LIVE
Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  •  AP CRDA: 0.4 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రూపుదిద్దుకుంటున్న నీరుకొండ రిజర్వాయర్...  •  Vishaka: ప్రభుత్వ స్కూల్‌గా మారిన విశాఖ విమల విద్యాలయం.. కలెక్టర్, ఎమ్మెల్యే పల్లా చేతుల మీదుగా ప్రారంభం!  •  6G Network: భారత్‌లో 6G సంచలనం.. టెలికాం రంగం రూపురేఖలు మార్చబోతున్న కేంద్ర ప్రభుత్వ మాస్టర్ ప్లాన్!  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
Politics

PrajaVedhika: ప్రజా గ్రీవెన్స్‌లో అర్జీల వెల్లువ.. బాధితుల గోడు.. నేతల భరోసా! రేపటి ప్రజా వేదికలో పాల్గొననున్న ముఖ్య నాయకులు వీరే!

Praja Vedhika: మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో రేపు (ఏప్రిల్ 15 , 2026) నిర్వహించనున్న "ప్రజా వేదిక" కార్యక్రమం పాల్గొననున్న ముఖ్య నాయకుల షెడ్యూల్....

AndhraPravasi News Desk 2 min read
PrajaVedhika: ప్రజా గ్రీవెన్స్‌లో అర్జీల వెల్లువ.. బాధితుల గోడు.. నేతల భరోసా! రేపటి ప్రజా వేదికలో పాల్గొననున్న ముఖ్య నాయకులు వీరే!

Politics- ప్రజా గ్రీవెన్స్‌లో అర్జీల వెల్లువ.. పింఛన్లు, రేషన్ కార్డుల కోసం సామాన్యుల క్యూ…

భూ ఆక్రమణలపై ఉక్కుపాదం.. అధికారులను ఆదేశించిన మంత్రి అనగాని…

ప్రజాదర్బార్‌లో ఉద్యోగ వేట.. రెజ్యూమెలతో వచ్చిన నిరుద్యోగ యువత…

Prajavedhika: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరియు తెలుగుదేశం పార్టీ సంయుక్తంగా నిర్వహిస్తున్న 'ప్రజా గ్రీవెన్స్' కార్యక్రమంలో భాగంగా నేడు పలువురు బాధితులు తమ సమస్యలను నేతల దృష్టికి తీసుకెళ్లారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్య ప్రసాద్, ఏపీఐఐసీ చైర్మన్ మంతెన రామరాజు సామాన్యుల నుండి అర్జీలను స్వీకరించారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుండి వచ్చిన బాధితులు తమకు జరుగుతున్న అన్యాయంపై ఆవేదన వ్యక్తం చేస్తూ న్యాయం చేయాలని కోరారు.

ముఖ్యంగా తిరుపతి జిల్లా పీలేరుకు చెందిన ముంతాజ్ అనే మహిళ, తన భర్త చనిపోయిన తర్వాత మరిదులు ఆస్తిని అక్రమంగా పంచుకున్నారని ఫిర్యాదు చేశారు. రీ-సర్వే జరుగుతున్న తరుణంలోనైనా తన భర్త వాటా తనకు దక్కేలా చూడాలని ఆమె వేడుకున్నారు. మరోవైపు ప్రకాశం జిల్లా కంభంపాడు గ్రామంలో సాగునీటి కాలువను అక్రమంగా పూడ్చివేసి ఆక్రమించుకున్నారంటూ కె.వి. లావణ్య కుమారి ఫిర్యాదు చేశారు. దీనివల్ల పంటలు ఎండిపోతున్నాయని, కాలిబాటలు కూడా మూసివేయడం వల్ల రాకపోకలకు ఇబ్బందిగా ఉందని ఆమె పేర్కొన్నారు.

నంద్యాల జిల్లా తువ్వపల్లె గ్రామానికి చెందిన వెంకటరమణ గౌడ్ వినూత్నమైన, బాధాకరమైన సమస్యను సభ ముందుంచారు. గ్రామంలో కేవలం ఒక గజం వెడల్పు గల స్థలంలోనే అంత్యక్రియలు నిర్వహించాల్సిన దుస్థితి ఉందని, పాత శవాల పైనే కొత్త వాటిని పూడ్చాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ భూమి అందుబాటులో లేనందున, ప్రైవేటు భూమినైనా కొనుగోలు చేసి కనీసం రెండు ఎకరాల స్మశాన వాటికను ఏర్పాటు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. మృతులకు గౌరవప్రదమైన అంత్యక్రియలు కల్పించాలని కోరారు.

శ్రీకాకుళం జిల్లాకు చెందిన కృష్ణవేణి అనే మహిళ తన ఉద్యోగ సమస్యను వివరించారు. 25 ఏళ్లుగా ప్రభుత్వ పాఠశాలలో వంట మనిషిగా పనిచేస్తున్న తనను, లంచం ఇవ్వలేదనే కారణంతో ఉపాధ్యాయుడు తొలగించారని వాపోయారు. పేదరికాన్ని ఆసరాగా చేసుకుని తనను తీసేసి, డబ్బులు ఇచ్చిన వారికి ఆ అవకాశం కల్పించారని ఆమె ఆరోపించారు. వీటితో పాటు పింఛన్లు, రేషన్ కార్డులు, గృహ నిర్మాణాలు మరియు అనారోగ్య సమస్యలకు ఆర్థిక సాయం కోరుతూ అనేక మంది బాధితులు మంత్రులకు విన్నపాలు సమర్పించారు.

వచ్చిన ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించిన మంత్రి అనగాని సత్య ప్రసాద్ మరియు మంతెన రామరాజు, బాధితులకు తక్షణ పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చారు. అక్రమ ఆస్తుల వ్యవహారాలు మరియు ఆక్రమణలపై విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రథమ కర్తవ్యమని, ఎక్కడా అవినీతికి తావులేకుండా పారదర్శకంగా న్యాయం చేస్తామని వారు ఈ సందర్భంగా భరోసా ఇచ్చారు.

తేదీ 15-04-2026 న మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించబడనున్న "ప్రజా వేదిక" కార్యక్రమంలో పాల్గొననున్న ముఖ్య నాయకుల షెడ్యూల్

ప్రజా వేదిక షెడ్యూల్  
తేదీ: 15 ఏప్రిల్ 2026 (బుధవారం)  

స్థలం: తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం, మంగళగిరి

1. శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు (గౌరవనీయ మంత్రి)

2. శ్రీ బుచ్చి రామ్ ప్రసాద్ గారు (ఏపీ బ్రాహ్మణ సంక్షేమ కార్పొరేషన్ ఛైర్మన్)

Be the first to react

More Coverage

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ఉపయోగించుకుని రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీశారని మాజీ ముఖ్యమ…

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: రాజధాని అమరావతిలో జరుగుతున్న అభివృద్ధి పనులను రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి…

Delimitation: ఏపీలో మారనున్న రాజకీయ ముఖచిత్రం... మూడు ముక్కలుగా...డీలిమిటేషన్ తో పెరగనున్న ఎంపీ స్థానాలు!

Delimitation: ఏపీలో మారనున్న రాజకీయ ముఖచిత్రం... మూడు ముక్కలుగా...డీలిమిటేషన్ తో పెరగనున్న ఎంపీ స్థానాలు!

Delimitation: కేంద్ర ప్రభుత్వం జూలైలో నిర్వహించబోయే ప్రత్యేక సమావేశాల్లో డీలిమిటేషన్, జమిలి ఎన్నికల…