హెల్మెట్ లేకుండా స్కూటీ నడిపినందుకు ఒక యువకుడు పై సంచలనమైన ట్రాఫిక్ ఫైన్ ఎదుర్కొన్న ఘటన తాజాగా వైరల్ అవుతోంది. ఈ న్యూస్ ప్రకారం(ముజఫర్నగర్) న్యూ మండి ప్రాంతంలో నవంబర్ 5 2025న అనమోల్ సింఘాల్ అనే యువకుడు తన స్కూటీని హెల్మెట్ లేకుండా నడిపిస్తున్న క్రమంలో పోలీసులు ఆపారు. అదనంగా వాహనానికి సంబంధించిన పత్రాలు కూడా అతడి వద్ద లేవు.
పోలీసులు అతని స్కూటీని సీజ్ చేసి ఫైన్ జారీ చేశారు పత్రాలు ఏమీ లేనందున ఫైన్ మొత్తం రూ.21,00,000 అని సోషల్ మీడియా లో షేర్ చేయబడింది. ఇది నెటిజన్లలో సంచలనం రేపింది. నెటిజన్లు ఒక్కలక్ష రూపాయల స్కూటీకి ఎందుకు ఇంత భారీ ఫైన్ వేశారు అని ఆశ్చర్యపోయారు.
ఐతే ఈ ఘటనా వెనుక నిజం వేరు. ముజఫర్నగర్ ట్రాఫిక్ ఎస్పీ అతుల్ చౌబే వివరణలో తెలిపిన విధంగా, చలాన్ జారీ చేసిన సబ్ ఇన్స్పెక్టర్ సబ్సెక్షన్ వివరాలను తప్పుగా రాసినట్లు గుర్తించబడింది. అసలు, మోటారు వాహనాల చట్టం సెక్షన్ 207 ప్రకారం, అవసరమైన పత్రాలు లేకుండా వాహనం నడిపిస్తే కనీసంగా రూ.4,000 జరిమానా విధించబడుతుంది.
చిన్న పొరపాట్ల కారణంగా చలాన్ మొత్తాన్ని తప్పుగా రాసినప్పుడు అది ఒక పెద్ద సంఖ్యగా కనిపించింది. నిజానికి, అనమోల్ సింఘాల్ చెల్లించాల్సిన అసలు ఫైన్ రూ.4,000 మాత్రమే. పోలీస్ అధికారులు వెంటనే ఈ పొరపాటు సరిదిద్దారు.
ఈ ఘటన పోలీస్ పర్యవేక్షణలో లాజిస్టికల్ లోపాలను మరియు డిజిటల్ చలాన్లలో ఉండే పొరపాట్లను తెలియ చేసింది. నెటిజన్లలో ఈ వార్త చర్చకు దారితీసింది చట్టపరంగా సరైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం పై పాఠంగా నిలిచింది.
హెల్మెట్ లేకుండా వాహనాలు నడపడం ప్రమాదకరమే మరియు చట్టవిరుద్ధం ఈ ఘటన ప్రజలకు హెచ్చరికగా నిలుస్తోంది. పోలీసులు కూడా దీనిపై ఫాలో అప్ చేసి, భవిష్యత్తులో ఇలాంటి పొరపాట్లు నివారించడానికి కృషి చేస్తున్నారు.