LIVE
Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  Promotions: దేవాదాయ శాఖలో భారీ ప్రమోషన్లు.. గ్రేడ్-1 ఆఫీసర్లుగా 26 మంది ఈఓలకు పదోన్నతి!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  •  AP CRDA: 0.4 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రూపుదిద్దుకుంటున్న నీరుకొండ రిజర్వాయర్...  •  Vishaka: ప్రభుత్వ స్కూల్‌గా మారిన విశాఖ విమల విద్యాలయం.. కలెక్టర్, ఎమ్మెల్యే పల్లా చేతుల మీదుగా ప్రారంభం!  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
Politics

Pawan Kalyan: వైసీపీ మళ్లీ రాదు.. అమరావతిపై జనసేన ఎప్పుడూ మాట మార్చదు! వారికి పవన్ కల్యాణ్ గట్టి భరోసా..

Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ శాసనసభలో రాజధాని అమరావతిపై జరుగుతున్న చర్చలో ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అత్యంత శక్తిమంతమైన ప్రసంగం చేశారు. భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు నాంది పలికిన పొట్టి శ్రీరాముల త్యాగ ఫలితంగా ఏర్పడిన ఆంధ్రరాష్ట్రం, ఇన్నేళ్లయినా సరైన రాజధాని, హైకోర్టు లేక ఇబ్బం…

AndhraPravasi News Desk 2 min read
Pawan Kalyan: వైసీపీ మళ్లీ రాదు.. అమరావతిపై జనసేన ఎప్పుడూ మాట మార్చదు! వారికి పవన్ కల్యాణ్ గట్టి భరోసా..
  • రాజకీయ స్థిరత్వం ఉంటేనే పెట్టుబడులు: ఏపీ అభివృద్ధికి అమరావతి ప్రాధాన్యతను వివరించిన పవన్..
     
  • Politics: రైతులను హింసించి ముళ్ల కంచెలు వేశారు: గత ప్రభుత్వంపై పవన్ కల్యాణ్ నిప్పులు..

Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ శాసనసభలో రాజధాని అమరావతిపై జరుగుతున్న చర్చలో ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అత్యంత శక్తిమంతమైన ప్రసంగం చేశారు. భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు నాంది పలికిన పొట్టి శ్రీరాముల త్యాగ ఫలితంగా ఏర్పడిన ఆంధ్రరాష్ట్రం, ఇన్నేళ్లయినా సరైన రాజధాని, హైకోర్టు లేక ఇబ్బంది పడటం దురదృష్టకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని విభజించే సమయంలో కాంగ్రెస్ పార్టీ బాధ్యతారహితంగా వ్యవహరించిందని, విభజనానంతరం సరైన కార్యాలయాలు కూడా లేని దుస్థితిలో రాష్ట్రం ఏర్పడిందని గుర్తు చేశారు. అటువంటి క్లిష్ట పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు ఒక బలమైన ఆశావాదిగా, టెంట్లు వేసుకొని అయినా సరే పాలన సాగిద్దామని ముందుకు రావడం ఆయనలోని దార్శనికతకు నిదర్శనమని కొనియాడారు. రాష్ట్ర భవిష్యత్తు చంద్రబాబు వంటి అనుభవజ్ఞుడి చేతుల్లో ఉంటేనే బాగుంటుందనే ఉద్దేశంతోనే తాను 2014లో మద్దతు ఇచ్చానని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.

రాజధాని అమరావతి కోసం రైతులు చేసిన త్యాగాలను ప్రస్తావిస్తూ, ఎటువంటి గొడవలు లేకుండా 33 వేల ఎకరాలను ఇష్టపూర్వకంగా ఇచ్చారని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. అయితే 2019లో ప్రభుత్వం మారిన తర్వాత వైసీపీ నేతలు అమరావతిపై కక్ష గట్టారని, రైతులకు మద్దతుగా వెళ్తే ముళ్ల కంచెలు వేసి అడ్డుకున్నారని మండిపడ్డారు. వైసీపీ హయాంలో శాసనసభ్యులకే రక్షణ లేని పరిస్థితి ఉంటే, సామాన్య రైతులకు రక్షణ ఎక్కడిదని ప్రశ్నించారు. మూడు రాజధానుల పేరుతో ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టి సమస్యను మరింత జటిలం చేశారని, భూములిచ్చిన రైతులను దారుణంగా హింసించారని దుయ్యబట్టారు. వైసీపీ మళ్లీ వస్తే పరిస్థితి ఏంటని కొందరు అడుగుతున్నారని, కానీ ఆ పార్టీ మళ్లీ రాదని, ఒకవేళ వచ్చినా రాజధానిని ఏమీ చేయలేదని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అమరావతి విషయంలో జనసేన పార్టీ ఎప్పుడూ మాట మార్చదని, తాము రైతులకు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటామని పునరుద్ఘాటించారు.

హైదరాబాద్ అభివృద్ధిని ఉదాహరణగా చూపుతూ, అప్పట్లో సైబరాబాద్ నిర్మిస్తున్నప్పుడు చంద్రబాబును అందరూ విమర్శించారని, ప్రపంచ బ్యాంకుతో కుమ్మక్కయ్యారని ఆరోపణలు చేశారని పవన్ గుర్తు చేశారు. కానీ ఒక సాధారణ రాజకీయ నాయకుడు కేవలం వచ్చే ఎన్నికల గురించి ఆలోచిస్తే, ఒక దార్శనికుడు మాత్రం రాబోయే తరం భవిష్యత్తు గురించి ఆలోచిస్తారని చంద్రబాబును ఉద్దేశించి వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో రాజకీయ స్థిరత్వం ఉంటేనే పెట్టుబడులు వస్తాయని, చట్టసభల్లో కూర్చొని దాడులు చేస్తామంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. మనమంతా ఆంధ్రులమనే భావనతో ఉండాలని, ప్రాంతీయ విద్వేషాలకు తావులేకుండా అమరావతిని ఆంధ్రులందరి గర్వకారణమైన రాజధానిగా నిర్మించుకోవాలని పిలుపునిచ్చారు. రాజధాని నిర్మాణం కోసం ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని, రాష్ట్ర ప్రయోజనాలే తమకు పరమావధి అని పవన్ కల్యాణ్ తన ప్రసంగంలో స్పష్టం చేశారు.

Be the first to react

More Coverage

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ఉపయోగించుకుని రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీశారని మాజీ ముఖ్యమ…

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: రాజధాని అమరావతిలో జరుగుతున్న అభివృద్ధి పనులను రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి…