Yoga: అహ్మదాబాద్‌లో నేటి నుంచి తొలి ప్రపంచ యోగాసన క్రీడా ఛాంపియన్‌షిప్! RBI: ఆర్‌బీఐ నివేదికలో సంచలన నిజాలు... మార్కెట్‌లో రూ. 500 దొంగనోట్ల జోరు! మీ దగ్గర ఉంటే వెంటనే..! Modi: గుజరాత్, దమన్‌లో రూ.21,700 కోట్లకు పైగా అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్న ప్రధాని మోదీ! Chandrababu: "జై ఆంధ్రప్రదేశ్" నినాదంతో చంద్రబాబు వైరల్ పోస్ట్.. సోషల్ మీడియాలో కూటమి శ్రేణుల సంబరాలు! Dhurandhar 2: ఓటీటీ ప్రియులకు పండగ.. ఈ రాత్రి 7 గంటల నుంచే ‘ధురంధర్ 2’ ప్రీమియర్! TAMA: జెనరేటివ్ ఏఐపై ఉచిత ఆన్‌లైన్ శిక్షణకు టామా శ్రీకారం! Virat Kohli: టీమ్‌ఇండియాకు షాక్.. ఆఫ్ఘనిస్థాన్‌ సిరీస్‌కు విరాట్ కోహ్లీ దూరం! 2027 వన్డే వరల్డ్ కప్‌పై.. Bandla Ganesh: టాలీవుడ్‌లో ట్విట్టర్ వార్.. పనిలేకపోతే ఇంట్లో కూర్చో! అందరి విషయాల్లో దూరి హీరోలా ఫీలవ్వకు! ప్రకాశ్ రాజ్‌పై బండ్ల ఆగ్రహం! Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ చరిత్రలో చిరస్మరణీయమైన జూన్ 4 తీర్పుకు రెండేళ్లు! Food Recipe: మిల్ మేకర్ గోంగూర కాంబినేషన్.. నాన్‌వెజ్ టేస్ట్‌ను మించిపోయేలా... తయారీ విధానం! Yoga: అహ్మదాబాద్‌లో నేటి నుంచి తొలి ప్రపంచ యోగాసన క్రీడా ఛాంపియన్‌షిప్! RBI: ఆర్‌బీఐ నివేదికలో సంచలన నిజాలు... మార్కెట్‌లో రూ. 500 దొంగనోట్ల జోరు! మీ దగ్గర ఉంటే వెంటనే..! Modi: గుజరాత్, దమన్‌లో రూ.21,700 కోట్లకు పైగా అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్న ప్రధాని మోదీ! Chandrababu: "జై ఆంధ్రప్రదేశ్" నినాదంతో చంద్రబాబు వైరల్ పోస్ట్.. సోషల్ మీడియాలో కూటమి శ్రేణుల సంబరాలు! Dhurandhar 2: ఓటీటీ ప్రియులకు పండగ.. ఈ రాత్రి 7 గంటల నుంచే ‘ధురంధర్ 2’ ప్రీమియర్! TAMA: జెనరేటివ్ ఏఐపై ఉచిత ఆన్‌లైన్ శిక్షణకు టామా శ్రీకారం! Virat Kohli: టీమ్‌ఇండియాకు షాక్.. ఆఫ్ఘనిస్థాన్‌ సిరీస్‌కు విరాట్ కోహ్లీ దూరం! 2027 వన్డే వరల్డ్ కప్‌పై.. Bandla Ganesh: టాలీవుడ్‌లో ట్విట్టర్ వార్.. పనిలేకపోతే ఇంట్లో కూర్చో! అందరి విషయాల్లో దూరి హీరోలా ఫీలవ్వకు! ప్రకాశ్ రాజ్‌పై బండ్ల ఆగ్రహం! Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ చరిత్రలో చిరస్మరణీయమైన జూన్ 4 తీర్పుకు రెండేళ్లు! Food Recipe: మిల్ మేకర్ గోంగూర కాంబినేషన్.. నాన్‌వెజ్ టేస్ట్‌ను మించిపోయేలా... తయారీ విధానం!

Bandla Ganesh: టాలీవుడ్‌లో ట్విట్టర్ వార్.. పనిలేకపోతే ఇంట్లో కూర్చో! అందరి విషయాల్లో దూరి హీరోలా ఫీలవ్వకు! ప్రకాశ్ రాజ్‌పై బండ్ల ఆగ్రహం!

Bandla Ganesh: ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్‌పై టాలీవుడ్ నిర్మాత బండ్ల గణేష్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. జనసేన అధినేత, ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ను ఉద్దేశించి ప్రకాశ్ రాజ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారాన్ని రేపుతున్నాయి.

