LIVE
Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  •  AP CRDA: 0.4 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రూపుదిద్దుకుంటున్న నీరుకొండ రిజర్వాయర్...  •  Vishaka: ప్రభుత్వ స్కూల్‌గా మారిన విశాఖ విమల విద్యాలయం.. కలెక్టర్, ఎమ్మెల్యే పల్లా చేతుల మీదుగా ప్రారంభం!  •  6G Network: భారత్‌లో 6G సంచలనం.. టెలికాం రంగం రూపురేఖలు మార్చబోతున్న కేంద్ర ప్రభుత్వ మాస్టర్ ప్లాన్!  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
Politics

Yaganti Temple: యాగంటి క్షేత్ర అభివృద్ధికి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి శ్రీకారం... రూ. 5.08 కోట్లతో నూతన పనులకు భూమిపూజ.!

Yaganti Temple: ప్రముఖ పుణ్యక్షేత్రం యాగంటిలో రూ. 5.08 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి భూమిపూజ చేశారు. భక్తుల కోసం కొత్త వసతి గదులు, అన్నదాన సత్రం, లడ్డూ పోటు నిర్మాణాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా గత ప్రభుత్వ అవినీతిపై మంత్రి మండిపడ్డారు.

AndhraPravasi News Desk 2 min read
Yaganti Temple: యాగంటి క్షేత్ర అభివృద్ధికి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి శ్రీకారం... రూ. 5.08 కోట్లతో నూతన పనులకు భూమిపూజ.!

Yaganti Temple: ప్రముఖ శైవ పుణ్యక్షేత్రమైన యాగంటి ఉమామహేశ్వర స్వామి ఆలయ రూపురేఖలు మార్చేందుకు కూటమి ప్రభుత్వం నడుం బిగించింది. భక్తుల సౌకర్యార్థం సుమారు రూ. 5.08 కోట్ల భారీ వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆదివారం ఘనంగా శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన శిలాఫలకాలను ఆయన ఆవిష్కరించారు.

భక్తుల కోసం అత్యాధునిక వసతులు

యాత్రికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈ నిధులతో ఆలయ పరిధిలో మౌలిక సదుపాయాలను మెరుగుపరచనున్నారు. ఇందులో భాగంగా రూ. 3.30 కోట్ల వ్యయంతో 16 గదులు, రెండు పెద్ద డార్మిటరీలు, 8 వాణిజ్య షాపుల నిర్మాణానికి మంత్రి భూమిపూజ చేశారు. అలాగే భక్తులకు నాణ్యమైన భోజనం అందించేందుకు రూ. 1.25 కోట్లతో నిత్య అన్నదాన సత్రాన్ని, రూ. 29 లక్షలతో ఆధునిక లడ్డూ తయారీ కేంద్రం (పోటు)ను నిర్మించనున్నారు. ఎండ, వానల నుంచి భక్తులకు రక్షణగా రూ. 24 లక్షలతో క్యూలైన్ షెడ్లను కూడా ఏర్పాటు చేయనున్నారు.

గత ప్రభుత్వంపై మంత్రి నిప్పులు

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. గత మూడేళ్లలో (2021-24) ఆలయానికి రూ. 7 కోట్ల ఆదాయం వచ్చినా, ఆ నిధులు ఎటు పోయాయో లెక్కల్లేవని ఆయన ఆరోపించారు. కానీ, తమ ప్రభుత్వం వచ్చిన ఏడాది కాలంలోనే (2025 ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు) రూ. 5.57 కోట్ల ఆదాయం రాగా, ఆ సొమ్మును భక్తుల సౌకర్యాల కోసమే ఖర్చు చేస్తున్నామని స్పష్టం చేశారు. దేవుడి సొమ్మును దుర్వినియోగం చేసిన వారు భగవంతుడికి సమాధానం చెప్పుకోక తప్పదని హెచ్చరించారు.

అభివృద్ధిని అడ్డుకోవడం దుర్మార్గం

ఆలయానికి వచ్చే భక్తుల వాహనాల కోసం 10 ఎకరాల్లో పార్కింగ్ స్థలాన్ని ఏర్పాటు చేస్తుంటే, దానిపై కూడా వైసీపీ నేతలు కోర్టులో పిటిషన్లు వేసి అడ్డుకోవడం దారుణమని మంత్రి మండిపడ్డారు. అటవీ భూములను ఆక్రమిస్తున్నారంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ప్రజలకు మంచి పనులు చేస్తుంటే విమర్శించడం సిగ్గుచేటని దుయ్యబట్టారు. అధికారులను బెదిరించడం మానుకోవాలని, నిజంగా సేవ చేయాలనే తపన ఉంటే సొంత నిధులతో ప్రజలకు సాయం చేయాలని ఆయన సూచించారు.

రాజకీయాలకు తావులేని ఆధ్యాత్మిక కేంద్రం

యాగంటి క్షేత్రంలో తాము ఎప్పుడూ ఆధిపత్యం కోసం ప్రయత్నించలేదని, కేవలం భక్తుల సేవకే ప్రాధాన్యత ఇస్తామని మంత్రి బీసీ తెలిపారు. దేవాలయం వంటి పవిత్ర స్థలాల్లో రాజకీయాలు చేయడం తమకు ఇష్టం లేదని, కేవలం అభివృద్ధిపైనే తమ దృష్టి ఉంటుందని చెప్పారు. యుద్ధ ప్రాతిపదికన ఈ నిర్మాణ పనులన్నీ పూర్తి చేసి, అతి త్వరలోనే భక్తులకు అందుబాటులోకి తీసుకొస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, కూటమి నాయకులు  పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

Be the first to react

More Coverage

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ఉపయోగించుకుని రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీశారని మాజీ ముఖ్యమ…

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: రాజధాని అమరావతిలో జరుగుతున్న అభివృద్ధి పనులను రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి…

Delimitation: ఏపీలో మారనున్న రాజకీయ ముఖచిత్రం... మూడు ముక్కలుగా...డీలిమిటేషన్ తో పెరగనున్న ఎంపీ స్థానాలు!

Delimitation: ఏపీలో మారనున్న రాజకీయ ముఖచిత్రం... మూడు ముక్కలుగా...డీలిమిటేషన్ తో పెరగనున్న ఎంపీ స్థానాలు!

Delimitation: కేంద్ర ప్రభుత్వం జూలైలో నిర్వహించబోయే ప్రత్యేక సమావేశాల్లో డీలిమిటేషన్, జమిలి ఎన్నికల…