LIVE
Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  •  AP CRDA: 0.4 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రూపుదిద్దుకుంటున్న నీరుకొండ రిజర్వాయర్...  •  Vishaka: ప్రభుత్వ స్కూల్‌గా మారిన విశాఖ విమల విద్యాలయం.. కలెక్టర్, ఎమ్మెల్యే పల్లా చేతుల మీదుగా ప్రారంభం!  •  6G Network: భారత్‌లో 6G సంచలనం.. టెలికాం రంగం రూపురేఖలు మార్చబోతున్న కేంద్ర ప్రభుత్వ మాస్టర్ ప్లాన్!  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
Politics

Ram Mohan: ఆ స్కూళ్లకు మహర్దశ.. మంత్రి రామ్మోహన్ చొరవతో రూ. 30 లక్షల నిధులు మంజూరు.!

Ram Mohan: కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ప్రత్యేక చొరవతో శ్రీకాకుళం జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారనున్నాయి. విద్యార్థులకు కేవలం పాఠ్యపుస్తకజ్ఞానమే కాకుండా, భవిష్యత్తు అవసరాలకు తగ్గట్టుగా అదనపు నైపుణ్యాలను అందించే లక్ష్యంతో రెండు పాఠశాలల్లో అ…

AndhraPravasi News Desk 2 min read
Ram Mohan: ఆ స్కూళ్లకు మహర్దశ.. మంత్రి రామ్మోహన్ చొరవతో రూ. 30 లక్షల నిధులు మంజూరు.!
  • సర్వ శిక్షా అభియాన్ పర్యవేక్షణలో పనులు: శ్రీకాకుళం ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చే దిశగా అడుగులు..
     
  • Politics: "నిమ్మడ జడ్పీ హైస్కూల్‌లో అత్యాధునిక ల్యాబ్స్": సొంత ఊరి బడిపై కేంద్ర మంత్రి మమకారం…

Ram Mohan: కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ప్రత్యేక చొరవతో శ్రీకాకుళం జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారనున్నాయి. విద్యార్థులకు కేవలం పాఠ్యపుస్తకజ్ఞానమే కాకుండా, భవిష్యత్తు అవసరాలకు తగ్గట్టుగా అదనపు నైపుణ్యాలను అందించే లక్ష్యంతో రెండు పాఠశాలల్లో అత్యాధునిక 'స్కిల్ ల్యాబ్స్' ఏర్పాటుకు మార్గం సుగమమైంది. ఇందుకోసం పియర్సన్ ఇండియా ఎడ్యుకేషన్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ తన కార్పొరేట్ సామాజిక బాధ్యత (CSR) నిధుల నుంచి రూ.30 లక్షల ఆర్థిక సహాయాన్ని మంజూరు చేసింది. గతంలో మంత్రి రామ్మోహన్ నాయుడు స్వయంగా సదరు సంస్థ ప్రతినిధులతో సమావేశమై, తన సొంత జిల్లాలోని విద్యా వ్యవస్థ బలోపేతానికి సహకరించాలని కోరిన నేపథ్యంలో ఈ నిధులు విడుదలయ్యాయి.

ఈ నిధులతో శ్రీకాకుళం నగరంలోని ఎన్టీఆర్ మున్సిపల్ హైస్కూల్ మరియు మంత్రి సొంత గ్రామమైన నిమ్మడలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్కిల్ ల్యాబ్స్‌ను నిర్మించనున్నారు. ఒక్కో పాఠశాల అభివృద్ధికి రూ.15 లక్షల చొప్పున కేటాయించగా, ఈ ప్రాజెక్టుకు సంబంధించి శ్రీకాకుళం కలెక్టరేట్ మంగళవారం అధికారికంగా పరిపాలనా అనుమతులు జారీ చేసింది. ముఖ్యంగా ఎన్టీఆర్ మున్సిపల్ హైస్కూల్‌ను తాను దత్తత తీసుకుని ఆదర్శ పాఠశాలగా తీర్చిదిద్దుతానని రామ్మోహన్ నాయుడు గతంలోనే ప్రకటించగా, తాజా నిధుల మంజూరుతో ఆ దిశగా కీలక అడుగు పడింది. ఈ స్కిల్ ల్యాబ్స్ ద్వారా విద్యార్థులకు సాంకేతిక పరిజ్ఞానంతో పాటు ఉపాధికి అవసరమైన వివిధ నైపుణ్యాల్లో శిక్షణ ఇవ్వనున్నారు.

ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు అమలు బాధ్యతలను ప్రభుత్వం సర్వ శిక్షా అభియాన్ అధికారులకు అప్పగించింది. ల్యాబ్స్ నిర్వహణతో పాటు విద్యార్థులకు నిరంతరాయంగా నైపుణ్య శిక్షణ అందించే బాధ్యతను 'కాగ్నో స్పేస్' అనే సంస్థ పర్యవేక్షించనుంది. పైలట్ ప్రాజెక్టుగా చేపట్టిన ఈ కార్యక్రమం విజయవంతమైతే, భవిష్యత్తులో జిల్లాలోని మరిన్ని ప్రభుత్వ పాఠశాలలకు ఈ స్కిల్ ల్యాబ్స్ సౌకర్యాన్ని విస్తరించాలని అధికారులు యోచిస్తున్నారు. కేంద్ర మంత్రిగా బిజీగా ఉన్నప్పటికీ, తన సొంత జిల్లా విద్యాభివృద్ధిపై రామ్మోహన్ నాయుడు చూపుతున్న ప్రత్యేక శ్రద్ధ పట్ల స్థానిక విద్యార్థులు, తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Be the first to react

More Coverage

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ఉపయోగించుకుని రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీశారని మాజీ ముఖ్యమ…

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: రాజధాని అమరావతిలో జరుగుతున్న అభివృద్ధి పనులను రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి…

Delimitation: ఏపీలో మారనున్న రాజకీయ ముఖచిత్రం... మూడు ముక్కలుగా...డీలిమిటేషన్ తో పెరగనున్న ఎంపీ స్థానాలు!

Delimitation: ఏపీలో మారనున్న రాజకీయ ముఖచిత్రం... మూడు ముక్కలుగా...డీలిమిటేషన్ తో పెరగనున్న ఎంపీ స్థానాలు!

Delimitation: కేంద్ర ప్రభుత్వం జూలైలో నిర్వహించబోయే ప్రత్యేక సమావేశాల్లో డీలిమిటేషన్, జమిలి ఎన్నికల…