Nara Lokesh: పుట్టపర్తి నుంచి ఏం టేకాఫ్ అవుతుందో తెలుసా? సోషల్ మీడియాలో లోకేష్ టీజర్ ట్వీట్ వైరల్! Samsung: గెలాక్సీ లవర్స్‌కు బంపర్ ఆఫర్: వారంటీతో కూడిన రిఫర్బిష్డ్ ఫోన్లను లాంచ్ చేసిన శాంసంగ్! Bapatla: సూర్యలంక బీచ్‌కు కొత్త శోభ.. “బే ఆఫ్ బాపట్ల”గా బ్రాండింగ్ ప్రారంభం! IPL 2026: పాయింట్ల పట్టికలో నెంబర్ 1 స్థానం కోసం పోరు.. టాస్ గెలిచిన హైదరాబాద్‌కు అడ్వాంటేజ్! Prajavedhika: వైన్ షాపుల పేరుతో భారీ మోసం.. కోటి నలభై లక్షలు వసూలు! ర్ఫింగ్ ఫోటోలతో బ్లాక్ మెయిలింగ్.. Real Estate: రాయదుర్గంలో ప్రభుత్వ భూముల వేలం.. ఎకరాకు కనీస ధర రూ.139 కోట్లు! Minister Savitha: బీసీ విద్యాసంస్థల్లో కొత్త వెలుగు.. ఫలితాల్లో రాష్ట్రంలో నెంబర్‌ వన్‌గా బీసీ వెల్ఫేర్! Vangalapudi Anitha: జైళ్ల సంస్కరణలపై హోం మంత్రి అనిత సమీక్ష.. ఖైదీల సంక్షేమం, భద్రతపై ప్రత్యేక దృష్టి! Kollu Ravindra: జగన్‌పై తీవ్ర విమర్శలు చేసిన మంత్రి కొల్లు రవీంద్ర.. అమరావతి అభివృద్ధిపై కూటమి ప్రభుత్వ కట్టుబాటు! AP Panchayat Raj: అభివృద్ధిలో ఏపీ పంచాయతీల జోరు.. జాతీయ అవార్డులతో కేంద్రం సత్కారం! Nara Lokesh: పుట్టపర్తి నుంచి ఏం టేకాఫ్ అవుతుందో తెలుసా? సోషల్ మీడియాలో లోకేష్ టీజర్ ట్వీట్ వైరల్! Samsung: గెలాక్సీ లవర్స్‌కు బంపర్ ఆఫర్: వారంటీతో కూడిన రిఫర్బిష్డ్ ఫోన్లను లాంచ్ చేసిన శాంసంగ్! Bapatla: సూర్యలంక బీచ్‌కు కొత్త శోభ.. “బే ఆఫ్ బాపట్ల”గా బ్రాండింగ్ ప్రారంభం! IPL 2026: పాయింట్ల పట్టికలో నెంబర్ 1 స్థానం కోసం పోరు.. టాస్ గెలిచిన హైదరాబాద్‌కు అడ్వాంటేజ్! Prajavedhika: వైన్ షాపుల పేరుతో భారీ మోసం.. కోటి నలభై లక్షలు వసూలు! ర్ఫింగ్ ఫోటోలతో బ్లాక్ మెయిలింగ్.. Real Estate: రాయదుర్గంలో ప్రభుత్వ భూముల వేలం.. ఎకరాకు కనీస ధర రూ.139 కోట్లు! Minister Savitha: బీసీ విద్యాసంస్థల్లో కొత్త వెలుగు.. ఫలితాల్లో రాష్ట్రంలో నెంబర్‌ వన్‌గా బీసీ వెల్ఫేర్! Vangalapudi Anitha: జైళ్ల సంస్కరణలపై హోం మంత్రి అనిత సమీక్ష.. ఖైదీల సంక్షేమం, భద్రతపై ప్రత్యేక దృష్టి! Kollu Ravindra: జగన్‌పై తీవ్ర విమర్శలు చేసిన మంత్రి కొల్లు రవీంద్ర.. అమరావతి అభివృద్ధిపై కూటమి ప్రభుత్వ కట్టుబాటు! AP Panchayat Raj: అభివృద్ధిలో ఏపీ పంచాయతీల జోరు.. జాతీయ అవార్డులతో కేంద్రం సత్కారం!

