Nara Lokesh: పుట్టపర్తి నుంచి ఏం టేకాఫ్ అవుతుందో తెలుసా? సోషల్ మీడియాలో లోకేష్ టీజర్ ట్వీట్ వైరల్! Samsung: గెలాక్సీ లవర్స్‌కు బంపర్ ఆఫర్: వారంటీతో కూడిన రిఫర్బిష్డ్ ఫోన్లను లాంచ్ చేసిన శాంసంగ్! Bapatla: సూర్యలంక బీచ్‌కు కొత్త శోభ.. “బే ఆఫ్ బాపట్ల”గా బ్రాండింగ్ ప్రారంభం! IPL 2026: పాయింట్ల పట్టికలో నెంబర్ 1 స్థానం కోసం పోరు.. టాస్ గెలిచిన హైదరాబాద్‌కు అడ్వాంటేజ్! Prajavedhika: వైన్ షాపుల పేరుతో భారీ మోసం.. కోటి నలభై లక్షలు వసూలు! ర్ఫింగ్ ఫోటోలతో బ్లాక్ మెయిలింగ్.. Real Estate: రాయదుర్గంలో ప్రభుత్వ భూముల వేలం.. ఎకరాకు కనీస ధర రూ.139 కోట్లు! Minister Savitha: బీసీ విద్యాసంస్థల్లో కొత్త వెలుగు.. ఫలితాల్లో రాష్ట్రంలో నెంబర్‌ వన్‌గా బీసీ వెల్ఫేర్! Vangalapudi Anitha: జైళ్ల సంస్కరణలపై హోం మంత్రి అనిత సమీక్ష.. ఖైదీల సంక్షేమం, భద్రతపై ప్రత్యేక దృష్టి! Kollu Ravindra: జగన్‌పై తీవ్ర విమర్శలు చేసిన మంత్రి కొల్లు రవీంద్ర.. అమరావతి అభివృద్ధిపై కూటమి ప్రభుత్వ కట్టుబాటు! AP Panchayat Raj: అభివృద్ధిలో ఏపీ పంచాయతీల జోరు.. జాతీయ అవార్డులతో కేంద్రం సత్కారం! Nara Lokesh: పుట్టపర్తి నుంచి ఏం టేకాఫ్ అవుతుందో తెలుసా? సోషల్ మీడియాలో లోకేష్ టీజర్ ట్వీట్ వైరల్! Samsung: గెలాక్సీ లవర్స్‌కు బంపర్ ఆఫర్: వారంటీతో కూడిన రిఫర్బిష్డ్ ఫోన్లను లాంచ్ చేసిన శాంసంగ్! Bapatla: సూర్యలంక బీచ్‌కు కొత్త శోభ.. “బే ఆఫ్ బాపట్ల”గా బ్రాండింగ్ ప్రారంభం! IPL 2026: పాయింట్ల పట్టికలో నెంబర్ 1 స్థానం కోసం పోరు.. టాస్ గెలిచిన హైదరాబాద్‌కు అడ్వాంటేజ్! Prajavedhika: వైన్ షాపుల పేరుతో భారీ మోసం.. కోటి నలభై లక్షలు వసూలు! ర్ఫింగ్ ఫోటోలతో బ్లాక్ మెయిలింగ్.. Real Estate: రాయదుర్గంలో ప్రభుత్వ భూముల వేలం.. ఎకరాకు కనీస ధర రూ.139 కోట్లు! Minister Savitha: బీసీ విద్యాసంస్థల్లో కొత్త వెలుగు.. ఫలితాల్లో రాష్ట్రంలో నెంబర్‌ వన్‌గా బీసీ వెల్ఫేర్! Vangalapudi Anitha: జైళ్ల సంస్కరణలపై హోం మంత్రి అనిత సమీక్ష.. ఖైదీల సంక్షేమం, భద్రతపై ప్రత్యేక దృష్టి! Kollu Ravindra: జగన్‌పై తీవ్ర విమర్శలు చేసిన మంత్రి కొల్లు రవీంద్ర.. అమరావతి అభివృద్ధిపై కూటమి ప్రభుత్వ కట్టుబాటు! AP Panchayat Raj: అభివృద్ధిలో ఏపీ పంచాయతీల జోరు.. జాతీయ అవార్డులతో కేంద్రం సత్కారం!

