LIVE
Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  •  AP CRDA: 0.4 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రూపుదిద్దుకుంటున్న నీరుకొండ రిజర్వాయర్...  •  Vishaka: ప్రభుత్వ స్కూల్‌గా మారిన విశాఖ విమల విద్యాలయం.. కలెక్టర్, ఎమ్మెల్యే పల్లా చేతుల మీదుగా ప్రారంభం!  •  6G Network: భారత్‌లో 6G సంచలనం.. టెలికాం రంగం రూపురేఖలు మార్చబోతున్న కేంద్ర ప్రభుత్వ మాస్టర్ ప్లాన్!  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
Politics

TDP: టీడీపీ కొత్త కమిటీలు విడుదల! నారా లోకేష్‌కు కీలక బాధ్యతలు..

TDP: తెలుగుదేశం పార్టీ (టీడీపీ) తన పొలిట్ బ్యూరో, జాతీయ, రాష్ట్ర కమిటీలను ప్రకటిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నూతన కమిటీల ద్వారా పార్టీకి కొత్త దిశ, కొత్త ఉత్సాహం తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది.

AndhraPravasi News Desk 2 min read
TDP: టీడీపీ కొత్త కమిటీలు విడుదల! నారా లోకేష్‌కు కీలక బాధ్యతలు..

పొలిట్ బ్యూరో, జాతీయ, రాష్ట్ర కమిటీలను ప్రకటించిన టీడీపీ..

పార్టీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా మంత్రి నారా లోకేష్..

తెలుగుదేశం పార్టీ (టీడీపీ) తన పొలిట్ బ్యూరో, జాతీయ, రాష్ట్ర కమిటీలను ప్రకటిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నూతన కమిటీల ద్వారా పార్టీకి కొత్త దిశ, కొత్త ఉత్సాహం తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది.

ఈ క్రమంలో మంత్రి నారా లోకేష్ ను పార్టీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించారు. అలాగే పల్లా శ్రీనివాస రావు ను టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ప్రకటించారు.

పార్టీ కమిటీల కూర్పులో సామాజిక సమతుల్యతకు ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చినట్లు టీడీపీ వెల్లడించింది. విధేయత, కష్టపడే స్వభావం, అనుభవం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని పదవులు కేటాయించినట్లు తెలిపింది.

కొత్తగా ప్రకటించిన కమిటీలలో పొలిట్ బ్యూరోలో 29 మంది సభ్యులు, జాతీయ కమిటీలో 31 మంది, రాష్ట్ర కమిటీలో మొత్తం 185 మంది సభ్యులు ఉన్నారు.

ఇందులో రాష్ట్ర కమిటీలో 50 మంది మహిళలకు చోటు కల్పించడం గమనార్హం. మహిళల భాగస్వామ్యాన్ని పెంచే దిశగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.

ఈ కొత్త కమిటీలతో పార్టీని మరింత బలోపేతం చేసి, గ్రామస్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు కార్యాచరణను వేగవంతం చేయాలని టీడీపీ భావిస్తోంది. అనుభవజ్ఞులు, యువ నాయకత్వం కలిసి పనిచేస్తే పార్టీకి మరింత శక్తి వస్తుందని నాయకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

ఈ మార్పులతో టీడీపీలో కొత్త ఉత్సాహం నెలకొనగా, రాబోయే రోజుల్లో పార్టీ కార్యకలాపాలు మరింత చురుకుగా సాగనున్నాయని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.

పొలిట్ బ్యూరో వివరాలు:
నారా చంద్రబాబు నాయుడు - కుప్పం, కింజరాపు వచ్చు నాయుడు - టెక్కెల్లి, గుమ్మడి సంధ్యారాణి - సాలూరు (ఎస్టి), శ్రీదేవి గంట్యాడ - గజపతినగరం, వంగలపూడి అనిత - పాయకరావుపేట (ఎస్సీ), యనమల రామకృష్ణుడు - తుని, గోరంట్ల బుచ్చయ్య చౌదరి - రాజమండ్రి రూరల్, జ్యోతుల వెంకట అప్పారావు (నెహ్రూ) - జగ్గంపేట, పితాని సత్యనారాయణ - ఆచంట, నిమ్మల రామానాయుడు - పాలకొల్లు, మహమ్మద్ షరీఫ్ - నర్సాపురం, మంతెన రామరాజు - ఉండి, కొల్లు రవీంద్ర - మచిలీపట్నం, వర్ల రామయ్య - విజయవాడ పశ్చిమ, శ్రీరామ్ రాజగోపాల్ (తాతయ్య) - జగ్గయ్యపేట, గుత్తికొండ ధనుంజయ్ - మంగళగిరి, నందమూరి బాలకృష్ణ - హిందూపురం, నక్క ఆనంద్ బాబు - వేమూరు (ఎస్సీ), అనగాని సత్యప్రసాద్ - రేపల్లె, పిడుగురాళ్ల మాధవి - గుంటూరు పశ్చిమ, దగ్గుమళ్ళ ప్రసాదరావు - పర్చూరు, వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి - కోవూరు, బీసీ జనార్దన్ రెడ్డి - బనగానపల్లె, కాలవ శ్రీనివాసులు - రాయదుర్గం, అరవింద్ కుమార్ గౌడ్ - నాంపల్లి, బక్కిన నరసింహులు - షాద్ నగర్

Be the first to react

More Coverage

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ఉపయోగించుకుని రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీశారని మాజీ ముఖ్యమ…

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: రాజధాని అమరావతిలో జరుగుతున్న అభివృద్ధి పనులను రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి…

Delimitation: ఏపీలో మారనున్న రాజకీయ ముఖచిత్రం... మూడు ముక్కలుగా...డీలిమిటేషన్ తో పెరగనున్న ఎంపీ స్థానాలు!

Delimitation: ఏపీలో మారనున్న రాజకీయ ముఖచిత్రం... మూడు ముక్కలుగా...డీలిమిటేషన్ తో పెరగనున్న ఎంపీ స్థానాలు!

Delimitation: కేంద్ర ప్రభుత్వం జూలైలో నిర్వహించబోయే ప్రత్యేక సమావేశాల్లో డీలిమిటేషన్, జమిలి ఎన్నికల…