Assembly seats: అసెంబ్లీ స్థానాల పెంపుపై క్లారిటీ అప్పుడే .. రాజకీయ పార్టీల్లో టెన్షన్.! ఏపీలో 225, తెలంగాణలో 153.. Ambati Rambabu: అంబటి రాంబాబుకు మరో షాక్.. మరో కేసు నమోదు! ఈసారి పక్కాగా జైలుకేనా..? Qatar: ఖతార్‌లో మిన్నంటిన బాబు జన్మదిన వేడుకలు.. భారీగా తరలివచ్చిన ఎన్‌ఆర్‌ఐలు! Chandrababu Campaign: తమిళనాడులో రెండో రోజు చంద్రబాబు ప్రచారం.. నేడు విరుధునగర్ జిల్లాలో పర్యటన! AP Government: గ్రామీణ పేదలకు వరంగా మారిన ఉపాధి హామీ.. భారీగా నిధులు విడుదల! AP Employees: ఏపీలో ఉద్యోగుల స్థానికతపై కీలక నిర్ణయం.. అమల్లోకి కొత్త నిబంధనలు! Praja Vedika: నేడు (21/04) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Green Field Highway: తెలుగు రాష్ట్రాల మధ్య కొత్త గ్రీన్‌ఫీల్డ్‌ హైవే షురూ.... దశాబ్దాల కల! 4 గంటల సమయం ఆదా.... Chandrababu: పుట్టినరోజు నాడు కీలకమైన ఫైలుపై చంద్రబాబు సంతకం! రూ.56.39 కోట్ల - 7,074 మంది లబ్ధిదారులకు! Praja Vedika: వైసీపీ నాయకుల కనుసన్నల్లో రెవెన్యూ అధికారుల అత్యుత్సాహం.. జేసీబీలతో ఇంటి పునాదుల ధ్వంసం! Assembly seats: అసెంబ్లీ స్థానాల పెంపుపై క్లారిటీ అప్పుడే .. రాజకీయ పార్టీల్లో టెన్షన్.! ఏపీలో 225, తెలంగాణలో 153.. Ambati Rambabu: అంబటి రాంబాబుకు మరో షాక్.. మరో కేసు నమోదు! ఈసారి పక్కాగా జైలుకేనా..? Qatar: ఖతార్‌లో మిన్నంటిన బాబు జన్మదిన వేడుకలు.. భారీగా తరలివచ్చిన ఎన్‌ఆర్‌ఐలు! Chandrababu Campaign: తమిళనాడులో రెండో రోజు చంద్రబాబు ప్రచారం.. నేడు విరుధునగర్ జిల్లాలో పర్యటన! AP Government: గ్రామీణ పేదలకు వరంగా మారిన ఉపాధి హామీ.. భారీగా నిధులు విడుదల! AP Employees: ఏపీలో ఉద్యోగుల స్థానికతపై కీలక నిర్ణయం.. అమల్లోకి కొత్త నిబంధనలు! Praja Vedika: నేడు (21/04) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Green Field Highway: తెలుగు రాష్ట్రాల మధ్య కొత్త గ్రీన్‌ఫీల్డ్‌ హైవే షురూ.... దశాబ్దాల కల! 4 గంటల సమయం ఆదా.... Chandrababu: పుట్టినరోజు నాడు కీలకమైన ఫైలుపై చంద్రబాబు సంతకం! రూ.56.39 కోట్ల - 7,074 మంది లబ్ధిదారులకు! Praja Vedika: వైసీపీ నాయకుల కనుసన్నల్లో రెవెన్యూ అధికారుల అత్యుత్సాహం.. జేసీబీలతో ఇంటి పునాదుల ధ్వంసం!

Vande Mataram Protocol: వందేమాతరం వచ్చినప్పుడు ఇక ఆ పని తప్పనిసరి.. అధికారిక కార్యక్రమాలకు కేంద్రం కొత్త రూల్స్!

Vande Mataram: అధికారిక కార్యక్రమాలు, జెండా ఎగురవేతలు, రాష్ట్రపతి, గవర్నర్ ప్రసంగాల సమయంలో వందేమాతరం పూర్తి వెర్షన్ పాడటం తప్పనిసరి చేస్తూ కేంద్రం కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. వందేమాతరం ప్లే అయితే లేచి నిలబడాలి.

Published : 2026-02-13 16:53:00

Vande Mataram Protocol: జెండా వేడుకల్లో వందేమాతరం పూర్తి వెర్షన్ పాడాల్సిందే.. 