Prajavedhika: వైన్ షాపుల పేరుతో భారీ మోసం.. కోటి నలభై లక్షలు వసూలు! ర్ఫింగ్ ఫోటోలతో బ్లాక్ మెయిలింగ్..

Prajavedhika: మార్కాపురం జిల్లా రాయవరంకు చెందిన శ్రీనివాసులు నేడు టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ప్రజావినతుల స్వీకరణ కార్యక్రమంలో నేతలకు అర్జీ ఇచ్చి అభ్యర్థిస్తూ.. తమ గ్రామ పరిధిలోని సర్వే నంబర్ 384/3లో 1.25 సెంట్ల భూమి గత 40 ఏళ్లుగా నా సాగులో ఉంది.

Published : 2026-05-12 20:33:00
  • రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్‌ రెడ్డి, టీడీపీ జాతీయ ఉపాధ్యక్షురాలు పీతల సుజాత..
     
  • అర్జీలు స్వీకరించి సమస్యల పరిష్కారానికి కృషి చేసిన నేతలు..
     
  • రెడ్ జోన్ సాకుతో భూమి ఆక్రమణకు యత్నం.. న్యాయం చేయాలంటూ వినతి..
     
  • భూమి కబ్జాకు యత్నిస్తున్న వైసీపీ నాయకులపై గ్రీవెన్స్ లో ఫిర్యాదు..

Prajavedhika: మార్కాపురం జిల్లా రాయవరంకు చెందిన శ్రీనివాసులు నేడు టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ప్రజావినతుల స్వీకరణ కార్యక్రమంలో నేతలకు అర్జీ ఇచ్చి అభ్యర్థిస్తూ.. తమ గ్రామ పరిధిలోని సర్వే నంబర్ 384/3లో 1.25 సెంట్ల భూమి గత 40 ఏళ్లుగా నా సాగులో ఉంది. దీనికి పట్టా పాస్ పుస్తకం ఇప్పించి, ఆన్‌లైన్ చేయించాలని ఏడాది కాలంగా తహశీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నాను. కానీ స్థానిక రాజకీయ కారణాల వల్ల తన పని కావడం లేదు. తనకు రావలసిన పట్టాను వైసీపీ నాయకులు తీసుకోవాలని చూస్తున్నారు. ప్రముఖ ఫైనాన్స్ కంపెనీ వారు తను తీసుకున్న అప్పుకు సంబంధించి భారీగా వడ్డీలు వేసి, 3 లక్షలకు ఏకంగా 30 లక్షలు కట్టాలని నోటీసులు పంపి వేధిస్తున్నారు. ఈ ఆర్థిక ఒత్తిడి తట్టుకోలేక ఎంతో మానసిక వేదన అనుభవిస్తున్నాను. కావున వారిపై చర్యలు తీసుకోని తమ సమస్యను పరిష్కరించాలని నేతలు రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్‌ రెడ్డి, టీడీపీ జాతీయ ఉపాధ్యక్షురాలు పీతల సుజాతలకు అర్జీ ఇచ్చి అభ్యర్ధించాడు.

గుంటూరు జిల్లా పల్లపాడు గ్రామానికి  చెందిన వెంకటేశ్వర్లు గ్రీవెన్స్ లో అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేస్తూ.. గత 12 ఏళ్లుగా రైస్ మిల్‌లో బియ్యం కొనుగోలు చేస్తూ పరిచయమైన వంకాయలపాటి రాంబాబు అనే వ్యక్తి, తనకు శ్రీకంధ సాయికిరణ్ అనే వ్యక్తిని పరిచయం చేశాడు. సాయికిరణ్ తనకు వైన్ షాపులు ఇప్పిస్తాడని రాంబాబు నమ్మబలికాడు. రాంబాబు మధ్యవర్తిగా ఉండటంతో తను వారి మాటలను నమ్మి పలు దఫాలుగా రూ. 1,40,00,000/- (కోటి నలభై లక్షలు) ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్స్, ప్రామిసరీ నోట్ల రూపంలో సాయికిరణ్‌కు ఇచ్చాను. ఈ సొమ్ము కోసం పలుచోట్ల అప్పులు కూడా చేశాను. 

