భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) వచ్చే సంవత్సరాల్లో తన కార్యకలాపాలను భారీ స్థాయిలో విస్తరించేందుకు సిద్ధమవుతోంది. చంద్రుడిపై మరింత పురోగతి సాధించాలనే లక్ష్యంతో, సంస్థ తన తదుపరి పెద్ద మిషన్ అయిన చంద్రయాన్-4 ను 2028లో ప్రయోగించేందుకు ప్రణాళికలు పూర్తి చేస్తోంది.
ఇది స్వదేశంలోనూ, అంతర్జాతీయ అంతరిక్ష సమాజంలోనూ భారత్ ప్రతిష్టను మరింత పెంచే మిషన్‌గా భావిస్తున్నారు. ఇస్రో అధిపతి తాజాగా ఇచ్చిన వివరాల ప్రకారం, ఛంద్రయాన్-4 మిషన్‌ను ప్రధానంగా లూనార్ శాంపిల్ రిటర్న్ మిషన్ గా రూపొందిస్తున్నారు. అంటే, చంద్రుడి ఉపరితలంలో నుండి నమూనాలను భూమికి తీసుకురావడం ఈ మిషన్ ప్రధాన లక్ష్యం.
చంద్ర పరిశోధనలో ఇది అత్యంత క్లిష్టమైన దశగా పరిగణించబడుతుంది. ఇప్పటివరకు అమెరికా మరియు చైనా మాత్రమే ఇలాంటి మిషన్లను విజయవంతంగా నిర్వహించాయి. ఇప్పుడు భారతదేశం కూడా ఈ జాబితాలో చేరడానికి సిద్ధమవుతోంది.
ఇస్రో ఛైర్మన్ మాట్లాడుతూ ఛంద్రయాన్-4 మిషన్‌కు ప్రభుత్వం ఇప్పటికే ఆమోదం తెలిపిందని, సాంకేతిక బృందాలు డిజైన్ మరియు పరిశోధన పనులకు వేగం పెంచాయని తెలిపారు.
ఈ మిషన్‌లో అధునాతన ల్యాండర్, అస్సెంట్ మాడ్యూల్, ఆర్బిటర్, రిటర్న్ క్యాప్సూల్ వంటి అనేక కీలక భాగాలు ఉంటాయి. చంద్రుడి ఉపరితలం నుండి నమూనాలు సేకరించడం, వాటిని సురక్షితంగా భూమికి తీసుకురావడం – ఇరువేరూ అత్యంత క్లిష్టమైన దశలు. అందుకే ఈ మిషన్‌ను ఇస్రో ఇప్పటి వరకే అత్యున్నత సాంకేతిక సవాలుగా చూస్తోంది.
ఇదిలా ఉంటే, సంస్థ తన అంతరిక్ష నౌకల ఉత్పత్తిని కూడా భారీగా పెంచేందుకు చర్యలు వేగవంతం చేస్తోంది. ప్రస్తుతం ఉత్పత్తి చేస్తున్న నౌకల సామర్థ్యాన్ని మూడు రెట్లు పెంచడమే లక్ష్యంగా పెట్టుకుంది. ప్రభుత్వ ప్రోత్సాహం, ప్రైవేట్ కంపెనీల భాగస్వామ్యం, కొత్త తయారీ కేంద్రాలు—ఇవన్నీ కలిసి ఉత్పత్తి పెంపుకి దోహదం చేస్తున్నాయని ఇస్రో పేర్కొంది.
ఇస్రో ప్రకారం రాబోయే సంవత్సరాల్లో వాణిజ్య ప్రయోగాలు, ఉపగ్రహ సేవలు, నావిగేషన్, భూ పరిశీలన, అంతరిక్ష అన్వేషణ వంటి రంగాల్లో డిమాండ్ భారీగా పెరుగుతుందని అంచనా. అందుకే తయారీ సామర్థ్యాన్ని పెంచాలని నిర్ణయించారు. చంద్రయాన్-3 విజయంతో భారతీయ అంతరిక్ష పరిశోధనపై ప్రపంచ దృష్టి మళ్లీ పడింది. ఆ మిషన్ చంద్రుడి దక్షిణ ధ్రువ ప్రాంతంలో సాఫ్ట్ ల్యాండింగ్ సాధించి చరిత్ర సృష్టించింది.
ఇప్పుడు ఆ దిశలో మరింత ముందుకు వెళ్లడమే ఈ కొత్త మిషన్ లక్ష్యం. చంద్రుడి నుండి నమూనాలు భూమికి తీసుకురావడం శాస్త్రీయ పరిశోధనలకు మాత్రమే కాకుండా భవిష్యత్ చంద్ర స్థావరాల నిర్మాణానికి కూడా కీలక సమాచారాన్ని అందించనుంది.
ఇస్రో అధిపతి పేర్కొన్నట్టుగా వచ్చే నాలుగైదేళ్లు భారత అంతరిక్ష చరిత్రలో అత్యంత ఉత్కంఠభరితమైన దశ అవుతాయని దేశం ఒక కొత్త అంతరిక్ష యుగంలోకి ప్రవేశిస్తోందని