APDSC అభ్యర్ధులకు అలర్ట్.... డీఎస్సీ 2026 షెడ్యూల్ వచ్చేస్తుంది!

2026-01-03 17:17:00
Andhra Pradesh: ఏపీలో పెట్టుబడుల ఊపు.. కొత్త సంవత్సరానికి బలమైన ఆరంభం!

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక అడుగు వేయడానికి సిద్ధమవుతోంది. డీఎస్సీ (District Selection Committee) ద్వారా సుమారు 2,500 ఉపాధ్యాయ పోస్టులకు కొత్త నోటిఫికేషన్ విడుదల చేసే దిశగా విద్యాశాఖ అధికారులు కసరత్తు ప్రారంభించారు. ఈ నోటిఫికేషన్ కోసం అవసరమైన ప్రక్రియలు దాదాపు పూర్తయ్యాయని, త్వరలో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

controversy: ​వ్యూయర్ల చెవిలో పువ్వు... వివాదాలనే ఆదాయంగా మలుచుకుంటున్న అన్వేష్ యూట్యూబ్ ప్రయాణం!

ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా అనేక పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత ఉంది. మరోవైపు పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయులు పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో విద్యా వ్యవస్థపై ప్రభావం పడకుండా ముందస్తు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ఈ పరిస్థితుల్లోనే ప్రభుత్వం డీఎస్సీ నోటిఫికేషన్‌పై దృష్టి పెట్టింది. ఫిబ్రవరి మొదటి వారంలో ఈ నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.

గుంటూరు విజయవాడ నగరాలకు భారీ శుభవార్త చెప్పిన అమరావతి! వారం రోజుల్లోనే 20కి పైగా కొత్త ప్రాజెక్టులకు..

ఇటీవల ప్రభుత్వం విద్యా రంగంలో కీలక మార్పులు చేపట్టింది. జీవో 117ను రద్దు చేసి, కొత్త విద్యా విధానాలను అమల్లోకి తీసుకొచ్చింది. ఇందులో భాగంగా వేల సంఖ్యలో ప్రాథమిక పాఠశాలలను మోడల్ ప్రైమరీ స్కూల్స్‌గా అభివృద్ధి చేయాలనే లక్ష్యాన్ని పెట్టుకుంది. ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయుడు ఉండేలా వ్యవస్థను బలోపేతం చేయాలన్న ఉద్దేశంతోనే కొత్త నియామకాలకు శ్రీకారం చుట్టింది.

LIC Policy: ఆగిపోయిన LIC పాలసీ ఉందా? అయితే ఇది మీకు గోల్డెన్ ఆఫర్!

ప్రస్తుతం కొన్ని పాఠశాలల్లో ఖాళీ పోస్టులను అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్లతో తాత్కాలికంగా భర్తీ చేస్తున్నారు. అయితే ఇది శాశ్వత పరిష్కారం కాదని ప్రభుత్వం భావిస్తోంది. అందుకే ఈ డీఎస్సీ ద్వారా శాశ్వత ఉపాధ్యాయ నియామకాలు చేపట్టి, బోధన నాణ్యతను మెరుగుపరచాలని నిర్ణయించింది. మొత్తం ఖాళీలను పరిగణనలోకి తీసుకుంటే నియామకాల సంఖ్య 2,500కి మించవచ్చని అంచనా వేస్తున్నారు.

IRCTC: సంక్రాంతి సెలవులకు ట్రిప్ వెళ్ళాలి అనుకునే వాళ్ళకి బెస్ట్ ఆప్షన్... IRCTC 5 రోజుల స్పెషల్ ప్యాకేజీ!

ఈసారి డీఎస్సీ పరీక్ష విధానంలో కూడా మార్పులు చేసే అవకాశముంది. ఇప్పటివరకు సబ్జెక్ట్ ఆధారిత పరీక్షలకే పరిమితమయ్యే విధానం ఉండగా, ఇకపై ఆంగ్ల భాషా నైపుణ్యం, కంప్యూటర్ పరిజ్ఞానం వంటి అంశాలకు కూడా ప్రాధాన్యం ఇవ్వాలని ప్రతిపాదనలు ఉన్నాయి. ఈ మార్పులపై త్వరలో తుది నిర్ణయం తీసుకుని నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు.

AP Economy: ఏపీలో పెట్టుబడుల జోరు.. కొత్త ఏడాదికి బలమైన ఆరంభం - సీఎం చంద్రబాబు!!
విజయవాడలో కొత్తగా రెండు ఎలివేటెడ్ కారిడార్లు.. ఈ రూట్‌లోనే, ప్రతిపాదనలు రెడీ! హైవేల అనుసంధానంతో మారనున్న రూపురేఖలు..
CIBIL Score పెరగాలంటే ఇవి తప్పనిసరి…! ఒక్క పొరపాటు చేస్తే డేంజర్!
Fake videos : AIతో రాష్ట్రపతి, ప్రధాని ఫేక్ వీడియోలు.. బిహార్‌లో వ్యక్తి అరెస్ట్!
Bajaj Pulsar: పల్సర్‌ 25 ఏళ్లు సెలబ్రేషన్… బజాజ్ నుంచి బంపర్ ఆఫర్!!
Road safety: వాహనదారులకు షాక్! ఏపీ వ్యాప్తంగా అమలులోకి కొత్త రూల్స్..!

Spotlight

Read More →