LIVE
Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  •  AP CRDA: 0.4 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రూపుదిద్దుకుంటున్న నీరుకొండ రిజర్వాయర్...  •  Vishaka: ప్రభుత్వ స్కూల్‌గా మారిన విశాఖ విమల విద్యాలయం.. కలెక్టర్, ఎమ్మెల్యే పల్లా చేతుల మీదుగా ప్రారంభం!  •  6G Network: భారత్‌లో 6G సంచలనం.. టెలికాం రంగం రూపురేఖలు మార్చబోతున్న కేంద్ర ప్రభుత్వ మాస్టర్ ప్లాన్!  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
Politics

Chandrababu: కొనసాగుతున్న 6వ జిల్లా కలెక్టర్ల సమావేశం.. వివిధ అంశాలపై లక్ష్యాలను నిర్దేశించిన సీఎం!

Chandrababu Meeting With District Collectors: సచివాలయంలోని ఐదో బ్లాకులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కలెక్టర్ల సమావేశం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధిని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని అధికారులను ఆయన ఆదేశించారు.

AndhraPravasi News Desk 2 min read
Chandrababu: కొనసాగుతున్న 6వ జిల్లా కలెక్టర్ల సమావేశం.. వివిధ అంశాలపై లక్ష్యాలను నిర్దేశించిన సీఎం!
  • ప్రభుత్వ స్కీంల పట్ల ప్రజల్లో అవగాహన పెంచాలని సీఎం చంద్రబాబు సూచన..
     
  • ఇండియన్ బిజినెస్ స్కూల్ తరహాలో..

Chandrababu Meeting With District Collectors: సచివాలయంలోని ఐదో బ్లాకులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కలెక్టర్ల సమావేశం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధిని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని అధికారులను ఆయన ఆదేశించారు. ప్రభుత్వ పథకాలపై ప్రజల్లో అవగాహన పెంచడం ద్వారానే ఆశించిన ఫలితాలు అందుతాయని ఆయన స్పష్టం చేశారు. కేవలం కార్యాలయాల్లో కూర్చుని ఫైళ్లు రాసే పాత పద్ధతులకు స్వస్తి పలికి, వర్చువల్ పనివిధానాన్ని అమల్లోకి తెచ్చామని సీఎం గుర్తు చేశారు. గత 20 నెలల్లో తీసుకొచ్చిన కీలక పాలనా మార్పుల వల్ల ప్రభుత్వ యంత్రాంగంలో జవాబుదారీతనం పెరిగిందన్నారు. "ఉన్న వనరులతోనే సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనను సమతుల్యం (Balance) చేస్తూ ముందుకు వెళ్తున్నాం. ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించుకోవడం వల్ల లక్ష్యాలను సాధించడం సులభమవుతుంది."

రైతులకు సాంకేతికతను, ఆధునిక యాజమాన్య పద్ధతులను దగ్గర చేసేందుకు 'ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్' వ్యవస్థను ఏర్పాటు చేయబోతున్నట్లు సీఎం ప్రకటించారు. ఇండియన్ బిజినెస్ స్కూల్ (ISB) తరహాలో వ్యవసాయం కోసం ఇది అత్యున్నత సంస్థగా ఉంటుంది. ఐటీ, ఏఐ (AI), క్వాంటం ల్యాబ్స్ తరహాలో వ్యవసాయ రంగంలో బలమైన వ్యవస్థను నిర్మిస్తాం. మైక్రో గ్రిడ్ల ఏర్పాటు ద్వారా విద్యుత్ వినియోగాన్ని క్రమబద్ధీకరించాలి. వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తూ మార్చి 13న అన్నదాత సుఖీభవ పథకం మూడో విడత నిధులను విడుదల చేయనున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. కేంద్రం ఇచ్చే నిధులకు రాష్ట్ర ప్రభుత్వం కూడా తోడుగా నిలిచి, నేరుగా రైతుల ఖాతాల్లోనే నగదు జమ చేస్తుంది.

ఈ కార్యక్రమాన్ని మరింత సమర్థవంతంగా క్షేత్రస్థాయికి తీసుకెళ్లాలి. ఉగాది పర్వదినం నాటికి రాష్ట్రవ్యాప్తంగా 2 లక్షల 50 వేల ఇళ్లను లబ్ధిదారులతో గృహప్రవేశం చేయించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. గత ప్రభుత్వంలో 'ట్రూ అప్' పేరిట ప్రజలపై విద్యుత్ భారం వేస్తే, ప్రస్తుత ప్రభుత్వం 'ట్రూ డౌన్' విధానాన్ని తీసుకొచ్చిందని సీఎం వివరించారు. ఈ ఏడాది విద్యుత్ కొనుగోలు ధరను 39 పైసల మేర తగ్గించి సామాన్యులకు ఉపశమనం కలిగిస్తున్నట్లు తెలిపారు. అలాగే, 'ఇంద్రధనస్సు' పథకం ద్వారా దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు ప్రకటించారు.

2047 నాటికి స్వర్ణాంధ్రను సాధించాలనే విజన్‌తో పది సూత్రాల అమలును ప్రభుత్వం చేపట్టింది. ఈ పది సూత్రాలను కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పక్కాగా అమలు చేస్తేనే సుపరిపాలన సాధ్యమవుతుందని సీఎం సూచించారు. ఈ ఏడాది కోసం ప్రత్యేకంగా 15 పాయింట్లను (15 Points) లక్ష్యంగా పెట్టుకున్నాం. సూపర్ సిక్స్ పథకాల్లో ఎక్కడా చిన్న పొరపాటు కూడా జరగకుండా, పూర్తి పారదర్శకతతో అమలు చేయాలి.

Be the first to react

More Coverage

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ఉపయోగించుకుని రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీశారని మాజీ ముఖ్యమ…

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: రాజధాని అమరావతిలో జరుగుతున్న అభివృద్ధి పనులను రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి…

Delimitation: ఏపీలో మారనున్న రాజకీయ ముఖచిత్రం... మూడు ముక్కలుగా...డీలిమిటేషన్ తో పెరగనున్న ఎంపీ స్థానాలు!

Delimitation: ఏపీలో మారనున్న రాజకీయ ముఖచిత్రం... మూడు ముక్కలుగా...డీలిమిటేషన్ తో పెరగనున్న ఎంపీ స్థానాలు!

Delimitation: కేంద్ర ప్రభుత్వం జూలైలో నిర్వహించబోయే ప్రత్యేక సమావేశాల్లో డీలిమిటేషన్, జమిలి ఎన్నికల…