జిల్లాలో వైసీపీకి (YCP) బిగ్ షాక్ తగిలింది. జిల్లాకు చెందిన వైసీపీ కీలక నేత పార్టీకి గుడ్‌బై చెప్పి టీడీపీలో చేరారు. 42 వార్డు వైసీపీ కార్పొరేటర్ కరీముల్లా టీడీపీలో చేరారు.
మంత్రి నారాయణ సమక్షంలో కరీముల్లా టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. కార్పొరేటర్ కరీముల్లా టీడీపీలో చేరికతో మాజీ మంత్రి అనిల్ కుమార్, ఎమ్మెల్సీ చంద్రశేఖర్‌రెడ్డి పరువు పోగొట్టుకున్నారు.
కీలక నేతలు పార్టీని వీడుతుండటంతో మాజీ సీఎం జగన్ పరువుకు భంగం వాటిల్లినట్లు రాజకీయ వర్గాల్లో చర్చనడుస్తోంది.
ఈరోజు (శనివారం) ఉదయం కరీముల్లాను స్వయంగా వక్ఫ్ బోర్డు ఛైర్మన్ అబ్దుల్ అజీజ్ వెంటబెట్టుకుని అమరావతికి తీసుకెళ్లారు.
ఈ సందర్భంగా విజయవాడలో కరీముల్లాకు మంత్రి నారాయణ టీడీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
అంతేకాకుండా మరో ఇద్దరు కార్పొరేటర్లు కూడా టీడీపీ నేతలతో టచ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ఆ ఇద్దరినీ టీడీపీలోకి తీసుకెళ్లేందుకు ముక్కాల ద్వారకానాధ్ విస్తృతంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.
పార్టీ మార్పు ఆలోచనపై అక్కడి టీడీపీ అధికార ప్రతినిధి సంపత్ కుమార్ మాట్లాడుతూ.. నెల్లూరుకు స్రవంతి మేయర్‌గా ఎప్పుడూ వ్యవహరించలేదు. రాజకీయాలు వేరు.. అభివృద్ధి వేరు.
అని మంత్రి నారాయణ చెప్పారు. కార్పొరేటర్లు స్వచ్ఛందంగా పార్టీ మారి నగర అభివృద్ధి చేసుకోవాలని నిర్ణయించారు.
వైసీపీ నాయకులు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. వారి భాష వల్లే జనం 11 సీట్లకు పరిమితం చేశారు. కేవలం అభివృద్ధి కోసమే కార్పొరేటర్లు పార్టీ మారుతున్నారు' అని చెప్పుకొచ్చారు.
నగరంలో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. ఇన్నాళ్లూ వైసీపీలో కీలక పాత్ర పోషించిన కార్పోరేటర్లు కరీముల్లా, శ్రీనివాస్ యాదవ్ టీడీపీ తీర్థం పుచ్చుకోవడంతో ఆ పార్టీ బలహీనపడినట్టు తెలుస్తోంది.
దీంతో మరో ఇద్దరు కార్పొరేటర్లు కూడా టీడీపీ నేతలతో టచ్‌లోకి వెళ్లినట్టు సమాచారం. దీంతో ఏం జరుగుతుందో అర్థంకాక వైసీపీ అధినేత జగన్, ఇతర నాయకులు అయోమయంలో పడ్డారు.
మాజీ మంత్రి అనిల్ కుమార్ యాక్షన్‌లోకి దిగిన గంటల వ్యవధిలోనే మంత్రి నారాయణ, ఎమ్మెల్యే కోటంరెడ్డి రియాక్షన్ మొదలుపెట్టినట్టు రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి.
మాజీ సీఎం జగన్ వద్ద వైసీపీలో చేరిన ఐదుగురు కార్పోరేటర్లు.. గంట వ్యవధిలోనే తిరిగి టీడీపీలో చేరారు. దీంతో అనిల్ కుమార్ తీరుపై సొంత పార్టీలోనే తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.