LIVE
Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  •  AP CRDA: 0.4 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రూపుదిద్దుకుంటున్న నీరుకొండ రిజర్వాయర్...  •  Vishaka: ప్రభుత్వ స్కూల్‌గా మారిన విశాఖ విమల విద్యాలయం.. కలెక్టర్, ఎమ్మెల్యే పల్లా చేతుల మీదుగా ప్రారంభం!  •  6G Network: భారత్‌లో 6G సంచలనం.. టెలికాం రంగం రూపురేఖలు మార్చబోతున్న కేంద్ర ప్రభుత్వ మాస్టర్ ప్లాన్!  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
Politics

Chandrababu: సింగపూర్ మాస్టర్ ప్లాన్.. 9 థీమ్ సిటీలు అక్కడే.. గంటలోనే రూ. 2 వేల కోట్ల.! అమరావతిపై ప్రపంచవ్యాప్త నమ్మకానికి ఇదే నిదర్శనం!

Chandrababu: ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి పార్లమెంటు ఉభయ సభలు చట్టబద్ధత కల్పించడంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మీడియా సమావేశంలో హర్షం వ్యక్తం చేస్తూ గత ఐదేళ్ల విధ్వంసం నుంచి అమరావతి విముక్తి పొందిందని ప్రకటించారు.

AndhraPravasi News Desk 2 min read
Chandrababu: సింగపూర్ మాస్టర్ ప్లాన్.. 9 థీమ్ సిటీలు అక్కడే.. గంటలోనే రూ. 2 వేల కోట్ల.! అమరావతిపై ప్రపంచవ్యాప్త నమ్మకానికి ఇదే నిదర్శనం!
  • Politics: దేశానికే గర్వకారణంగా అమరావతి: ప్రధాని మోదీ సహకారంతో పనులు రీస్టార్ట్ చేశామన్న సీఎం..
     
  • 50 పార్టీల మద్దతు.. ఒక్క వైసీపీ వ్యతిరేకత: రాష్ట్ర ప్రయోజనాలకు ద్రోహం చేశారని సీఎం మండిపాటు…

Chandrababu: ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి పార్లమెంటు ఉభయ సభలు చట్టబద్ధత కల్పించడంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మీడియా సమావేశంలో హర్షం వ్యక్తం చేస్తూ గత ఐదేళ్ల విధ్వంసం నుంచి అమరావతి విముక్తి పొందిందని ప్రకటించారు. పార్లమెంటులో ఉన్న 50 రాజకీయ పార్టీలలో ఒక్క వైసీపీ మినహా మిగిలిన అన్ని పార్టీలు అమరావతికి మద్దతు పలకడం చారిత్రాత్మకమని, అయితే ఈ రాష్ట్రం నుంచి ఎంపీలుగా ఎన్నికై రాష్ట్ర ప్రయోజనాలకే ద్రోహం చేస్తూ బిల్లును వ్యతిరేకించిన వారిని చరిత్ర క్షమించదని ఆయన మండిపడ్డారు. ఈ విజయానికి సహకరించిన ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా సహా అన్ని పార్టీల నేతలకు ధన్యవాదాలు తెలిపిన సీఎం, రాష్ట్రపతి ఆమోదం తర్వాత ఇది పూర్తిస్థాయి చట్టంగా మారి గెజిట్ విడుదలవుతుందని, ఇకపై అమరావతిని ఎవరూ ఏమీ చేయలేరని ధీమా వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ రాజముద్రతో ఐదు కోట్ల ఆంధ్రుల ఆశయాలు నెరవేరాయని, అమరావతి దేశానికే ఒక 'ఫ్యూచర్ సిటీ'గా, గర్వకారణంగా నిలుస్తుందని ఆయన అభివర్ణించారు.

రాజధాని నిర్మాణ ప్రస్థానాన్ని గుర్తు చేసుకున్న చంద్రబాబు, సింగపూర్ ప్రభుత్వం ఒక్క పైసా తీసుకోకుండా అందించిన మాస్టర్ ప్లాన్ ప్రకారం అమరావతిని 9 నగరాల కలయికగా తీర్చిదిద్దుతున్నామని వివరించారు. తన పిలుపు అందుకోగానే 29 వేల మంది రైతులు తమ అత్యంత సారవంతమైన 34 వేల ఎకరాల భూములను స్వచ్ఛందంగా ఇచ్చారని, ల్యాండ్ పూలింగ్ ద్వారా వారిని అభివృద్ధిలో భాగస్వాములను చేశామని పేర్కొన్నారు. శంషాబాద్ విమానాశ్రయం కోసం భూములిచ్చిన వారు ఎలాగైతే కోటీశ్వరులయ్యారో, అమరావతి రైతులు కూడా అదే స్థాయిలో ప్రయోజనం పొందుతారని ఆకాంక్షించారు. కేవలం 11 నెలల రికార్డు సమయంలోనే సచివాలయం, అసెంబ్లీ భవనాలను నిర్మించామని, 2016 నుంచే పాలన సాగించినప్పటికీ గత పాలకులు దీనిని తాత్కాలికమని వక్రీకరించి అరాచకం సృష్టించారని ధ్వజమెత్తారు. నాడు ప్రధాని మోదీ తెచ్చిన యమునా జలాలు, పార్లమెంటు మట్టికి నేడు చట్టబద్ధతతో పరిపూర్ణత లభించిందని ఆయన వ్యాఖ్యానించారు.