ముందుగా వందేమాతరం, తర్వాత జనగణమన.. కేంద్రం మార్గదర్శకాలు

వందేమాతరం ప్లే అయితే లేచి నిలబడాలి.. కొత్త నిబంధనలు అమల్లోకి!

కేంద్ర ప్రభుత్వం ‘వందేమాతరం’ (Vande Mataram Protocol) గీతంపై కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది. ఇకపై అధికారిక కార్యక్రమాలు, జాతీయ పర్వదినాలు, జెండా ఎగురవేత కార్యక్రమాలు, అలాగే రాష్ట్రపతి లేదా గవర్నర్ ప్రసంగాల వంటి ప్రాధాన్యమైన ఈవెంట్లలో ‘వందేమాతరం’ పూర్తి వెర్షన్‌ను పాడటం తప్పనిసరిగా ఉండాలని స్పష్టం చేసింది. దేశభక్తి భావనను బలోపేతం చేయడం, జాతీయ గౌరవాన్ని మరింత పెంపొందించడం లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఒకే కార్యక్రమంలో ‘వందేమాతరం’తో పాటు జాతీయ గీతం ‘జనగణమన’ను పాడాల్సి వస్తే ముందుగా ‘వందేమాతరం’నే ఆలపించాలని కొత్త నిబంధనల్లో పేర్కొన్నారు. ఇది ప్లే అవుతున్న సమయంలో అక్కడ ఉన్న వారందరూ లేచి నిలబడటం తప్పనిసరి అని స్పష్టం చేశారు.

‘వందేమాతరం’కు భారత స్వాతంత్ర్య ఉద్యమంలో విశిష్ట స్థానం ఉంది. ప్రముఖ రచయిత బంకిమ్ చంద్ర చట్టోపాధ్యాయ రచించిన ‘ఆనందమఠం’ నవలలో భాగంగా ఈ గీతం వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత ఇది స్వాతంత్ర్య సమరయోధులకు ప్రేరణగా నిలిచింది. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా జరిగిన అనేక ఉద్యమాల్లో ‘వందేమాతరం’ నినాదం ప్రతిధ్వనించింది. ప్రస్తుతం దీనిని జాతీయ గీతంగా కాకుండా జాతీయ గీతిక (National Song)గా గుర్తింపు ఇచ్చారు, అయితే ప్రజల హృదయాల్లో దీనికి ప్రత్యేక స్థానం ఉంది.

కేంద్రం జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం, అధికారిక సభలు, ప్రభుత్వ కార్యాక్రమాలు, విద్యాసంస్థల ముఖ్య వేడుకలు వంటి సందర్భాల్లో ‘వందేమాతరం’ పూర్తి వెర్షన్ వినిపించాలి. ఆ సమయంలో అక్కడున్న ప్రతి ఒక్కరూ గౌరవ సూచకంగా లేచి నిలబడాలి. అయితే సినిమా థియేటర్లలో చిత్ర ప్రదర్శన మధ్యలో లేదా డాక్యుమెంటరీలు, న్యూస్రోల్స్ మధ్యలో ‘వందేమాతరం’ వినిపిస్తే ప్రేక్షకులు తప్పనిసరిగా నిలబడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఇది ప్రజలకు అసౌకర్యం కలగకుండా తీసుకున్న నిర్ణయంగా భావిస్తున్నారు.

ఈ కొత్త మార్గదర్శకాలపై వివిధ వర్గాల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు దేశభక్తి భావన పెంపొందించేందుకు ఇది సరైన నిర్ణయమని అభిప్రాయపడుతుండగా, మరికొందరు వ్యక్తిగత స్వేచ్ఛ, ప్రాక్టికల్ అంశాలపై చర్చ అవసరమని అంటున్నారు. అయినప్పటికీ, అధికారిక కార్యక్రమాల్లో జాతీయ గీతాలు, గీతికలకు గౌరవం ఇవ్వడం ప్రతి పౌరుడి బాధ్యత అని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. మొత్తానికి ‘వందేమాతరం’పై కొత్త నిబంధనలు దేశవ్యాప్తంగా అమలులోకి రానుండటంతో భవిష్యత్తులో జరిగే అధికారిక ఈవెంట్లలో ఈ మార్పులు స్పష్టంగా కనిపించనున్నాయి.

Spotlight

Read More →