విశాఖపట్నంలో శనివారం జరిగిన కీలక సమీక్ష సమావేశంలో పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి నారాయణ, VMRDA (Visakhapatnam Metropolitan Region Development Authority) మరియు జీవీఎంసీ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల పురోగతిని సమీక్షించారు. VMRDA కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి కమిషనర్లు తేజ్ భరత్, కేతన్ గార్గ్‌తో పాటు పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు. నగర అభివృద్ధి వేగాన్ని పెంచేందుకు చేపడుతున్న ప్రాజెక్టుల స్థితిగతులను మంత్రి వివరంగా అడిగి తెలుసుకున్నారు.
VMRDA చేపట్టిన MIG లేఅవుట్లు వాటికి అవసరమైన రహదారులు, డ్రైనేజ్, తాగునీటి వంటి మౌలిక వసతుల కల్పనపై అధికారులు ఇచ్చిన వివరాలను మంత్రి సమీక్షించారు. ప్రతి లేఅవుట్‌లో నాణ్యత ప్రమాణాలు పాటించటం ప్రజలకు ఇబ్బందులు రాకుండా ముందుగానే అవసరమైన సదుపాయాలు అందించాలంటూ ఆయన సూచించారు. నగరానికి దూరంగా ప్రాంతాలకు కనెక్టివిటీని పెంచేందుకు రూపొందించిన మాస్టర్ ప్లాన్ రోడ్లు, రాబోయే ఎయిర్‌పోర్ట్‌కి అనుసంధానించే ప్రధాన రహదారుల పనులను వేగవంతం చేయాలని మంత్రి ఆదేశించారు.
అదే విధంగా విస్తరిస్తున్న నగర అవసరాలను దృష్టిలో పెట్టుకుని కొనసాగుతున్న వాటర్ సప్లై ప్రాజెక్టుల పురోగతిపై కూడా మంత్రి కీలక పరిశీలనలు చేశారు. పనులు ఆలస్యం కాకుండా నిర్ణయించిన గడువు లోపు పూర్తి చేయడం అత్యవసరమని అధికారులు దగ్గరుండేలా సూచించారు. వేగవంతమైన పట్టణాభివృద్ధి విశాఖ భవిష్యత్తుకి అత్యంత కీలకమని అందువల్ల శాఖల మధ్య సమన్వయం మరింత బలోపేతం కావాలని మంత్రి నారాయణ ఈ సందర్భంగా పేర్కొన్నారు.
VMRDA మరియు జీవీఎంసీ చేపడుతున్న అన్ని అభివృద్ధి కార్యక్రమాలు నగర వృద్ధికి రాబోయే సంవత్సరాల్లో పునాది వంటివని వాటి అమలు వేగమే ప్రజలకు ప్రత్యక్షంగా లాభం చేకూరుస్తుందని మంత్రి అన్నారు. సమావేశం మొత్తం నగర ప్రణాళిక, కనెక్టివిటీ, మౌలిక వసతుల విస్తరణ వంటి అంశాలపైనే చర్చ సాగింది.