Assembly seats: అసెంబ్లీ స్థానాల పెంపుపై క్లారిటీ అప్పుడే .. రాజకీయ పార్టీల్లో టెన్షన్.! ఏపీలో 225, తెలంగాణలో 153.. Ambati Rambabu: అంబటి రాంబాబుకు మరో షాక్.. మరో కేసు నమోదు! ఈసారి పక్కాగా జైలుకేనా..? Qatar: ఖతార్‌లో మిన్నంటిన బాబు జన్మదిన వేడుకలు.. భారీగా తరలివచ్చిన ఎన్‌ఆర్‌ఐలు! Chandrababu Campaign: తమిళనాడులో రెండో రోజు చంద్రబాబు ప్రచారం.. నేడు విరుధునగర్ జిల్లాలో పర్యటన! AP Government: గ్రామీణ పేదలకు వరంగా మారిన ఉపాధి హామీ.. భారీగా నిధులు విడుదల! AP Employees: ఏపీలో ఉద్యోగుల స్థానికతపై కీలక నిర్ణయం.. అమల్లోకి కొత్త నిబంధనలు! Praja Vedika: నేడు (21/04) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Green Field Highway: తెలుగు రాష్ట్రాల మధ్య కొత్త గ్రీన్‌ఫీల్డ్‌ హైవే షురూ.... దశాబ్దాల కల! 4 గంటల సమయం ఆదా.... Chandrababu: పుట్టినరోజు నాడు కీలకమైన ఫైలుపై చంద్రబాబు సంతకం! రూ.56.39 కోట్ల - 7,074 మంది లబ్ధిదారులకు! Praja Vedika: వైసీపీ నాయకుల కనుసన్నల్లో రెవెన్యూ అధికారుల అత్యుత్సాహం.. జేసీబీలతో ఇంటి పునాదుల ధ్వంసం! Assembly seats: అసెంబ్లీ స్థానాల పెంపుపై క్లారిటీ అప్పుడే .. రాజకీయ పార్టీల్లో టెన్షన్.! ఏపీలో 225, తెలంగాణలో 153.. Ambati Rambabu: అంబటి రాంబాబుకు మరో షాక్.. మరో కేసు నమోదు! ఈసారి పక్కాగా జైలుకేనా..? Qatar: ఖతార్‌లో మిన్నంటిన బాబు జన్మదిన వేడుకలు.. భారీగా తరలివచ్చిన ఎన్‌ఆర్‌ఐలు! Chandrababu Campaign: తమిళనాడులో రెండో రోజు చంద్రబాబు ప్రచారం.. నేడు విరుధునగర్ జిల్లాలో పర్యటన! AP Government: గ్రామీణ పేదలకు వరంగా మారిన ఉపాధి హామీ.. భారీగా నిధులు విడుదల! AP Employees: ఏపీలో ఉద్యోగుల స్థానికతపై కీలక నిర్ణయం.. అమల్లోకి కొత్త నిబంధనలు! Praja Vedika: నేడు (21/04) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Green Field Highway: తెలుగు రాష్ట్రాల మధ్య కొత్త గ్రీన్‌ఫీల్డ్‌ హైవే షురూ.... దశాబ్దాల కల! 4 గంటల సమయం ఆదా.... Chandrababu: పుట్టినరోజు నాడు కీలకమైన ఫైలుపై చంద్రబాబు సంతకం! రూ.56.39 కోట్ల - 7,074 మంది లబ్ధిదారులకు! Praja Vedika: వైసీపీ నాయకుల కనుసన్నల్లో రెవెన్యూ అధికారుల అత్యుత్సాహం.. జేసీబీలతో ఇంటి పునాదుల ధ్వంసం!

Irrigation Projects 2026: సీమకు జగన్ చేసిన అన్యాయం అంతా ఇంతా కాదు.. మంత్రి నిమ్మల ఘాటు విమర్శలు!

Irrigation Projects 2026: నేరడి బ్యారేజీ, గుండ్రేవుల ప్రాజెక్టుల తాజా పరిస్థితిని మంత్రి నిమ్మల రామానాయుడు అసెంబ్లీలో వివరించారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల పెరిగిన అంచనా వ్యయం, సీమ ప్రాజెక్టుల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల గురించి తెలిపారు.

Published : 2026-02-13 15:14:00

జగన్ "సీమ ద్రోహి"

వంశధార, తుంగభద్ర ప్రాజెక్టుల పునరుద్ధరణే లక్ష్యం…

గెజిట్ రాగానే నేరడి పనులు షురూ..

ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో సాగునీటి ప్రాజెక్టులపై ఆసక్తికర చర్చ జరిగింది. ఉత్తరాంధ్రకు కీలకమైన నేరడి బ్యారేజీ, రాయలసీమకు వరప్రదాయని అయిన గుండ్రేవుల ప్రాజెక్టుల పరిస్థితిపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వివరంగా సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా గత వైకాపా ప్రభుత్వంపై ఆయన తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా రాయలసీమ బిడ్డనని చెప్పుకున్న జగన్ మోహన్ రెడ్డి, ఆ ప్రాంత ప్రాజెక్టులను పట్టించుకోకుండా సీమ ద్రోహిగా మిగిలిపోయారని మంత్రి మండిపడ్డారు.

శ్రీకాకుళం జిల్లా ప్రజల కల అయిన వంశధార నది నీటిని వాడుకోవడంపై మంత్రి కీలక విషయాలు చెప్పారు. నేరడి బ్యారేజీ ద్వారా 34 టీఎంసీల నీటిని వినియోగించుకోవాలని ప్రభుత్వం పట్టుదలగా ఉందని తెలిపారు. దీనికి సంబంధించి ఒడిశా రాష్ట్రంతో ఉన్న గొడవలను సాధ్యమైనంత త్వరగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పటికే కేంద్ర జలశక్తి మంత్రిని కలిసి చర్చించారని, ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పును వెంటనే గెజిట్‌లో ప్రచురించేలా చర్యలు తీసుకోవాలని కోరినట్లు మంత్రి వివరించారు. గెజిట్ నోటిఫికేషన్ రాగానే పనులు స్పీడ్ అందుకుంటాయని చెప్పారు.

ఇక రాయలసీమ విషయానికి వస్తే కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతాలకు  కేసీ కెనాల్‌కు సాగునీరు అందించే గుండ్రేవుల రిజర్వాయర్ గురించి మంత్రి ప్రస్తావించారు. తుంగభద్ర నదిపై 20 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో ఈ ప్రాజెక్టును నిర్మించబోతున్నామని చెప్పారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలోనే రూ. 2890 కోట్లతో దీనికి అప్పట్లో పచ్చజెండా ఊపామని గుర్తు చేశారు. అయితే పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక, తెలంగాణలను ఒప్పించి పనులు ముందుకు తీసుకెళ్లడంలో గత ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మంత్రి విమర్శించారు. ఇప్పుడు తమ కూటమి ప్రభుత్వం ఆ రాష్ట్రాలతో చర్చిస్తోందని తెలిపారు.

మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ.. లోకేష్ గారు తన యువగళం పాదయాత్రలో రాయలసీమ ప్రజల కష్టాలను కళ్లారా చూశారని అందుకే ఈ ప్రాజెక్టును ఎలాగైనా పూర్తి చేయాలని ఆయన ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని చెప్పారు. కానీ గత ఐదేళ్లలో జగన్ ప్రభుత్వం గుండ్రేవుల ప్రాజెక్టుకు ఒక్క రూపాయి కూడా కేటాయించలేదని ఎద్దేవా చేశారు. దీనివల్ల ప్రాజెక్టు వ్యయం అప్పట్లో ఉన్న రూ. 2890 కోట్ల నుండి ఇప్పుడు రూ. 4530 కోట్లకు పెరిగిపోయిందని, ఈ భారమంతా ప్రజలపైనే పడుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాజెక్టులను రద్దు చేసి జగన్ చరిత్రలో చెడ్డ పేరు తెచ్చుకున్నారని దుయ్యబట్టారు.

చివరగా కూటమి ప్రభుత్వం రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులన్నింటినీ పూర్తి చేసేందుకు చిత్తశుద్ధితో పని చేస్తోందని మంత్రి స్పష్టం చేశారు. రైతుల ప్రయోజనాలే తమకు ముఖ్యమని, ఉత్తరాంధ్ర నుండి రాయలసీమ వరకు పెండింగ్‌లో ఉన్న ప్రతి ప్రాజెక్టును పూర్తి చేసి తీరుతామని సభ సాక్షిగా హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతి నెలా ప్రాజెక్టుల పురోగతిని పర్యవేక్షిస్తున్నారని అతి త్వరలోనే నేరడి, గుండ్రేవుల పనులు పట్టాలెక్కుతాయని మంత్రి ధీమా వ్యక్తం చేశారు.

Spotlight

Read More →