తనకు అప్పు ఇచ్చిన వారు డబ్బులు ఇవ్వాలని ఒత్తిడి చేయడంతో వారి డబ్బులు అడిగితే ఇప్పటివరకు కేవలం రూ. 23,00,000/- మాత్రమే తిరిగి ఇచ్చారు. మిగిలిన కోటి రూపాయలకు పైగా సొమ్ము అడిగితే, "మేము ఇవ్వము, ఏం చేసుకుంటావో చేసుకో" అంటూ నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నారు. డబ్బుల గురించి పదే పదే అడిగితే చంపేస్తామని బెదిరిస్తున్నారు. తాను నివసించే అపార్ట్‌మెంట్ వద్దకు కొత్త వ్యక్తులు వచ్చి వాచ్‌మెన్ ద్వారా తన గురించి ఆరా తీస్తున్నారు. ఈ విషయమై ఇప్పటికే స్థానిక పోలీస్ స్టేషన్‌లో పలుమార్లు అర్జీలు ఇచ్చాను, కానీ ఇప్పటివరకు ఎటువంటి న్యాయం జరగలేదు. కావున వారిపై చర్యలు తీసుకోని తమ సమస్యను పరిష్కరించాలని కోరాడు.

ఏలూరు జిల్లా ముదినేపల్లి మండలం శింగరాయపాలెం గ్రామానికి చెందిన సాయి సుగుణ గ్రీవెన్స్ లో అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేస్తూ..తను ఎలాంటి లోన్ తీసుకోకపోయినప్పటికీ గత కొన్ని రోజులుగా గుర్తుతెలియని వ్యక్తులు వేర్వేరు నంబర్ల నుండి కాల్స్ చేస్తూ తీవ్రంగా వేధిస్తున్నారు. లోన్ తీసుకున్నానని అబద్ధం చెబుతూ తన ఫోన్ కాంటాక్ట్స్ సేకరించి తన మిత్రులకు, బంధువులకు అసభ్యకరమైన వీడియోలు పంపిస్తున్నారు. తన ఫొటోలను, వీడియోలను మార్ఫింగ్ చేసి తన కాంటాక్ట్ లిస్టులో ఉన్నవారికి పంపిస్తూ వారిని కూడా డబ్బులు అడగుతూ తన  పరువు తీస్తున్నారు. ఈ వేధింపుల వల్ల నా కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. కావున వారిపై చర్యలు తీసుకోని తమ సమస్యను పరిష్కరించాలని కోరారు.

మార్కాపురం జిల్లా పుల్లలచెరువు మండలం చెన్నెంపల్లి గ్రామానికి చెందిన చెన్నప్పనాయుడు గ్రీవెన్స్ లో అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేస్తూ..చాపలమడుగు గ్రామం సర్వే నెం. 825/A లోని 2.10 ఎకరాల భూమిని తాము 30.05.2011వ తేదీన బోడా చెన్నవీరమ్మ కుమారులైన వీరప్పనాయుడు, వెంకటేశ్వర్లు, చిన్న వెంకటేశ్వర్లు వద్ద నుండి రూ. 2,63,000/- లకు విక్రయ అగ్రిమెంటు ద్వారా కొనుగోలు చేశాము. గత 13 ఏళ్లుగా సదరు భూమి తమ స్వాధీనంలోనే ఉంది. తామే సాగు చేసుకుంటున్నాము. అయితే ప్రస్తుతం ఈ భూమి 'రెడ్ జోన్' లో ఉండటంతో దాన్ని సరిచేసి ఆన్‌లైన్ చేయించుకోవాలని తాము తహశీల్దార్ కార్యాలయానికి వెళ్లాము. ఆన్‌లైన్ ప్రక్రియను అడ్డుకుంటూ గతంలో తమకు భూమి అమ్మిన వారిలో ఒకరైన బోడా వీరప్పనాయుడు, అతని అనుచరులు (చిన్న శ్రీను, పెద్ద శ్రీను) తమపై, తమ కుటుంబ సభ్యులపై గొడవకు దిగుతూ భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. కావున వారిపై చర్యలు తీసుకోని తమ భూమి సమస్యను పరిష్కరించాలని కోరాడు.