Bapatla: సూర్యలంక బీచ్‌కు కొత్త శోభ.. “బే ఆఫ్ బాపట్ల”గా బ్రాండింగ్ ప్రారంభం!

Bapatla: బాపట్ల జిల్లా సూర్యలంక బీచ్‌ను అంతర్జాతీయ స్థాయి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. స్వదేశీ దర్శన్ పథకం కింద చేపడుతున్న అభివృద్ధి పనులను రాష్ట్ర మంత్రులు అనగాని సత్యప్రసాద్, కందుల దుర్గేష్ పరిశీలించారు.

Published : 2026-05-12 20:57:00

అడ్వెంచర్ టూరిజానికి శ్రీకారం.. సినిమాల షూటింగ్‌లకు ప్రోత్సాహం..

కేంద్రం నుంచి రూ.98 కోట్ల నిధులు.. పర్యాటక హబ్‌గా సూర్యలంక..

బాపట్ల జిల్లా సూర్యలంక బీచ్‌ను అంతర్జాతీయ స్థాయి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. స్వదేశీ దర్శన్ పథకం కింద చేపడుతున్న అభివృద్ధి పనులను రాష్ట్ర మంత్రులు అనగాని సత్యప్రసాద్, కందుల దుర్గేష్ పరిశీలించారు. దాదాపు రూ.100 కోట్లతో చేపడుతున్న ఈ పనుల ద్వారా సూర్యలంక బీచ్ రూపురేఖలు మారనున్నాయని వారు తెలిపారు.

ఈ సందర్భంగా సూర్యలంక బీచ్‌కు “బే ఆఫ్ బాపట్ల” అనే పేరుతో కొత్త బ్రాండింగ్‌ను మంత్రులు ప్రారంభించారు. పర్యాటకులను ఆకర్షించేలా బీచ్‌ను తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలు అమలు చేస్తోందన్నారు.

సూర్యలంక బీచ్‌లో అడ్వెంచర్ టూరిజం సౌకర్యాలను కూడా మంత్రులు ప్రారంభించారు. కుటుంబ సభ్యులు, యువత సరదాగా గడిపేలా బీచ్‌లో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. బీచ్ సందర్శకులకు వినోదంతో పాటు భద్రతా ప్రమాణాలకు కూడా ప్రాధాన్యం ఇస్తున్నట్లు చెప్పారు.

మంత్రి అనగాని సత్యప్రసాద్ మాట్లాడుతూ, సూర్యలంక బీచ్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం రూ.98 కోట్లు విడుదల చేసిందన్నారు. పర్యాటక రంగాన్ని ఆదాయ వనరుగా మార్చే దిశగా ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. ప్రైవేట్ భాగస్వామ్యంతో హోటళ్లు, రిసార్టులు నిర్మించే ప్రణాళికలు కొనసాగుతున్నాయని వెల్లడించారు.

రాష్ట్రంలో పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా ఇచ్చామని, మంచి ప్రతిపాదనలతో ముందుకు వచ్చే పెట్టుబడిదారులకు ప్రత్యేక రాయితీలు, ప్రోత్సాహకాలు అందిస్తామని హామీ ఇచ్చారు. పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఫెస్టివల్స్, కార్నివాల్స్ నిర్వహిస్తున్నామని తెలిపారు.

మంత్రి దుర్గేష్ మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్‌లో సినిమాల చిత్రీకరణ పెరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. సూర్యలంక వంటి అందమైన ప్రాంతాల్లో షూటింగ్‌లు జరిగితే ఆ ప్రాంతానికి మంచి ప్రచారం వస్తుందని పేర్కొన్నారు.

సినిమాల్లో షూటింగ్ జరిగిన ప్రాంతాల పేర్లను సబ్‌టైటిల్స్ రూపంలో చూపించాలని సూచించారు. “పుష్ప” సినిమా చిత్రీకరణ జరిగిన తర్వాత మారేడుమిల్లి పర్యాటకంగా ఎంతగా అభివృద్ధి చెందిందో అందరికీ తెలుసని అన్నారు.

సూర్యలంక బీచ్‌ను భవిష్యత్తులో రాష్ట్రంలోని ప్రధాన పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని మంత్రులు స్పష్టం చేశారు. సహజ అందాలు, సముద్ర తీర వాతావరణాన్ని వినియోగించుకుని దేశ విదేశాల నుంచి పర్యాటకులను ఆకర్షించేలా చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు.

Spotlight

Read More →