Published : 2026-06-04 12:45:00
  • తర్వాత ప్రపంచాన్ని మార్చాలంటూ ఘాటు వ్యాఖ్యలు..
     
  • Cinema: పవన్ కల్యాణ్‌పై పోస్ట్‌కు కౌంటర్‌గా బండ్ల స్పందన..

Bandla Ganesh: టాలీవుడ్ సీనియర్ విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్‌పై ప్రముఖ నటుడు, స్టార్ నిర్మాత బండ్ల గణేష్ సోషల్ మీడియా వేదికగా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ను ఉద్దేశించి ప్రకాశ్ రాజ్ చేసిన తాజా రాజకీయ వ్యాఖ్యలు ఇప్పుడు ఇరు రాష్ట్రాల్లో పెద్ద దుమారాన్ని రేపుతున్నాయి. పవన్ కల్యాణ్ ఇటీవల తెలంగాణ పర్యటనలో చేసిన పొలిటికల్ కామెంట్స్‌ను టార్గెట్ చేస్తూ ‘‘మీరొస్తానంటే మేమొద్దంటామా?’’ అంటూ ప్రకాశ్ రాజ్‌ తన అధికారిక ‘ఎక్స్‌’ (ట్విట్టర్) ఖాతాలో వ్యంగ్యంగా ఒక పోస్ట్‌ చేశారు. ప్రకాశ్ రాజ్ చేసిన ఈ పోస్ట్‌కు బండ్ల గణేష్ వెంటనే అంతే ఘాటుగా స్పందిస్తూ, పవన్ కల్యాణ్‌కు మద్దతుగా నిలిచారు. పవన్ కల్యాణ్‌ను విమర్శించే ముందు ‘‘నీ అడ్రస్‌ ఏంటో మొదట నువ్వు తెలుసుకో’’ అంటూ బండ్ల గణేష్ అదే ‘ఎక్స్‌’ వేదికగా అత్యంత ఘాటుగా కౌంటర్ ఇచ్చారు.

ఈ క్రమంలో ప్రకాశ్ రాజ్‌ను ఉద్దేశించి బండ్ల గణేశ్‌ సుదీర్ఘమైన పోస్ట్‌ చేస్తూ తీవ్ర పదజాలంతో మండిపడ్డారు. ‘‘నీకెందుకు ప్రతి దాంట్లో వేలుపెట్టడం? అసలు నువ్వెవడివి? తమిళోడివా, తెలుగోడివా, కన్నడోడివా? నీ ఊరు ఏది, నీ కథ ఏంటి? ప్రతి ఊర్లో, ప్రతి రాజకీయ అంశంలో దూరి జడ్జిమెంట్‌లు ఇవ్వడానికి నువ్వేమైనా ఆయా జిల్లాల కలెక్టర్‌వా లేక దేశ ప్రధానివా? ఎక్కడ చూసినా నువ్వే కనిపిస్తావు, సమాజంలో ఏ చిన్న విషయం వచ్చినా నువ్వే స్పందిస్తావు. నీకు సినిమాలు లేక పని లేకపోతే ఇంట్లో కూర్చోని చూసుకో. కానీ అందరి విషయాల్లో అనవసరంగా దూరి పెద్ద హీరోలా ఫీలవ్వకు. ముందు నీ సొంత అడ్రస్ ఏంటో నువ్వు తెలుసుకో, ఆ తర్వాత ఈ ప్రపంచాన్ని మార్చే ప్రయత్నం చెయ్!’’ అంటూ బండ్ల గణేశ్‌ తన ‘ఎక్స్‌’ ఖాతాలో పోస్ట్ రాసుకొచ్చారు. తెలంగాణలో రాబోయే స్థానిక మరియు సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ తరఫున తాను మొత్తం తిరుగుతానని, ఖచ్చితంగా పోటీ చేస్తానని పవన్ కల్యాణ్‌ ఇటీవల వ్యాఖ్యానించిన నేపథ్యంలోనే ప్రకాశ్ రాజ్ ఈ కౌంటర్ ఇచ్చారు. పవన్ వ్యాఖ్యలపై పరోక్షంగా స్పందించిన ప్రకాశ్‌ రాజ్‌, ‘‘సింగిల్‌గా వస్తారా? లేదా పొత్తుతో వస్తారా? అని ప్రశ్నిస్తూ.. తెలంగాణలోకి అడుగుపెట్టే ముందు ఆ విషయాన్ని ప్రజలకు స్పష్టంగా చెప్పి రావాలంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించడంతో ఈ వివాదం మరింత ముదిరింది.

Spotlight

Read More →