కర్నూలు జిల్లా నందవరంకు చెందిన మల్లికార్జున గౌడ్ గ్రీవెన్స్ లో అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేస్తూ..తమ గ్రామంలో సర్వే నంబర్ 382లో గల 3.00 ఎకరాల భూమి ఉంది. తమ తాతముత్తాతల కాలం నుండి వంశపారంపర్యంగా వస్తున్న ఆస్తి. ప్రస్తుతం ఈ భూమి తమ పూర్తి స్వాధీనంలో ఉంది. వ్యవసాయం కూడా  చేసుకుంటున్నాము. అయితే రెవెన్యూ రికార్డులలో తమకు ఏమాత్రం సంబంధం లేని 'మల్లయ్య' అనే వ్యక్తి పేరు అక్రమంగా నమోదైంది. దీనిపై పలుమార్లు తహశీల్దార్ కార్యాలయంలో వినతి పత్రాలు సమర్పించినా ఇప్పటివరకు ఎటువంటి న్యాయం జరగలేదు. కావున వారిపై చర్యలు తీసుకోని తమ సమస్యను పరిష్కరించాలని కోరాడు.

కృష్ణా జిల్లా కంకిపాడు మండలం ఉప్పులూరు గ్రామానికి చెందిన అమరలింగేశ్వరరావు గ్రీవెన్స్ లో అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేస్తూ..తమకు భూమి రికార్డుల ప్రకారం 0.98 సెంట్లు ఉండాలి. కానీ రెవెన్యూ రికార్డులలో జరిగిన చిన్న పొరపాటు కారణంగా ప్రస్తుతం కేవలం 0.92 సెంట్లు మాత్రమే చూపిస్తోంది. అంటే సుమారు 0.06 సెంట్లు (సుమారు 8 సెంట్లు) భూమి రికార్డులలో తగ్గిపోయింది. ఈ తగ్గిన భూమి పొరుగున ఉన్న సరిహద్దుదారుని పొలంలో కలిసిపోయింది. గత 13 ఏళ్లుగా అర్జీలు ఇస్తున్నా, అధికారుల చుట్టూ తిరుగుతున్నా తహసీల్దార్ కార్యాలయం నుండి ఆశించిన స్పందన లేదు. మండల సర్వేయర్ ఇప్పటికే క్షేత్రస్థాయిలో భూమిని కొలిచి, రికార్డులలో తప్పు జరిగిందని, భూమి తగ్గిందని నిజ నిర్ధారణ చేసినప్పటికీ, సరిహద్దులను నిర్ణయించి న్యాయం చేయడంలో అధికారులు తాత్సారం చేస్తున్నారు.  కావున వారిపై చర్యలు తీసుకోని తమ సమస్యను పరిష్కరించాలని కోరాడు.

మార్కాపురం జిల్లా పెద్దారవీడు మండలం దేవరాజుగట్టు గ్రామానికి చెందిన లింగాల అబ్రహం గ్రీవెన్స్ లో అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేస్తూ..తమ కుటుంబానికి సంక్రమించిన భూమి సర్వే నెం. 105/2, విస్తీర్ణం 1.58 ఎకరాలు ఉంది. సదరు భూమికి మర్రి సాయికృష్ణ, మర్రి శ్రీనివాసరావు అనే వ్యక్తులు రెవెన్యూ అధికారుల సహకారంతో తప్పుడు పత్రాలు సృష్టించి ఆన్‌లైన్ పోర్టల్‌లో నకిలీ పాస్ పుస్తకాలు పొందారు. దీనిపై ఆర్.డి.ఓ గారి వద్ద అప్పీల్ చేయగా విచారణ జరిపిన అధికారి ఆ నకిలీ పట్టాలను తొలగించాలని ఆదేశాలు జారీ చేశారు. కానీ క్షేత్రస్థాయిలో రెవెన్యూ సిబ్బంది ఆ ఆదేశాలను అమలు చేయడం లేదు. కావున వారిపై చర్యలు తీసుకోని తమ సమస్యను పరిష్కరించాలని కోరాడు.