గత ప్రభుత్వం అమరావతిపై చేసిన కుట్రలను చంద్రబాబు తీవ్రంగా ఎండగట్టారు. అమరావతిని ఎడారిగా, శ్మశానంగా అభివర్ణిస్తూ ప్రపంచ బ్యాంకుకు లేఖలు రాశారని, విట్, ఎస్ఆర్ఎం వంటి ప్రతిష్టాత్మక సంస్థలను వేధించారని ఆరోపించారు. మూడు రాజధానుల పేరుతో ప్రాంతాల మధ్య వివాదాలు సృష్టించారని, పవన్ కల్యాణ్ పర్యటనలను ముళ్లకంచెలతో అడ్డుకుని నియంతలా వ్యవహరించారని మండిపడ్డారు. రాజధాని కోసం పోరాడిన ఎస్సీ రైతులపైనే అట్రాసిటీ కేసులు పెట్టించారని, తనపై రాళ్లు వేయించారని గుర్తు చేసుకున్నారు. అయితే హైకోర్టు తీర్పులు, ప్రజలు ఇచ్చిన తీర్పుతో ఈ కుట్రలన్నీ పటాపంచలయ్యాయని, అప్రజాస్వామికంగా వ్యవహరించే వారిపై చట్టపరంగా కఠినంగా ముందుకు వెళ్తామని హెచ్చరించారు. విపరీత మనస్తత్వంతో ప్లాన్ ఏ, ప్లాన్ బీ అంటూ పలవరించే వారిని ప్రజలు ఇప్పటికే 'సైకోలు'గా గుర్తిస్తున్నారని ఎద్దేవా చేశారు.

భవిష్యత్తు ప్రణాళికలను వివరిస్తూ, ప్రస్తుతం అమరావతిలో రూ. 56 వేల కోట్ల విలువైన పనులు ముమ్మరంగా జరుగుతున్నాయని, 2028 నాటికల్లా ప్రధాన పనులన్నీ ఒక కొలిక్కి వస్తాయని ముఖ్యమంత్రి వెల్లడించారు. ప్రపంచ బ్యాంకు, ఏడీబీ, హడ్కో వంటి సంస్థల నుంచి ఆర్థిక తోడ్పాటు అందుతోందని, అమరావతి అభివృద్ధి ద్వారా వచ్చే ఆదాయంతోనే రాష్ట్రం ఆర్థికంగా నిలదొక్కుకుంటుందని స్పష్టం చేశారు. కేవలం అమరావతి మాత్రమే కాకుండా విశాఖపట్నం, తిరుపతి వంటి నగరాలను కూడా పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తున్నామని, గూగుల్, ఆర్సెలార్ మిట్టల్ వంటి సంస్థలు రాష్ట్రానికి వస్తున్నాయని తెలిపారు. పోలవరం డయాఫ్రామ్ వాల్ పూర్తి కావడం, అమరావతికి చట్టబద్ధత లభించడం రాష్ట్ర అభివృద్ధికి శుభసూచకమని, తెలుగు జాతి ఉనికిని కాపాడేందుకు ఎన్ని అడ్డంకులు ఎదురైనా రాజధాని నిర్మాణం ఆగిపోదని చంద్రబాబు నొక్కి చెప్పారు.

Be the first to react

More Coverage

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ఉపయోగించుకుని రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీశారని మాజీ ముఖ్యమ…

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: రాజధాని అమరావతిలో జరుగుతున్న అభివృద్ధి పనులను రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి…

Delimitation: ఏపీలో మారనున్న రాజకీయ ముఖచిత్రం... మూడు ముక్కలుగా...డీలిమిటేషన్ తో పెరగనున్న ఎంపీ స్థానాలు!

Delimitation: ఏపీలో మారనున్న రాజకీయ ముఖచిత్రం... మూడు ముక్కలుగా...డీలిమిటేషన్ తో పెరగనున్న ఎంపీ స్థానాలు!

Delimitation: కేంద్ర ప్రభుత్వం జూలైలో నిర్వహించబోయే ప్రత్యేక సమావేశాల్లో డీలిమిటేషన్, జమిలి ఎన్నికల…