ఆంధ్రప్రదేశ్‌లోని రైతులకు ప్రభుత్వం నుండి గుడ్ న్యూస్ వచ్చింది. రైతులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. ఈ పథకం కింద రైతుల బ్యాంక్ ఖాతాల్లో నిధులు జమ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది.
ఆగస్టు 2వ తేదీన అన్నదాత సుఖీభవ నిధులు విడుదల కానున్నాయి. అదే రోజున కేంద్ర ప్రభుత్వ PM-KISAN పథకం కింద వచ్చే డబ్బుతో కలిపి, ఒక్క రైతుకు మొత్తం రూ.7,000 వరకూ లభించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ రెండు schemes ద్వారా రైతులకి ఆర్థికంగా ఉపశమనం లభించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది.
ఈ మొత్తాన్ని direct transfer ద్వారా రైతుల ఖాతాలోకి జమ చేయనున్నారు. ఇలాంటి పథకాల ద్వారా రైతుల సంక్షేమం దిశగా రాష్ట్ర ప్రభుత్వం నడుస్తోంది.