్రమాదం జరిగిన వెంటనే ఎయిర్ షో నిర్వాహకులు, స్థానిక అధికారులు మరియు ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్స్ అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మంటలను ఆర్పేందుకు ప్రత్యేక బృందాలను వినియోగించారు. ప్రజలను ప్రమాద ప్రాంతం నుంచి దూరంగా తరలించారు.
ఈ ప్రమాదానికి గల నిజమైన కారణం ఏంటన్న దానిపై ఇంకా అధికారిక సమాచారం రాలేదు. విమానం టెక్నికల్ సమస్యవల్ల కూలింది లేదా ప్రదర్శన సమయంలో ఏదైనా లోపం ఏర్పడిందా? అన్న విషయంపై అధికారులు విచారణ ప్రారంభించారు. పూర్తి వివరాలు త్వరలో వెల్లడించనున్నట్లు తెలిపింది.
తేజస్ యుద్ధ విమానం భారతదేశం గర్వకారణమైన స్వదేశీ ఫైటర్ జెట్ కావడంతో ఈ ప్రమాదం మరింత చర్చనీయాంశంగా మారింది. అంతర్జాతీయ వేదికపై భారత వాయుసేనకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ విమానం ప్రమాదం ప్రపంచవ్యాప్తంగా దృష్టిని ఆకర్షించింది. ఘటనపై భారత వాయుసేన కూడా నివేదిక కోరినట్లు సమాచారం.