సత్య సాయి జిల్లా తాడిమర్రి మండలం చిన్న చిగుల్లరేవు గ్రామానికి చెందిన బి.కుల్లయప్ప గ్రీవెన్స్ లో అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేస్తూ..తమ గ్రామంలోని సర్వే నంబర్లు 239-1, 239-2 లలో తమకు 18 ఎకరాల 28 సెంట్ల భూమి కలదు. ఇది తమ తాతల కాలం నుండి వస్తున్న రిజిస్టర్డ్ భూమి. దీనిపై పూర్తి హక్కులు తమ కుటుంబానికే ఉన్నాయి. ఈ భూమి సమస్యపై చిత్రవారి రిజర్వాయర్ కార్యాలయంలో గానీ, స్థానిక కార్యాలయాల్లో గానీ తమకు సరైన సమాధానం లభించడం లేదు. తాడిమర్రి వి.ఆర్.ఓ  రామాంజినేయులు గారు రికార్డులలో తప్పులెక్కలు రాస్తూ మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. డి.టి. శంకర్ గారు కావాలనే అధికారులపై ఒత్తిడి తెస్తూ తమ పని జరగకుండా అడ్డుపడుతున్నారు. కావున వారిపై చర్యలు తీసుకోని తమ సమస్యను పరిష్కరించాలని కోరాడు.

నంద్యాల జిల్లా శిరివెళ్ల మండలం వీరారెడ్డిపల్లె గ్రామానికి చెందిన కోటిరెడ్డి గ్రీవెన్స్ లో అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేస్తూ.. తమ గ్రామంలో సర్వే నెం.481/1లో 5.10 ఎకరాల స్వంత భూమి కలదు. తమ భూమి రిసెటిల్‌మెంట్ రిజిస్టర్ లో పొరపాటున 'కుంట' అని నమోదు కావడం వల్ల, 2019వ సంవత్సరంలో అధికారులు దీనిని 22-A (నిషేధిత భూముల జాబితా) లో చేర్చారు. దీనిపై గతంలో దరఖాస్తు చేసుకోగా, అప్పటి స్థానిక తహసీల్దారు గారు, సర్వేయర్ గారు క్షేత్రస్థాయిలో పర్యవేక్షించి అక్కడ ఎటువంటి కుంట లేదని అది సాగు భూమి అని ధృవీకరిస్తూ రాతపూర్వకమైన నివేదికను ఆర్డీవో, కలెక్టర్ కార్యాలయాలకు సమర్పించారు. అయితే క్షేత్రస్థాయి అధికారుల నివేదికను పరిగణనలోకి తీసుకోకుండా తన దరఖాస్తును గతంలో తిరస్కరించడం జరిగింది. దీనివల్ల తన స్వంత భూమిపై ఎటువంటి హక్కులు లేకుండా పోతున్నాయి. కావున వారిపై చర్యలు తీసుకోని తమ భూమి సమస్యను పరిష్కరించాలని కోరాడు.

వీటితో పాటు పలువురు పింఛన్, రేషన్, ఇళ్ల నిర్మాణాల సమస్యలపై అర్జీలు ఇచ్చి పరిష్కరించాలని కోరగా.. మరికొందరు ఉద్యోగాల కోసం రెస్యూమ్ లు ఇచ్చారు. అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నాం ఆర్ధికతోడ్పాటు కల్పించాలని మరికొందరు అభ్యర్థనలు అందించారు.

Spotlight

Read More →