ఆంధ్రప్రదేశ్ (AndhraPradesh) మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) ఇండియా టుడేకు ఇచ్చిన పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితం, కుటుంబం, రాజకీయాలు వంటి అనేక అంశాలపై స్పష్టమైన అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఇంటర్వ్యూ (Interview)లో ఆయన తన తండ్రి, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu)తో తన సంబంధం ఎలా ఉంటుందో వివరించారు.
"కింద ఫ్లోర్‌లో ఉంటే ఆయన నా బాస్. పై ఫ్లోర్‌లో ఉంటే నా నాన్న. మా మధ్య స్పష్టమైన గీతలు ఉన్నాయి. పని విషయాలు ఇంట్లోకి రావు. కుటుంబ విషయాలు ఆఫీస్‌లోకి రావు. ఇద్దరికీ మధ్య అనుసంధానం ఉన్నా, వేర్వేరు పాత్రల్లో మేము వ్యవహరిస్తాం" అని లోకేశ్ చెప్పారు.
తన తల్లి నారా భువనేశ్వరి (Nara Bhuvaneshwari) గురించి మాట్లాడుతూ: "నా జీవితాన్ని మలచడంలో మా అమ్మ పాత్ర చాలా కీలకం. ఆమె నా చదువులోనూ, ఆత్మవిశ్వాసంలోనూ, అన్ని అంశాల్లోనూ నన్ను గైడ్ చేసింది. త్యాగం చేసి, తన స్వంత జీవితాన్ని పక్కనబెట్టి నన్ను పోషించింది" అని లోకేశ్ భావోద్వేగంగా చెప్పాడు.
రాజకీయాల్లో (politics)కి అడుగుపెట్టిన తీరును గురించి కూడా లోకేశ్ వివరించారు. “నిర్వహణాభార్యమైన అనేక వ్యాపార బాధ్యతలను పూర్తి చేసి, ఐదు సంవత్సరాల పాటు మా ఫ్యామిలీ బిజినెస్ (Family business)లో పనిచేశాకే రాజకీయాల్లోకి వచ్చాను. ఇప్పుడు పూర్తి స్థాయి ప్రజాప్రతినిధిగా బాధ్యత వహిస్తున్నాను. రాజకీయాలను ప్రజాసేవగా చూస్తాను,” అని చెప్పారు.
సామాజిక అంశాలపై చొరవగా స్పందించే వ్యక్తిగా గుర్తింపు పొందిన లోకేశ్, యువతను రాజకీయాల్లోకి రప్పించాలన్న లక్ష్యంతో తెదేపా యువనేతగా తన పాత్రను కొనసాగిస్తున్నారని తెలిపారు.